టీఎస్‌ ఆర్టీసీ ఏర్పాటును తాము చట్టపరంగా గుర్తించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిసింది. ఏపీఎస్‌ ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కానందున టీఎస్‌ ఆర్టీసీ ఏర్పాటును తాము గుర్తించలేదంటూ ఆయన పేర్కొన్నట్లు సమాచారం. సమ్మె వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ సూచించారు. తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ కేంద్రానికి రాసిన లేఖకు సమాధానంగా గడ్కరీ ఈ ప్రత్యుత్తరం రాశారు.

Courtesy Andhrajyothy…