• ఆర్టీసీ యాజమాన్యమూ పట్టించుకోలేదు
  • వైద్యానికి అయిన ఖర్చును మేమే భరిస్తాం
  • సీఎం, మంత్రులను జైలుకు పంపాలి
  • మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి
  • అపోలో ఆస్పత్రికి విపక్ష నేతల తాకిడి
  •  ఆత్మాహుతికి పాల్పడ్డ ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివా్‌సరెడ్డి వైద్య ఖర్చుల విషయంలోనూ ప్రభుత్వం నుంచి సహకారం లేదని, బిల్లును తామే భరిస్తామని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. శ్రీనివా్‌సరెడ్డిది ము మ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, దీనిపై సీఎం కేసీఆర్‌, మంత్రులపై ఐపీసీ 306 సెక్షన్‌ కింద కేసులు పెట్టి, జైలుకు పంపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో శ్రీనివా్‌సరెడ్డి మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 35 రోజుల ముందే సమ్మెనోటీసు ఇచ్చినా సీఎం కేసీఆర్‌ చర్చలకు పిలవకుండా అవమానించారు. అందుకే కార్మికులు సమ్మెబాటపట్టారు. శ్రీనివా్‌సరెడ్డి మరణ వాంగ్మూ లం ప్రకారం.. మంత్రుల ప్రకటనలే ఆయన ఆత్మహత్యకు కారణం. సెల్ఫ్‌డిస్మిస్‌ అంటూ సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో ఎంతో మంది మానసిక క్షోభకు గురయ్యారు’’ అని మండిపడ్డారు. శ్రీనివా్‌సరెడ్డి కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం రూ.50లక్షల పరి హారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థయిర్యం కోల్పోవద్దని, వారి వెంట బీజేపీ ఉంద న్నారు. ఆర్టీసీ సమ్మెతో సీఎం కేసీఆర్‌ పునాదులు కదులుతున్నాయని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆత్మస్థయిర్యం కోల్పోవద్దని కార్మికులను ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి కోరారు. బతికి ఉండి పోరాటం చేద్దామని, ప్రభుత్వ మెడలు వంచి డిమాండ్లను సాధించుకుందా మన్నారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎంపీ వివేక్‌ డిమాండ్‌ చేశారు. కాగా.. శ్రీనివా్‌సరెడ్డి మరణవార్త వినగానే ఆర్టీసీ కార్మికులు డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో తరలించారు. అతడి మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లే వరకు ఆస్పత్రి ఆవరణలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

Courtesy Andhrajyothi…