భక్తి పేరిట వస్తున్న టెలివిజన్ ఛానల్లు బాబాలకు మంచి వ్యాపారంగా ప్రచార సాధనాలుగా మారిపోయాయి. బాబా రాందేవ్ హిందూ గురువుగా అవినీతి వ్యతిరేక పోరాట యోధునిగా, పతంజలి సామ్రాజ్యాధి నేతగా పేరొందారు. బిజెపికి సన్నిహితుడిగా ఆయన ప్రసిద్ధుడు. ఆయన వందల కోట్ల కార్పొరెట్ సామ్రాజ్యానికి అధిపతి. రెండువేల ప్రాంతంలో హరిద్వార్ లో యోగా శిభిరాల సందర్భంగా ఒక టీవీ ఛానల్ రాందేవ్ యోగాసనాలు మంచి వ్యాపారం చేస్తాయి అని గుర్తించింది.

Ramdev baba Patanjali Business
Ramdev baba Patanjali Business

సంస్కార్ టీవీ తొలుత రాందేవ్ యోగాసనాలకు ప్రచారం కల్పించింది. ఆస్తా టివి దాన్ని అనుసరించింది. నేడు రాందేవ్ సంస్కార్, వేదిక్ వంటి భక్తి ఛానల్స్ కు అధినేత. వీటి ద్వారా ఏటా కోట్ల రూపాయల ఆదాయం గడిస్తున్నారు.