డెహ్రాడూన్‌: కరోనాకు ఔషధం కనుగొన్నమంటూ గత వారం హడావుడి చేసిన యోగా గురు రాందేవ్‌ బాబాకు చెందిన పతంజలి సంస్థ తాజాగా మాట మార్చింది. తాము విడుదల చేసిన కరోనిల్‌ ఔషధం కరోనాను నయం చేస్తుందని కానీ వైరస్‌ నియంత్రిస్తుందని ఎక్కడ చెప్పలేదని పతంజలి సంస్థ సీఈవో ఆచార్య బాలకృష్ణ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఇచ్చిన నోటీ్‌సకు సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి నిబంధనలను ఉల్లఘించలేదన్నారు.

కరోనా కిట్‌ పేరుతో ఎటువంటి అమ్మకాలు జరపలేదని జైపూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌సలో కరోనా రోగులపై నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమైన విషయాన్ని ప్రకటించడానికి మాత్రమే మీడియా సమావేశం నిర్వహించామని బాలకృష్ణ తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏదో కుట్ర దాగి ఉందని కేంద్ర ఆయష్‌ మంత్రిత్వ శాఖ కోరితే తిరిగి క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

Courtesy AndhraJyothy