న్యూఢిల్లీ: మాలేగావ్‌ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలు, వివాదాస్పద బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ను కేంద్రం ‘రక్షణ వ్యవహారాలపై పార్లమెంటు ఉమ్మడి సంప్రదింపుల కమిటీ’ సభ్యురాలిగా నియమించింది. జమ్మూకశ్మీరు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న ఫరూక్‌ అబ్దుల్లాకు కూడా కమిటీలో చోటు దక్కింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సారథ్యంలోని 21 మంది సభ్యుల కమిటీలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు. కాగా.. అద్దె గర్భం నియంత్రణ బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ స్థాయి సంఘానికి నివేదించింది. అటు.. కొత్త విద్యా విధానం (ఎన్‌ఈపీ) ముసాయిదాపై రెండు లక్షలకు పైగా సూచనలు అందాయని, ప్రతి సూచననూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు.

Courtesy Andhrajyothy…