మనుధర్మ శాస్త్రాన్ని,ఫాసిస్టు ప్రభుత్వాలని సమర్థించే న్యాయవ్యవస్థని కులవ్యతిరేక ఉద్యమం తీవ్రంగా విమర్శిస్తుంది. జులై 3,2020 న ట్రేడ్ యూనియన్లు నిర్వహించబోయే దేశవ్యాప్త నిరసనలకి కులవ్యతిరేక ఉద్యమం మద్దతు తెలుపుతుంది.

ఈమధ్య కాలంలో కరోనాతో సతమతమవుతున్న పరిస్థితుల్లో మనుధర్మ శాస్త్రానికి,బ్రాహ్మణవాదానికి, వ్యాపార సంస్థలకి అనుకూలమైన తీర్పులు వెలువరించిన న్యాయవ్యవస్థని తీవ్రంగా విమర్శిస్తూ కులవ్యతిరేక ఉద్యమం ఓ ప్రకటనని విడుదల చేసింది. ప్రజలని అణగదొక్కుతున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జులై 3,2020 న ట్రేడ్ యూనియన్లు చేపట్టబోతున్న దేశవ్యాప్త నిరసనలకి కులవ్యతిరేక ఉద్యమం మద్దతు తెలుపుతుంది. ఇటీవలి కాలంలో న్యాయవ్యవస్థ నుంచి ఒకదాని తర్వాత ఒకటి వెలువరించబడిన తీర్పులు న్యాయవ్యవస్థలో ఫాసిస్టు ధోరణులు ఏమేరకు పెరిగాయో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఉదాహరణకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన ఇటీవలి తీర్పులో రిజర్వేషన్ ప్రాథమిక హక్కు కాదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇది ఇవాళ మనం చూస్తున్న న్యాయం. ఇలాంటి తీర్పు రావడంతో ఆనందించిన గోదీ మీడియా ప్రధాన నాయకుడు మరియు జీ న్యూస్ ప్రధాన ఎడిటర్ సుధీర్ చౌదరి రిజర్వేషన్ వ్యక్తుల్ని పని నుంచి తప్పించుకునే బాధ్యతారాహిత్యమైన వ్యక్తులుగా మారుస్తుందని అన్నారు. ఓవైపు చట్టం అల్లర్లని ప్రేరేపించే కపిల్ మిశ్రా,అనురాగ్ ఠాకూర్ లాంటి బిజెపి నాయకులు,మంత్రులకి మరియు అతివాదులకి మిత్రుడైన డీఎస్పీ దేవీందర్ సింగ్ ల విషయంలో ఉదారంగా వ్యవహరించడం మనం చూసాం. మరో వైపు విద్యార్థులు,జర్నలిస్టులు,మేధావులు,భీమా కోరేగావ్ కేసులో ఇరికించబడినటువంటి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలని వ్యతిరేకించిన మానవ హక్కుల కార్యకర్తలపై అదే చట్టం ఉక్కుపాదం మోపుతున్నది. అంతేకాక సర్వోన్నత న్యాయస్థానం కరోనా సంక్షోభం సమయంలో సతమతమవుతున్న ప్రజలకి వైద్యం,రవాణా,జీవనాధారం లాంటి సదుపాయాల్ని కల్పించి వారికి ఉపశమనం కలిగించవల్సిందిగా మోదీ ప్రభుత్వాన్ని ఆదేశించకుండా గుడులు తెరవడానికి,రథయాత్రలకి అనుమతులిస్తున్నది. దీన్ని బట్టి న్యాయవ్యవస్థకి ప్రజల జీవితాల కంటే ఆచారాలే ముఖ్యమని అర్థమవుతున్నది. వ్యాపార సంస్థలకి అనుకూలంగా వ్యవహరించే మోదీ ప్రభుత్వం కరోనాని అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైంది. సర్వోన్నత న్యాయస్థానం కూడా ప్రభుత్వ బాటలోనే పయనిస్తున్నదని తెలిపేందుకు చాలా ఉదాహరణలున్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించడం న్యాయవ్యవస్థ యొక్క ప్రాథమిక బాధ్యత కానీ ఇప్పుడదే న్యాయవ్యవస్థ సహాయంతో ప్రభుత్వం మరో చట్టాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నది. ఎస్సీ,ఎస్టీలకి పలు ప్రయోజనాలు కల్పించిన రాజ్యాంగంలోని 341,342 ఆర్టికల్స్ త్వరలో రాజ్యాంగం నుంచి తొలగించబడనున్నాయి.

వ్యాపార సంస్థల ప్రతినిధి ఐనటువంటి ఫాసిస్టు ఆరెస్సెస్ మరియు మోదీ ప్రభుత్వం కోవిడ్-19 సంక్షోభాన్ని ఉదారవాద విధానాల అమలుకి,ప్రైవేటీకరణకి మరియు ప్రజల్ని అణగదొక్కడానికి లభించిన అవకాశంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ అంశాల్లో న్యాయవ్యవస్థ కూడా ప్రభుత్వానికే సహకరిస్తున్నది. అణచివేసే వ్యవస్థలైనటువంటి ఈ అనాగరిక బ్రాహ్మణీయ వ్యాపార సంస్థలకి వ్యతిరేకంగా అన్ని వర్గాలకీ చెందిన ప్రజలు,శ్రామికులు కలిసికట్టుగా పోరాడాల్సిందిగా కులవ్యతిరేక ఉద్యమం విజ్ఞప్తి చేస్తున్నది.

అణగదొక్కబడిన భారతీయ ప్రజల ఐక్యత వర్ధిల్లాలి. ప్రజలకి విజయం లభించుగాక.

కులవ్యతిరేక ఉద్యమం యొక్క జాతీయ కమిటీ తరపున బిందూ మేశ్రమ్,యు.సాంబశివరావు,జిందా భగత్, బండారి లక్ష్మయ్యలచే ప్రచురించబడినది.

Anti-caste movement severely criticizes the pro Manu fascist orientation of judiciary.
Anti-caste movement supports the nation wide protest organised by trade unions on 3rd July 2020.

Through a statement published, Anti- caste movement severely criticized Pro- Manu, pro-Brahmanism and pro-corporates judgements issued by judiciary recently in Corona-ridden times. Anti-caste Movement supports the nationwide protest on 3rd July 2020 called by trade unions to oppose suppression of people by Modi government. The recent judgements, one after another, issued by judiciary, speaks for the fascistization of judiciary. For example, in the recent judgement in respect of National Institute of Technology Supreme Court has commented that reservation is not fundamental right and this is today’s justice. Being pleased buy this verdict, the chief captain of Godi media Mr. Sudhir Chaudhary, the editor-in-chief of Zee News said that reservation makes a person shirker. On one hand we witnessed, the law is generous towards riot-monger BJP leaders and ministers like Kapil Sharma and Anurag Thakur and DSP Devinder Singh, the close ally of extremists; on the other hand, the law tightens its grip on students, journalists, intellectuals and the human right activists, implicated in Bhima Koregaon case who have opposed anti-people policies of the government. Beside this, instead of giving directions to Modi government to grant relief to Corona afflicted masses by providing them with health facilities, transportation and livelihood , the Supreme court is permitting rathayatras and opening of temples. It shows that the judiciary is more concerned with rituals than peoples’ life. The pro- corporate Modi government has totally failed in warding off the danger of Corona and the Supreme court seems to follow in the footsteps of this failed government. There are many such examples. Though it is fundamental duty of the judiciary to protect the Constitution, the government is going to affect one more law with the support of the judiciary. Under the Article 341 and 342 of the Constitution, the scheduled castes and schedule tribes are listed for various benefits and the same articles are going to be removed from the Constitution.

The fascist RSS, the agent of corporates and Modi government have brazenfacedly attempted to turn the danger of Covid-19 into an opportunity to augment policies of liberalisation, privatisation and Manutisation to suppress masses and the Judiciary has been cooperative in this. Anti- caste Movement appeals to all sections of deprived toiling masses to unite themselves to oppose this oppressive system of barberic brahmanical corporates.

Long live unity of Indian oppressed masses. Victory to people.

Published by Bandu Meshram, U. Sambashiv Rao and Zinda Bhagat, Bandari Laxmaiah on behalf of National Committee of Anti-caste Movement.

प्रेस विज्ञप्ति
जाति उन्मूलन आंदोलन ने न्यायपालिका के मनुवादी, फासीवादी अभिमुखीकरण की तीव्र निंदा की।
ट्रेड यूनियनों द्वारा आयोजित 3 जुलाई के प्रदर्शन का समर्थन किया।

जाति उन्मूलन आंदोलन ने आज जारी एक बयान में कोरोना संकट के दरमियान फासीवादी मोदी सरकार की मंशा के अनुरूप न्यायपालिका द्वारा लगातार मनुवादी/ब्राह्मणवादी व कॉर्पोरेटपरस्त जनविरोधी फैसलों की तीव्र निंदा की है। इस सरकार द्वारा किये जा रहे मेहनतकशों के दमन के खिलफ ट्रेड यूनियनों द्वारा आयोजित 3 जुलाई के अखिल भारतीय प्रदर्शन का जाति उन्मूलन आंदोलन ने समर्थन किया है।
गत दिनों न्यायपालिका द्वारा किये गए एक के बाद एक फैसले उसके तेज होते फासीवादीकरण का प्रतीक है। मिसाल के तौर पर हाल ही में सर्वोच्च न्यायालय ने नीट को लेकर अहम टिपण्णी की है कि “आरक्षण मौलिक अधिकार नहीं है, यह आज का कानून है”। इस फैसले से ख़ुशी से सराबोर गोदी मीडिया के कमांडर ज़ी न्यूज़ के संपादक सुधीर चौधरी ने कहा है कि आरक्षण कामचोर बनाता है। दूसरी ओर देखिये दिल्ली में सांप्रदायिक दंगा भड़काने वाले भाजपाई नेता/मंत्री (कपिल शर्मा, अनुराग ठाकुर) व आतंकवादियों के घनिष्ठ सहयोगी डीएसपी देविंदर सिंह जैसों के लिए कानून का शिकंजा ढीला किया जाता है और मोदी सरकार की घोर जनविरोधी नीतियों का विरोध करने वाले विद्यार्थी, पत्रकार, बुद्धिजीवियों तथा भीमा कोरेगांव के मामले में साजिशन बंदी प्रख्यात मानवाधिकारवादियों पर कानून का शिकंजा मजबूती से कसा जाता है। इसके अलावा कोविड के संकट में सबसे ज़्यादा परेशान, बदहाल गरीब मेहनतकश आम जनता के लिए स्वास्थ्य सुरक्षा, सुरक्षित आवागमन तथा रोजी-रोटी को सुनिश्चित करने के लिए केंद्र सरकार को निर्देश देने की जगह न्यायपालिका, रथयात्रा व मंदिरों के पट खोलने की अनुमति प्रदान कर रहा है। मतलब न्यायपालिका के लिए जनता के जीवन से ज़्यादा धार्मिक कर्मकांड महत्वपूर्ण है। कोरोना की समस्या से निपटने में में नाकाम इस नाकारा व गैर ज़िम्मेदार कॉर्पोरेटपरस्त मोदी सरकार पर अंकुश डालने की जगह न्यायपालिका भी उसी की तर्ज पर चल रही है। ऐसे ढेरों उदाहरण हैं। जिनकी मूल ज़िम्मेदारी संविधान की रक्षा होनी चाहिए उस न्यायपालिका के समर्थन से तानाशाही राजसत्ता एक और कानून लाने जा रही है जिससे दलित, आदिवासी तथा अन्य पिछड़ा वर्ग का अधिकार समाप्त होने वाला है। मोदी सरकार आने वाले दिनों में SC/ST/OBC का जन्म प्रमाण पत्र जिस धारा 341 के तहत बनता है और आरक्षण मिलता है उसे हटाने जा रही है। कॉर्पोरेट ताकतों के दलाल फासीवादी आरएसएस व मोदी सरकार जिस निर्लज्ज तरीके से आपदा को अवसर बनाने के लिए उदारीकरण/निजीकरण/मनुवादीकरण का बुलडोज़र देश की जनता के सीने पर चला रही है, न्यायपालिका इस मामले में पूरी तरह मोदी सरकार की सहयोद्धा है। जाति उन्मूलन आंदोलन इस फासीवादी निज़ाम और उसके कॉर्पोरेट ब्राह्मणवादी बर्बर दमन के खिलाफ तमाम वंचित वर्गों, मेहनतकशों व आम जनता को एकजुट होकर प्रतिरोध करने का आह्वान करता है।

बंडू मेश्राम, यू शाम्बशिव राव, जिन्दा भगत
जाति उन्मूलन आंदोलन की राष्ट्रीय कार्यकारिणी की ओर से