Image result for ఆరో శిఖరమూ పాదాక్రాంతం"ఆరు ఖండాల్లో ఎత్తయిన పర్వతాల అధిరోహణ పూర్తి
  మిగిలిందిక ఉత్తర అమెరికాలోని డెనాలి

హైదరాబాద్‌: యువ పర్వతారోహకురాలు మాలావత్‌ పూర్ణ మరో ఘనత సాధించారు. ఆరేళ్ల వ్యవధిలోనే ఆరు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను అధిరోహించి చరిత్ర సృష్టించారు. సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన ఈమె..ఈ నెల 26న అంటార్కిటికా ఖండంలో 16,050 అడుగుల ఎత్తులో ఉన్న విస్సన్‌ మసిఫ్‌ పర్వతంపై అడుగుపెట్టి సగర్వంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను అధిరోహించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన యాత్రలో ఇక ఒక ఖండం మాత్రమే మిగిలి ఉంది. ఉత్తర అమెరికాలోని ‘డెనాలి’ని అధిరోహిస్తే ఆ కల సైతం సాకారమవుతుంది. ‘‘తెలంగాణ సర్కారు సంపూర్ణ మద్దతుతో ఈ రికార్డులు సాధించా. నాలాంటి నిరుపేదలకు అండగా ఉంటున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞురాలిని’’ అని ఈ సందర్భంగా మాలావత్‌ పూర్ణ తెలిపారు. ‘పూర్ణ ప్రపంచ పర్వతారోహకురాలిగా తెలంగాణకు, దేశానికి గర్వకారణం. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఆమె స్ఫూర్తిగా నిలిచింది’’ అని గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆనందం ప్రకటించారు.

(Courtesy Eenadu)