Image result for ఆమె పేరు ‘దిశ’"రికార్డుల్లో యువ వైద్యురాలి పేరు మార్చిన పోలీసులు

శంషాబాద్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్‌ వద్ద దారుణ హత్యాచారానికి గురైన యువ వైద్యురాలి పేరును ‘దిశ’గా మారుస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. ఇక మీడియా, సామాజిక మాధ్యమాలు, దస్త్రాల్లో ఆమె అసలు పేరు కాకుండా ‘జస్టిస్‌ ఫర్‌ దిశ’ అని నమోదు చేయనున్నట్లు సైబరాబాద్‌ కమిషనర్‌ వి.సజ్జనార్‌ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దిశపై అఘాయిత్యం జరిగిన స్థలాన్ని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదివారం సైబరాబాద్‌ కమిషనర్‌ వి.సజ్జనార్‌తో కలిసి పరిశీలించారు. ఘటన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం నక్షత్ర కాలనీలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

(Courtesy Eenadu)