మోడీ ప్రసంగంపై దూరం పాటించిన రామకృష్ణ మిషన్‌

కోల్‌కతా : వివేకానంద జయంతి సందర్భంగా కోల్‌కతా లోని బేలూర్‌ మఠ్‌లో ఆదివారం సీఏఏకు అనుకూలంగా ప్రధాని మోడీ ప్రసంగించారు. ఆ ప్రసంగంతో తమకు ఎటువంటి సంబంధమూ లేదనీ, స్పందించదలుచుకోలేదనీ, తాము ఆతిథ్యం మాత్రమే ఇచ్చామని పేర్కొంటూ రామకృష్ణ మఠ్‌ అండ్‌ మిషన్‌ దూరం పాటించింది. తమ సంస్థ పూర్తిగా రాజకీయే తరమైనదని, ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ మతాలకు చెందిన సన్యాసులు ఉన్నారని తెలిపారు. రామకృష్ణ మిషన్‌ ప్రధాన కార్యదర్శిస్వామి సువిరానంద మీడియాతో మాట్లా డుతూ ‘అతిథి దేవోభవ భారతీయ సంస్కృతి. ఆయ నకు అన్ని రకాలుగా మర్యాదలు చేశాం. ఆయన ఇక్కడ ఏమై నా మాట్లాడ కూడదని మీరు భావిస్తే… ఆ మాటలకు ఆయ నదే బాధ్యత అవుతుంది. అంతేకాని ఆతిథ్యం ఇచ్చిన వారిది కాదు.’ అని పేర్కొన్నారు. ‘మా సంస్థ హిందూ, ఇస్లాం, క్రిస్టియన్‌ మతాల సన్యాసులను కలిగిన సమగ్ర సంస్థ. మేము ఒకే తల్లిదండ్రుల బిడ్డలైన సోదరుల మాదిరిగా జీవిస్తున్నాం’ అని తెలిపారు.

(Courtesy Nava Telangana)