న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ సందర్భంగా.. నిబంధనలను పాటించనందుకు ఓ దేశ ప్రధాని రూ. 13 వేల జరిమానా కట్టిన సంఘటనను ప్రస్తావించారు. దాంతో ఆ ప్రధాని ఎవరనే చర్చ మొదలైంది. మోదీ ప్రస్తావించిన ఆ ప్రధాని.. బల్గేరియా ప్రధానమంత్రి బోయ్కో బొరిస్సోవ్‌.

గత నెల 23న ఒక చర్చి సందర్శనకు వెళ్లినప్పుడు బోయ్కో బొరిస్సోవ్‌ మాస్క్‌ ధరించలేదు. దీన్ని గమనించిన ఆ దేశ ఆరోగ్య అధికారులు ఆయనకు 300 లెవ్స్‌ (రూ. 13 వేలు) జరిమానా విధించారు. ఆయనతోపాటు ఉన్న జర్నలి‌స్టలు, ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్లకు కూడా జరిమానా విధించారు.

Courtesy AndhraJyothy