న్యూఢిల్లీ: ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎ్‌సబీ) మోసాలు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య కాలం లో ప్రభుత్వ బ్యాంకుల్లో 5,743 మోసాల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల కింద నమోదైన లావాదేవీల విలువ రూ.95,700 కోట్ల వరకు ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభలో లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పీఎ్‌సబీల్లో మోసాలకు చెక్‌ పెట్టేందుకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా వివిధ కంపెనీలకు చెందిన నిర్వహణలో లేని 3.38 లక్షల ఖాతాలను మూసివేసినట్టు మంత్రి చెప్పారు.

ఎన్‌సీఎల్‌టీ ముందుకు డీహెచ్‌ఎఫ్ఎల్‌!
పీకల్లోతు అప్పుల్లో ఉన్న డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ దివాలా ప్రక్రియకు సిద్ధమవుతోంది. దివాలా చట్టంలోని సెక్షన్‌ 227 కింద ఈ కంపెనీని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కు నివేదించాలని బ్యాంకులు భావిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే డీహెచ్‌ఎ్‌ఫఎల్‌.. దివాలా కోసం ఎన్‌సీఎల్‌టీ ముందుకు వస్తున్న తొలి ఎన్‌బీఎ్‌ఫసీ కానుంది. రూ.500 కోట్లు అంతకంటే ఎక్కువ ఆస్తులున్న ఎన్‌బీఎ్‌ఫసీల దివాలా ప్రక్రియను, దివాలా చట్టం (ఐబీసీ)లోని సెక్షన్‌ 227 కింద చేపట్ట వచ్చని కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవలే ప్రకటించింది. దీంతో కంపెనీ నుంచి తమకు రావలసిన రూ.38,000 కోట్ల బకాయిల్లో కొంతైనా రాబట్టుకునేందుకు డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ను ఎన్‌సీఎల్‌టీకి ఈడ్చాలని బ్యాంకులు భావిస్తున్నాయి.

Courtesy AndhraJyothy…