తెలుగు రాష్ట్రాల్లో రూ.పదికే  ‘కమ్యూనిస్టు ప్రణాళిక’  పుస్తక విక్రయం
 వామపక్ష ప్రచురణ సంస్థల వెల్లడి

హైదరాబాద్‌: ఏటా ఫిబ్రవరి 21వ తేదీని దేశవ్యాప్తంగా ‘రెడ్‌బుక్స్‌ డే’గా పాటించాలని వామపక్షాలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా అభ్యుదయ సాహిత్యాన్ని  ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంకల్పించాయి. ఇందులో భాగంగా మార్క్స్‌, ఏంగెల్స్‌ రచించిన చారిత్రక గ్రంథం ‘కమ్యూనిస్టు ప్రణాళిక’కు సరళమైiన తెలుగు అనువాదాన్ని అయిదు ప్రచురణ సంస్థలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రముఖ రచయిత పికాక్‌ క్లాసిక్‌ స్థాపకుడు ఎ. గాంధి అనువదించిన ఈ పుస్తకాన్ని లక్ష కాపీలు ప్రచురించాయి. తెలుగు రాష్ట్రాల్లోని  200 ప్రాంతాల్లో సభలు, సమావేశాలు, సదస్సుల నిర్వహణతో పాటు సామాజిక శాస్త్రాల పరిచయంలో భాగంగా పుస్తక పఠన కార్యక్రమాలను నిర్వహించనున్నాయి.  ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ పుస్తకాన్ని పది రూపాయలకే విక్రయిస్తామని.. ప్రభుత్వ, ప్రైవేటు గ్రంథాలయాలకు ఉచితంగా అందజేస్తామని ఐదు ప్రచురణ సంస్థలు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. వివరాలకు ప్రజాశక్తి బుక్‌హౌస్‌ను 94900 99057 నంబరులో సంప్రదించవచ్చని సూచించాయి.

Courtesy Eenadu