న్యూఢిల్లీ, మార్చి 17: నౌకాదళంలో మహిళా అధికారులకు పర్మనెంట్‌ కమిషన్‌ ఇచ్చేందుకు వీలుకల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ మేరకు చారిత్రక తీర్పు వెలువరించింది. తరతరాలుగా తీవ్ర వివక్షకు గురైన మహిళలు కార్యాలయాల్లో తమ సత్తాను నిరూపించుకునేందుకు, పురుషులతో సమాన అవకాశాలు పొందేందుకు దీనిద్వారా మార్గం సుగమం అవుతుందని ధర్మాసనం పేర్కొంది. సాయుధ దళాల్లో స్త్రీ పురుషుల మధ్య  సమానత్వం పాటించకపోవడానికి, వారికి రాజ్యాంగపరమైన సమాన హక్కులు కల్పించకపోవడానికి 101 కుంటిసాకులు చెప్పినా చెల్లవని ధర్మాసనం స్పష్టం చేసింది.

Courtesy Andhrajyothi