– చేయూతనివ్వని ఆత్మనిర్భర్‌
– గుర్తింపునకే నోచుకోని వీధి వ్యాపారులు
– వరుస సమావేశాలతోనే అధికారుల సరి
– ఇబ్బందుల్లో రెండున్నరల లక్షల మంది చిరువ్యాపారులు

కరోనా వ్యాప్తి అరికట్టడం కోసం పెట్టిన లాక్‌డౌన్‌తో కేసులు తగ్గడం మాటేమో గానీ చిరువ్యాపారుల బతుకులు అగమ్యగోచరంగా మారాయి. రోజువారీగా తోపుడు బండ్లపై రకరకాల చిరువ్యాపారాలు చేసే వారు ఒక్కసారిగా ఉపాధి కోల్పోయారు. ఇంటికే పరిమితమైన వారిని ఆదుకోవాలని ప్రజాసంఘాలు, ఇతరులు పలుమార్లు డిమాండ్‌ చేసినా స్పందన కరువైంది. రెండు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.1500 సాయాన్ని కూడా నిలిపేసింది. ఇక ప్రతి పేద కుటుంబానికి నెలకు 50 కిలోల బియ్యంతో పాటు రూ.7500 ఇవ్వాలన్న డిమాండ్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. దీంతో రాష్ట్రంలో దాదాపు రెండున్నర లక్షల మందికి పైగా చిరువ్యాపారులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. పైపెచ్చు ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో ప్యాకేజీ ప్రకటించి చేతులు దులుపుకున్నది.

నిర్మూలనా సంస్థ (మిషన్‌ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ పావర్టీ ఇన్‌ మున్సిపల్‌ ఏరియాస్‌-మెప్మా)కు అప్పగించింది. అయితే మెప్మా వద్ద వీధి వ్యాపారులకు సంబంధించిన పూర్తి డాటా లేకపోవడంతో లబ్దిదారులను గుర్తింపులోనే తీవ్ర జాప్యం జరుగుతున్నది. రాష్ట్రంలో దాదాపు రెండున్నర లక్షల మందికి పైగా ఉంటారని అంచనా. రుణం పొందేందుకు వీరంతా తమ పేర్లను ‘మెప్మా’ వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అవగాహన నిరక్షరాస్యులైన లబ్దిదారుల్లో లేకపోవడంతో 50 శాతం మంది కూడా మెప్మా లబ్దిదారుల జాబితాలో లేకపోవడం గమనార్హం. రంగారెడ్డి లాంటి కొన్ని జిల్లాల్లో బ్యాంకు అధికారులతో మెప్మా అధికారులు సమావేశమై లబ్దిదారులపై చర్చించగా, మరికొన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ మరింత జాప్యమయ్యే అవకాశాలున్నాయని సమాచారం.

మీటర్‌ వడ్డీలవైపు..
వీధి వ్యాపారుల హక్కుల కోసం పోరాడుతున్న కొన్ని సంఘాలు చొరవ తీసుకుని వారి పేర్లను నమోదు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుం చి తగినంత చొరవ లేకపోవడంతో బ్యాంకు రుణం అందరికీ దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ఇప్పుడిప్పుడే సడలింపులతో మళ్లీ పనులు చేపట్టేందుకు ఆసక్తితో ఉన్న చిరు వ్యాపారులు ప్రయివేటు గా వడ్డీ వ్యాపారుల వద్ద రోజు వారీగా మీటర్‌ వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించే ప్రమాదమున్నది. ఇప్పటికే లౌక్‌డౌన్‌తో చితికిపోయిన వీరు మరోసారి మరోసారి ప్రయివేటు వడ్డీ వ్యాపారుల చేతుల్లోకి నెట్టవద్దని పలువురు కోరుతున్నారు.

– అప్పుడే వద్దు.. ఆగండి జులై వరకు రావొద్దు…
– లాక్‌డౌన్‌ దెబ్బకు ఐటీ, బీపీఓ రంగాలు విలవిల
– వేతనాల్లో కోతలు, తొలగింపులు, అన్‌పెయిడ్‌ సెలవులు
– ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ చేసినా చెల్లింపులు లేవు…
డానియల్‌ (పేరు మార్చాం..) పేరొందిన ఐటీ సంస్థ ‘కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌’లో ఐటీ ఉద్యోగి. 8ఏండ్లుగా పనిచేస్తున్నా, మంచి అనుభవం ఉంది..ఏం కాదులే…అనుకుంటే కంపెనీ యాజమాన్యం బలవంతంగా సెలవులు ఇచ్చి మే 22న ఇంటికి పంపింది. ఇలా 700మందిని చెన్నైలోని కాగ్నిజెంట్‌ కార్యాలయంలో తొలగించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బెంగుళూరు, హైదరాబాద్‌, చెన్నైలలో చిన్నా, పెద్దా ఐటీ, బీపీఓ కంపెనీలు తీసుకుంటున్న చర్యలు ఉద్యోగులకు నిద్రలేకుండా చేస్తున్నాయి.

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని అంతమొందిస్తామని కేంద్రం దేశవ్యాప్తంగా కఠినమైన లాక్‌డౌన్‌ విధించింది. కానీ జరిగింది వేరు. ‘కరోనా వైరస్‌’ తప్ప, మిగతావన్నీ దెబ్బతిన్నాయి. ఉపాధి, ఉద్యోగ రంగాలు విలవిల్లాడుతు న్నాయి. ముఖ్యంగా ప్రయివేటు ఉద్యోగుల బాధ వర్ణనా తీతం. నెలవారీగా కట్టాల్సినవాటికి, వచ్చే ఆదాయానికి పొంతన కుదరక మానసిక ఆవేదనకు గురవుతున్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బీపీఓ రంగాల్లో ఉద్యోగాల తొలగింపు, వేతనాల కోతలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వార్తలు వెలువడుతున్నాయి. భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని జులై వరకూ అన్‌పెయిడ్‌ సెలవులపై పంపారని, మెట్రో నగరాల్లో పేరొందిన కంపెనీలు సైతం లే-ఆఫ్‌లు ప్రకటించాయని ‘ఆల్‌ ఇండియా ఫోరం ఫర్‌ ఐటీ ఎంప్లాయిస్‌’ నాయకుడు ఎ.జె.వినోద్‌ మీడియాముఖంగా చెప్పారు. మొత్తంగా చూస్తే….కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ అమలు కారణంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బీపీఓ రంగాల్లో పనిచేస్తున్నవారి భవిష్యత్తు ఒక్కసారిగా తలకిందులైంది. ఈ పరిశ్రమలో వేతనాల కోతలు, ఉద్యోగుల తొలగింపు..క్రమంగా పెరుగుతున్నది. వర్క్‌ ఫ్రం హోం…చేసినా వేతనాలు చెల్లించటం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. పేరొందిన ఐటీ సంస్థల్లో సైతం ఉద్యోగుల్ని ..’బెంచ్‌’ (ఎలాంటి ప్రాజెక్ట్‌ వర్క్‌ ఇవ్వకపోవటం) మీదకు పంపుతున్నాయట.

కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు…చూద్దాం!
దాదాపు అన్ని కంపెనీలు జీతభత్యాల ఖర్చుల్ని తగ్గించుకునే చర్యల్ని చేపట్టాయి. మూడు నెలల జీతం ఇచ్చి టెర్మినేషన్‌ లెటర్‌ (తొలగింపు) చేతిలో పెట్టడం, లేదంటే బలవంతంగా ‘అన్‌పెయిడ్‌ సెలవులు’ ఇవ్వటం చేస్తున్నా యి. మరికొంత మందిని కొత్త ప్రాజెక్టు వచ్చే వరకు ‘బెంచ్‌’ పై కూర్చోబెడుతున్నారు. ఒకవేళ కొత్త ప్రాజెక్ట్‌ రాకపోతే నెల రోజుల తర్వాత ఉద్యోగాన్ని వదిలేయాల్సిందే. అప్పుడు ఉద్యో గికి ఎలాంటి నష్టపరిహారం, ఇతర చెల్లింపులు ఉండవు.

జీతాలు ఎగ్గొట్టే ఎత్తుగడ!
అనేక ఐటీ, బీపీఓ కంపెనీలు తమ వద్ద ఉండే చిన్న చిన్న ప్రాజెక్ట్‌లను వేరే కంపెనీలకు ఇస్తుంటాయి. అలాంటి సంస్థలు ఇప్పుడు లాక్‌డౌన్‌ వేళ అమానవీయంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. రెండు నెలల జీతభత్యాలు పెండింగ్‌లో పెట్టి, మరీ ఎగ్గొడుతున్నాయని, నష్టాలు, కరోనా, లాక్‌డౌన్‌ సాకుగా చూపుతున్నాయని అందులో పనిచేస్తున్నవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉదాహరణకు చెన్నైలోని ‘హెక్సావేర్‌ టెక్నాలజీస్‌’ అనే సంస్థ అనేకమంది ఉద్యోగస్తుల్ని తొలుత ‘బెంచ్‌’పైకి పంపింది. మే, జూన్‌, జులై జీతభత్యాలు ఇవ్వమని ప్రకటించింది. జులైలో కూడా కొత్తప్రాజెక్ట్‌ రాకపోతే ‘టెర్మినేషన్‌’ ఖాయం. అయితే ఇదంతా జీతభత్యాలు ఎగ్గొట్టే ఎత్తుగడ కోసమేనని ఆరోపణలున్నాయి.

Courtesy Nava Telangana