Image result for కుటుంబాలకు పరిహారమివ్వాలి"ఎన్‌కౌంటర్‌ జరిగితే ఏం చేయాలంటే!
సుప్రీంకోర్టు పదహారు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ, డిసెంబరు 6: పోలీసులతో ఎన్‌కౌంటర్లో వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినపుడు తూతూమంత్రంగా విచారణ జరిపి కేసు మూసేయడం కుదరదని ఐదేళ్ల క్రితమే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో సుప్రీం తీర్పు చర్చకు వస్తోంది. ఎన్‌కౌంటర్‌ దర్యాప్తులో 16 అంశాలను పాటించాలని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. అందులో కొన్ని..
1) ఫలానా చోట నేరస్థులు తిరుగుతున్నారని సమాచారం అందినపుడు దాన్ని రికార్డు చేయాలి.
2) ఎన్‌కౌంటర్‌ మరణాలకు తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. దాన్ని అన్నికేసుల్లాగే కోర్టుకు పంపించాలి.
3) పోలీసు దర్యాప్తునకు సమాంతరంగా సీఐడీ దర్యాప్తు చేయాలి. పోస్ట్‌మార్టం కార్యక్రమాన్ని వీడియో తీయాలి.
4) మెజిస్టీరియల్‌ దర్యాప్తు జరపాలి.
5) ఎన్‌కౌంటర్‌ జరిగిన సమాచారాన్ని జాతీయ లేదా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఇవ్వాలి.
6) ఎఫ్‌ఐఆర్‌ను, డైరీ ఎంట్రీలను, పంచనామాలను, ఇతర సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా కోర్టుకు సమర్పించాలి.
7) వేగంగా అభియోగపత్రం నమోదు చేయాలి.
8) రాష్ట్రంలో జరిగిన ఇలాంటి అన్ని ఎన్‌కౌంటర్లపై ఆర్నెల్లకు ఒకసారి ఎన్‌హెచ్‌ఆర్‌సీకి నివేదిక పంపాలి.
11) పోలీసులు తప్పుచేసి ఉంటే చర్యలు తీసుకోవాలి.
12) మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి.
13) ఎన్‌కౌంటర్‌ కాగానే పోలీసులకు అవార్డులు ఇవ్వడం మానుకోవాలి. అన్ని అనుమానాలు నివృత్తి అయ్యాకే వారిని అవార్డులకు పరిశీలించాలి.

(Courtesy Andhrajyothi)