• లేడీ లాయర్లూ 18 శాతమే
  • ఇండియా జస్టిస్‌ రిపోర్టు 2019 వెల్లడి
  • కావాల్సినన్ని కోర్టుల్లేవు
  • 8 కోట్ల కేసులు పెండింగ్‌
  • జైళ్లూ సక్కగ లేవు.. సిబ్బందీ తక్కువే

దేశంలో లేడీ పోలీసులు, లేడీ లాయర్లు తక్కువున్నరట. పోలీసు పెద్దాఫీసర్లల్లోనూ వేళ్ల మీదలెక్కపెట్టే మందే ఆడవాళ్లున్నారట. దేశవ్యాప్తంగా కావాల్సినన్ని కోర్టులూ లేవట. ఉన్న కోర్టుల్లో కూడా లక్షల్లో కేసులు పెండింగ్‌‌లో ఉన్నా యట. జైళ్ల పరిస్థితీ దారుణంగా ఉందట. వాటిల్లో స్టాఫ్‌‌ కూడా కావాల్సినంత మంది లేరట. ఈ విషయాలన్నీ ఇండియా జస్టిస్‌‌ రిపోర్టు 2019 వెల్లడించింది. టాటా ట్రస్స్‌ట్ ఆధ్వర్యంలో సెంటర్‌‌ ఫర్‌‌ సోషల్‌‌ జస్టిస్‌‌, కామన్‌‌ కాజ్‌ ,కామన్‌‌వెల్త్‌‌ హ్యూమన్‌‌ రైట్స్‌‌ ఇనిషియేటివ్‌‌, దక్ష,టాటా ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్ సోషల్‌‌ సైన్సెస్‌‌, ప్రయాస్‌‌,విధి సెంటర్‌‌ ఫర్‌‌ లీగల్‌‌ పాలసీ కలిసి ఈ రిపోర్టునురూపొందించాయి.

దశాబ్దాలు పడుతుంది
దేశంలో 2.4 కోట్ల మంది పోలీసుల్లో 7 శాతం మందేమహిళలున్నారని రిపోర్టు వెల్లడించింది. ఈ 2.4కోట్ల మందిలోనూ ఆఫీసర్‌‌ ర్యాంకు ఆడవాళ్లు 6శాతం మంది ఉన్నారని చెప్పింది. రాష్ట్రాలు ఇప్పటినుంచి ఒక్కో శాతం మహిళా పోలీసుల సంఖ్యను పెంచుకుంటూ పోయినా 33 శాతం రిజర్వేషన్‌‌ చేరుకోవడానికి దశాబ్దాలు పడుతుందని వివరించిం ది.మహిళలే కాదు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలూ పోలీసు పోస్టుల్లో తక్కువగానే ఉన్నా రని, రిజర్వ్‌‌డ్ పొజిషన్స్‌‌లో చాలా వరకు పోస్టులు ఖాళీగా ఉన్నా యని రిపోర్టు చెప్పింది. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 6.4 శాతంమంది పోలీసులకే ఇన్‌‌ సర్వీస్‌‌ ట్రైనింగ్‌‌ ఇచ్చారని, అంటే ప్రస్తుతం సుమారు 90 శాతం మంది పోలీసులు అప్‌‌ టు డేట్‌‌ ట్రైనింగ్‌‌ లేకుండానే ప్రజలతో డీల్‌‌ చేస్తున్నా రని చెప్పింది.

పెండింగ్‌ కేసులూ ఎక్కువే
దేశంలోని జ్యుడీషియరీ సిస్టమ్‌‌లోనూ ఆడవాళ్ల సంఖ్య తక్కువగానే ఉందని రిపోర్టు చెప్పింది. ఇండియాలోనిమొత్తం లాయర్లలో 18 శాతం మందే మహిళలున్నారంది. దేశవ్యాప్తంగా 2.8 కోట్ల కేసులు పెండింగ్‌‌లోఉన్నాయని, వీటిల్లో 24 శాతం కేసులు ఐదేళ్లుగా,23 లక్షల కేసులు పదేళ్లుగా పెండింగ్‌‌లో ఉన్నాయని వివరించింది. బీహార్‌‌, ఉత్తరప్రదేశ్‌‌, పశ్చిమబెంగాల్‌‌, ఒరిస్సా, గుజరాత్‌‌, మేఘాలయ, అండమాన్‌‌ నికోబార్‌‌ దీవుల్లో ప్రతి 4 కేసుల్లో ఒకటి ఐదేళ్లకు మించి నడుస్తూనే ఉందని చెప్పింది. మంజూరు చేసిన జ్యుడీషియరీ పోస్టులను బట్టి చూస్తే దేశంలో 4,071 కోర్టురూముల అవసరముందని కూడా రిపోర్టు చెప్పింది. పైన చెప్పి న కేటగిరీ లన్నింటిలో మహారాష్ట్ర టాప్‌‌లో ఉంటే ఉత్తరప్రదేశ్‌‌ లాస్ట్‌‌లో ఉందంది. 2017 డేటా ప్రకారం యూపీలో 50 శాతం పోలీసులు పోస్టుల ఖాళీగా ఉన్నాయని వివరించింది. దేశంలో జైళ్ల పరిస్థితి కూడా దారుణంగా ఉందని రిపోర్టు చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న 1,412 జైళ్లలో 621 మందే కరెక్షనల్‌‌ స్టాఫ్‌‌ ఉన్నారంది.

Courtesy V6 velugu..