హైదరాబాద్ : ఈ ఫొటోలోని పాప.. ఇబ్రహీంపట్నం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ స్రవంతి కూతురు. మంగళవారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన పట్టణ ప్రగతి సన్నాహక సమావేశానికి చైర్‌పర్సన్‌ హోదాలో తాను హాజరు కావాల్సి ఉండటంతో.. స్రవంతి తన 7 నెలల పాపను బంధువుకు అప్పగించి వెళ్లారు. దీంతో సమావేశం పూర్తయ్యేదాకా ప్రగతి భవన్‌ బయటే పాప ఎదురుచూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. సమావేశం ముగియగానే స్రవంతి బయటికి వచ్చి.. పాపను ముద్దాడి ఎత్తుకున్న దృశ్యం అందరినీ ఆకర్షించింది. ప్రగతిభవన్‌లో సమావేశం అనంతరం మునిసిపల్‌ చైర్‌పర్సన్లంతా గజ్వేల్‌ టూర్‌కు వెళ్లగా.. బిడ్డ ఎడబాటును భరించలేని స్రవంతి మాత్రం ఆ టూర్‌కు వెళ్లకుండా ఇంటికి వెళ్లిపోయారు.

Courtesy Andhrajyothi