హతీరా (హర్యానా) : బీజేపీ ఆశీర్వాద యాత్ర కార్యక్రమంలో మహిళా డాన్సర్లు అశ్లీల నృత్యాలు చేసిన ఘటన హర్యానా రాష్ట్రంలోని థానేసర్ నియోజకవర్గంలోని హతీరా గ్రామంలో వెలుగుచూసింది.హర్యానా కురుక్షేత్రం అనంతరం జన ఆశీర్వాద యాత్రలో భాగంగా హతీరా గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాక ముందు మహిళా డాన్సర్లు అశ్లీల నృత్యాలు చేసి యువతను ఉర్రూతలూగించారు. బీజేపీ జన ఆశీర్వాద యాత్ర సమావేశంలో అశ్లీల నృత్య ప్రదర్శన నిర్వహించడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ సుధా ఉన్న హోర్డింగు వేదికపై మహిళా డాన్సర్లు అశ్లీల నృత్య ప్రదర్శన చేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

(Courtacy Andhrajyothi)