పౌరసత్వ బిల్లు కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. వీరిలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విద్యార్థులు కూడా ఉన్నారు. దాదాపు 50 మంది ఉన్నారని తెలియవచ్చింది. కాగా సెంట్రల్ యూనివర్సిటీ నుంచి అరెస్టు చేసి తీసుకెళ్లిన విద్యార్థుల్ని మొయినాబాద్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లినట్లు ఉద్యమకారుల ద్వారా తెలుస్తున్నది.