భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులకు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో జ‌రిగిన ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సంఘటనా స్థలంలో ఒక 8 mm రైఫిల్, బ్లాసింగ్ కు ఉప‌యోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంట‌ర్ నుంచి పలువురు మావోయిస్టులు తప్పించుకున్నారని వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ సునీల్‌ దత్‌ తెలిపారు. మృతులు శబరి ఏరియా దళ సభ్యులుగా గుర్తించినట్లు వెల్లడించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఇవాళ మధ్యాహ్నం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. కాల్పులు జరుపుతూ నక్సల్స్ తప్పించుకున్నారు.  తర్వాత ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా  ఎస్బిబిఎల్ తుపాకీ, కిట్ బ్యాగులు, సోలార్ ప్లేట్ తదితర సామగ్రి లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న పోలీసులు… తప్పించుకుని పారిపోయిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.