– వ్యవసాయ రుణాలకు వడ్డీమాఫీ వర్తించదు.. స్పష్టం చేసిన బీజేపీ ప్రభుత్వం

న్యూఢిల్లీ : రైతుల ఆదా యాన్ని రెట్టింపు చేస్తామనీ, వారి కోసం ఆన్‌లైన్‌ వేలం ప్రక్రియను అమలుచేస్తా మన్న మోడీసర్కార్‌ అన్న దాతకు షాకిచ్చింది. ఇన్నాళ్ళు వ్యవసాయానికి పెద్దపీట వేస్తామని చెబుతున్న కేంద్రం ఇప్పుడు కనీసం వడ్డీ మాఫీలోనూ వారి ఆశలపై నీళ్ళుచల్లింది. కరోనా నేపథ్యంలో మారటోరియం ప్రకటించిన కేంద్రం.. అది వ్యవసాయ రుణాలకు చక్రవడ్డీ మాఫీ వర్తించదని స్పష్టం చేసింది. పంట, ట్రాక్టర్‌ రుణాలు వ్యవసాయ రుణాల కిందకే వస్తాయి గనుక వాటికి వడ్డీ మాఫీ ఉండదని తెలిపింది. వడ్డీ మాఫీపై ఉన్న సందేహాలను నివత్తి చేసేలా తరచూ అడిగే ప్రశ్నల జాబితా(ఎఫ్‌ఏక్యూ)ను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది.