ప్రణయ్ ని చంపించిన క్రూరుడు మారుతీరావుకి ఇచ్చిన బెయిల్ ని వెంటనే రద్దు చేయాలి. సోషల్ మీడియాలో అమృతను అవమానించి బెదిరిస్తున్నసైబర్ నేరగాళ్లపై కేసులు నమోదు చేసి శిక్షించాలి. ఈ బెదిరింపుల్ని ప్రోత్సహిస్తున్న మారుతీరావు కండిషన్ బెయిల్ వెంటనే రద్దు చేయాలి. మారుతీరావు విడుదల కావడం వల్ల  సాక్షులను ప్రభావితం చేయటమేకాక, అతని వల్ల బాధితులయిన అమృత, బాలాస్వామి అమృత- ప్రణయ్ ల పసిబిడ్డ నిహాన్ ప్రణయ్ లకు ప్రమాదం పొంచిఉన్నందువల్ల SC,ST చట్టం ప్రకారం అతడిని మిర్యాలగూడ పట్టణం , నల్గొండ ఉమ్మడి జిల్లా నుండి వెంటనే బహిష్కరించాలి. మిర్యాలగూడ పట్టణంలోనే స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరమే న్యాయవిచారణ జరపాలి. న్యాయవిచారణలో బాధితులకు అండగా , నిందితులకు కఠిన శిక్షలు పడేలా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించాలి, నిందితులు నేరంనుండి తప్పించుకోకుండా పోలీసు అధికారులు వెంటనే చార్జీషీట్ వేయాలి అని డిమాండ్ చేస్తూ 1-05-2019 మిర్యాలగూడలో ప్రెస్ మీట్ జరిగింది.

Usaa, Sadanadam – UCCRI(ML) and Bandari Laxmaiah with Pranay Son Nihan Pranay

ప్రణయ్- అమృత న్యాయపోరాట సంఘీభావ కమిటి: (1) ఉ. సాంబశివరావు – ఉ.సా., బహుజన ప్రతిఘటన  వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్(2) బండారి లక్ష్మయ్య, KNPS రాష్ట్ర అధ్యక్షులు(౩)  గడ్డం సదానందం, రాష్ట్ర కన్వీనర్ కులనిర్మూలన ఉద్యమం (CAM)(4)  పెరుమాళ్ల బాలస్వామి, ప్రణయ్ తండ్రి(5) అమృత – ప్రణయ్ భార్య(6) డా.. రాజు , స్థానిక వైద్యులు, మిర్యాలగూడ (7) శ్రీరాములు, సామాజిక కార్యకర్త మిర్యాలగూడ