భారతదేశ వాసులైన  సింధు నాగరికత విజ్ఞాన సిరిసంపదల సృష్టికర్తలు గౌతముడి ఆలోచనల ఆవిర్భావానికి ప్రతిబింబాలే భారతీయ భౌతిక తత్వావేత్తలు..గౌతముడి కాలంలో 60 రకరకాల వృత్తులున్నట్లుగా చరిత్ర చెపుతున్న విషయం తెల్సిందే కదా…

★ ఎవరు ఏవృత్తినైనా చేపట్టే స్వేచ్ఛను హరించి వృత్తికి కులవారసత్వాన్ని అంటగట్టిన మను ధర్మశాస్త్రం సృష్టించిన శ్రామిక కులాల శూద్ర వెనుకబడిన తరగతులవారే బిసిలు.

★  ఒకప్పుడు భౌతిక శాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసినవారే నేడు తమ స్వంత దేశంలో వేలాది కులాలుగా బతుకులిడదిస్తున్నారు.

అలా తరతరాలుగా చారిత్రక అన్యాయానికి, అణచివేతకు గురౌతున్న అణగారిన కులాల వారైనా బిసిలు నేటిపాలకుల వర్తమాన  చారిత్రక అన్యాయానికి కూడా గురవుతున్నారు. అలాంటి బిసిల స్థితిగతుల్ని పరిశీలించటానికి(8 జూలై 2019) వచ్చిన నేషనల్ బిసి కమీషన్ చైర్మన్ గారికి వినతిపత్రాల సమర్పణ జాతర జరిగింది.

★ పోలేరమ్మ ఉండిలో భక్తులు భక్తిశ్రద్ధలతో కానుకల సమర్పణలాగే సాగినతంతు. అందులోఅమాయక శ్రామిక ఉత్పత్తి సేవకులాలైన బీసి ఎ కులాల నాయకులు ఎగబడి తమను ఎస్టీ జాబితాలో చేర్చమని కొందరంటే… కాదు కాదు మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చమని మరికొందరు నేతలు చేసిన వినతులను చూస్తున్నప్పుడు ఆత్మగౌరవమున్న బీసి బిడ్డల గుండె మండుతున్న విషయాన్ని ఈ సోకాల్డ్ బీసి నేతలు గుర్తించి ఉండకపోవచ్చు..

★ ఎస్టీ హోదా అనుభవిస్తున్న ఆదివాసీలు, మైదాన ప్రాంతాల్లోని లంబాడి అమ్మలు అమ్మతనాన్ని అమ్ముకుంటున్న విషయం తెలుసుకోలేని బీసి సమాజంలోని ఆనాటి సంచారజాతులు మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలంటు చేస్తున్న ఐదు దశాబ్దాల పోరాటం నుండి నేర్చుకున్నది ఏమిటి…?

★ ఎస్సీ హోదాను అనుభవిస్తున్న దళితులవి  దేశవ్యాప్తంగా ఎన్నివేల తలలు తెగిపడుతున్నాయో తెలుసుకోలేనంతగావెనుకబడి ఉన్న బీసి సమాజాన్ని జాగృతంచేయడానికి  ఇప్పుడెంతమంది ఫూలే,సావిత్రి బాయిలు పుట్టుకరావాలోకదా….?

★ 50శాతంపైగావున్న బీసి సమాజమే పాలక ప్రభుత్వంగా ఎదగడానికి ఏంచేస్తే బీసి సమాజం బానిసత్వం నుండి రాజకీయ విముక్తి చెందుతుందో ఆలోచించకుండా రాయితీల కోసం అడుక్కుతినేలా కమిషన్ ల చుట్టుతిరగడమంటే బీసి సమాజాన్ని మరిన్ని దశాబ్దాలపాటు బానిసత్వంలోకి నెట్టివేయడమే అవుతుంది..

★ దేశ జనాభాలో 15%మున్న బ్రాహ్మణ,వైశ్య, క్షత్రియా,రెడ్డి కమ్మ,వెలమ తదితర ఆధిపత్య కులాలు ఇప్పటికే 85%శాతం దేశ సంపదపై, వ్యవసాయంపై, పరిశ్రమలపై,రాజ్యాధికారంపై ఆధిపత్యం చలయిస్తూ సంస్కృతి, సంప్రదాయాలను పూర్తిగా తమ అక్రమ ఆధీనంలో ఉంచుకున్న విషయం తెలియనిది కాదు…

★ ఒడ్డించేవారు తమవారైతే సరి అన్నట్లు 5శాతం మంది కూడాలేని ఆధిపత్య కులాల పేదలకి విద్యా ఉద్యోగరంగాల్లో 10శాతం (EWS) రిజర్వేషన్ కోటా కేటాయించారు. 17వ లోక్ సభ ఎన్నికలముందు ఓట్ బ్యాంకు ఎత్తుగడతో ఆగమేఘాలమీద 48గంటల్లో పార్లమెంటు ఉభయసభల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేశారు. 16వ లోక్సభ ఎన్నికల తర్వాత OBC లకు ఇచ్చిన ఎబిసిడి వర్గీకరణ హామీ అంతకుముందు సంచార జాతులకు ఇచ్చిన ప్రత్యేక రిజర్వేషన్ కోటా హామీలకు మాత్రం ఇంతవరకు అతీగతిలేదు. కేంద్ర బిసి సంఘాలు ఈ సంగతి పట్టించుకోదు గానీ రాష్ట్ర బిసి  కమిషన్ కి తెలంగాణ ప్రభుత్వం చట్టబద్దత ఎందుకు కల్పించలేదు? అని నిలదీస్తుంది. తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ తెల్లమొహం వేస్తుంది.

★ ఇలాంటి కేంద్ర బీసి కమిషన్ చైర్మన్ తెలంగాణ  వస్తేఏమిటీ? ఆతరువాత ఏపి  వెళితేఏమిటీ? తర్వాత మరికొన్ని రాష్ట్రాలకు వెవెళితే మాత్రం జరిగేదేమిటి ?

★ బిజెపి బీసి కమిషన్.. టిఆర్ఎస్ బీసి  కమిషన్ లతో బీసి సమాజానికి జరిగే ఉపయోగం ఏమిటి ?

★ కాంగ్రెస్ వేసిన కాకా కలేల్కర్, టిడిపి వేసిన అనంతరాములు కమీషన్ నుండి బాలకృష్ణ రేణుకే కమిషన్, బిజెపి వేసిన రోహిణి కమిషన్ ల వరకు బీసిలకు చేసిన సామాజిక న్యాయం ఏమిలేదు! ఈ విషయం బీసి  సమాజానికి తెలియకుండా చేయడంలో విజయం సాధించిన కులాధిపత్య పాలకవర్గాలు ఎప్పటికప్పుడు బీసి ప్రజలను మోసం చేస్తునే ఉన్నారు.

★ ఇప్పుడు బీసి సమాజంలో వివిధ పేర్లతో సంచార,ఎంబిసి,బీసిలుగా పిలువబడే మెజారిటీ ప్రజలు మెజారిటీగా రాజకీయ,ఆర్థిక,సామాజిక దోపిడికి గురవుతున్నారు.. బీసి సమాజానికి ఇప్పుడు కావాలసింది ఎస్టీ,ఎస్సీ హోదాలకోసం గోదాలో కోట్లాడ్డం కాదు జనాభా ధామాషా ప్రకారం అన్నిట్లో మేమేంతో మాకంత వాటా అనే సామాజిక న్యాయ “బిసిలు సగం బిసిలకు సగం” అనే సామాజిక న్యాయచైతన్యంతో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ బహుజనులు ఏకమై రాజ్యాధికారం చేజిక్కించుకొంటే తప్ప మనం అభివృద్ధి చెందలేం. “మన నాలుగు సామాజిక వర్గాలు ఏకమైతే రాకేమైతది బహుజన రాజ్యం”  “చార్ సమాజ్ ఏకీ అవాజ్! తబ్ ఆయేగా బహుజనరాజ్” డిమాండ్ తప్ప బీసి  సమాజానికి ఏది ఆమోదయోగ్యంకాదు కాబోదు…

దండి వెంకట్✍