– స్వరాజ్‌ అభియాన్‌ నాయకులు యోగేంద్ర యాదవ్‌
– మోడీ-షా తాత,ముత్తాతలు ఇండియా వారేనా? : రోహిత్‌ వేముల తల్లి రాధిక
భారతదేశం ఏ దేశస్తులనూ తిరస్కరించదని రాజకీయ, సామాజిక ఉద్యామకారుడు, స్వరాజ్‌ అభియాన్‌ నాయకులు యోగేంద్ర యాదవ్‌ అన్నారు. ఎన్సార్సీ, ఎన్‌పీఆర్‌, సీఏఏ వ్యతిరేక పౌర వేదిక ఆధ్వర్యంలో రోహిత్‌ వేముల నాలుగో వర్ధంతి సందర్భంగా బంజారాహిల్స్‌లో శుక్రవారం సామాజిక న్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పౌరసత్వం, రాజ్యాంగబద్ధత, సామాజిక న్యాయం అనే అంశాలపై యోగేంద్ర యాదవ్‌ మాట్లాడుతూ సీఏఏను తీసుకొచ్చి ముస్లింలను టార్గెట్‌ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పౌరసత్వం అంటే సమానత్వంగా ఉండాలన్నారు. కోర్టులు రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీఏఏ, ఎన్సార్సీకి వ్యతిరేకంగా ఉద్యమం మొదలయ్యాక ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా చట్ట వ్యతిరేక అణచివేత చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటి వరకు పోలీసుల కాల్పుల్లో 22 మంది మృతి చెందగా, 19 కేసుల్లో ఆయా కుటుంబాలకు పోస్టుమార్టం రిపోర్టులు అందించలేదన్నారు.

రాధిక వేముల, పాయల్‌ తాడ్వి తల్లి వంటి వారు యాత్ర చేస్తే తామంతా సహకరిస్తామన్నారు. సీఏఏ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యమం తయారైందనీ, దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, దళితులు, ఆదివాసీలు అందరూ సమాన పౌరులన్న సూత్రాన్ని కాపాడుకోవడానికి ఇదో ఉద్యమమన్నారు. రోహిత్‌ వేముల తల్లి రాధిక మాట్లాడుతూ ‘నా కొడుకును ఎలా కాపాడుకోవాలో తెలియలేదు కానీ ఇప్పుడు దేశాన్ని కోల్పోకుండా అందరం కలిసి పోరాడాలి’ అని పిలుపునిచ్చారు.

ముంబయిలో వివక్ష కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డ పాయల్‌ తాడ్వి తల్లి, కనబడకుండాపోయిన జేఎన్‌యూ విద్యార్థి తల్లి, తాను కలిసి ‘జాతి తల్లుల’ బ్యానర్‌ కింద రాజ్యాంగ పరిరక్షణ కోసం యాత్ర చేపట్టనున్నట్టు ప్రకటిం చారు. మోడీ, అమిత్‌ షా తాత, ముత్తాతలు ఇండి యా వారేనా? అని ప్రశ్నించారు. ముందు మీరు, మీ తాత, ముత్తాతలు ఎక్కడ పుట్టారో రుజువు చేసిన తర్వాత ప్రజలు రుజువు చేసుకుంటా రన్నారు.

ఇఫ్లూ ప్రొఫెసర్‌, ముస్లిం మహిళల ఫోరం సభ్యులు అస్మా రషీద్‌ మాట్లాడుతూ సీఏఏ, ఎన్సార్సీ, ఎన్‌పీఆర్‌ న్యాయం, సమానత్వ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉంద న్నారు. దళిత బహుజన ఫ్రంట్‌ కార్యదర్శి శంకర్‌ మాట్లాడుతూ ‘నాకు బర్త్‌ సర్టిఫికెట్‌ లేదు, నేను పుట్టిన తేదీని నా తల్లిదండ్రులు రాయలేదు. అంటే నేను భారత పౌరుడిని కాదా’? అని ప్రశ్నించారు.

(Courtesy Nava Telangana)

పౌరసత్వాన్ని మతంతో ముడిపెడతారా?

  • సీఏఏతో దేశం హిందూ ఇజ్రాయెల్‌గా మారడం ఖాయం
  • ముస్లింల తర్వాత క్రిస్టియన్లు, దళితులు, ఆదివాసీల వంతు
  • త్వరలో భారత్‌ జోడోఉద్యమం: యోగేంద్ర యాదవ్‌
  • భారతీయులమని మోదీ, షా నిరూపించుకోవాలి: రాధిక

హైదరాబాద్‌ సిటీ : పౌరసత్వ చట్టంలో మార్పులు రాజ్యాంగ విరుద్ధమని సామాజిక ఉద్యమకారుడు యోగేంద్రయాదవ్‌ చెప్పారు. దేశ చరిత్రలో తొలిసారి పౌరసత్వాన్ని మతంతో ముడిపెట్టి చట్టం తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ఇదే జరిగితే భారత్‌ త్వరలో ‘హిందూ ఇజ్రాయిల్‌’గా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం 70 ఏళ్లలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే పనులు జరగకపోగా.. నియంతృత్వం వైపు అడుగులు పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.

బంజారాహిల్స్‌లో లామకాన్‌లో ‘వి ద పీపుల్‌ – భారతీయులమైన మనం’ అనే బ్యానర్‌పై ఎన్నార్సీ, సీఏఏ వ్యతిరేక పౌరవేదిక రోహిత్‌ వేముల సంస్మరణ దినోత్సవం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సామాజిక న్యాయదినోత్సవానికి యోగేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నార్సీ, ఎన్పీఏ అమలుకు ముందుకొస్తున్న కేంద్రం.. తొలుత నిరుద్యోగుల, వ్యవసాయదారుల గణన చేపట్టి, అర్హులకు సంక్షేమ పథకాలను అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇప్పుడు ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని, అనంతరం క్రిస్టియన్లు, దళితులు, ఆదివాసీల వంతు వస్తుందని యోగేంద్ర హెచ్చరించారు. మతం ప్రాతిపదికన దేశాన్ని మోదీ, అమిత్‌షా ముక్కలు చేస్తున్నారని, దీన్ని వ్యతిరేకిస్తూ ‘భారత్‌ జోడో’(భారత్‌ను కలపండి) పేరుతో ఉద్యమం ప్రారంభిస్తున్నామన్నారు. రోహిత్‌ వేముల తన సూసైడ్‌ లెటర్‌లో మనిషి పేరు, కులానికి ఉన్న ప్రాధాన్యం మనిషికి, అతడి ఆలోచనలకు లేదని వాపోయిన విషయాన్ని గుర్తుచేశారు. జరుగుతున్న సంఘటనల గురించి తెలియకపోవడంతో కొడుకు రోహిత్‌ను కాపాడుకోలేకపోయానని.. కానీ దేశాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నానని రోహిత్‌ వేముల తల్లి రాధిక అన్నారు.

అన్యాయం, ఆధిపత్యధోరణి, అణిచివేత కారణంగా ఆత్మహత్య చేసుకున్న పాయల్‌తాడ్వి తల్లి, జేఎన్‌యూ విద్యార్థి నజీబ్‌ తల్లితో కలిసి ‘జాతి తల్లుల’ పేరిట దేశవ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్టు ఆమె తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన నాయకులే దాన్ని మార్చాలని చూస్తున్నారని దళిత బహుజన్‌ ఫ్రంట్‌ నేత పి.శంకర్‌ అన్నారు. చదువు, ఇళ్లు లేనివారికి, ఆదివాసీలకు ఏ పత్రాలూ ఉండవని.. పౌరసత్వాన్ని వారెలా రుజువు చేసుకోవాలని ప్రశ్నించారు.

పౌరసత్వ చట్టం ప్రకారం ఆదివాసీలు, వలస కార్మికులు, దళితులు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోలేక పోతారని ఇఫ్లూ ప్రొఫెసర్‌, హైదరాబాద్‌ ముస్లిం మహిళల వేదిక అధ్యక్షురాలు ప్రొఫెసర్‌ అస్మారషీద్‌ చెప్పారు. ఎన్నార్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని నిర్వాహకులు జాహిద్‌ ఖాద్రీ, మీరా సంఘమిత్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ కోదండరాం, పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య తదితరులు పాల్గొన్నారు. (Courtesy Nava Andhrajyothi)


Hyderabad: Rohith Vemula’s mother to launch anti-CAA yatra

HYDERABAD: On the fourth death anniversary of Rohith Vemula, his mother Radhika Vemula appealed to the Hyderabadis to take to the streets to protest the ‘unconstitutional policies’ of the central government. “I couldn’t save my son, but I want to save my nation,” she said on Friday.

Rohith Vemula, a Dalit scholar, had committed suicide allegedly after facing caste-discrimination in the University of Hyderabad. The 26-year-old PhD student was found hanging in his hostel room.

Recalling what Rohith mentioned in his last letter, she said people are reduced to votes. “I am sad and enraged about what is happening with the students of Jawaharlal Nehru University and Jamia Millia Islamia. Even after four years of Rohith’s institutional murder, the situation in the country is same and students are not safe. They are being distinguished based on their caste and religion,” she added.

“I, along with Abeda Salim Tadvi and Fatima Nafees, would launch ‘Mothers for the Nation Yatra’ – a nationwide anti-Citizenship Amendment Act (CAA) tour, to mobilise support for united India and defend basic principles of Ambedkar’s Constitution,” Radhika Vemula said.

Fatima Nafees is mother of Najeeb Ahmed, a 27-year-old student of biotechnology at JNU, who went missing in October 2016, allegedly after a scuffle with ABVP members.

Abeda Salim Tadvi is mother of Payal Tadvi, a medical student from National Medical College and BYL Nair Hospital in Mumbai, who killed herself in May 2019, allegedly due to caste-discrimination.

Radhika also visited Rohith Vemula’s memorial in UoH and garlanded the statue. She said financial difficulties have kept her away from participating in any protest. She further said that Prime Minister Narendra Modi and home minister Amit Shah should to prove their identity first by showing documents of their forefathers, before questioning others.

Speaking at the event ‘We The People of India’, Swaraj Abhiyan chief Yogendra Yadav said the fight against CAA, National Register of Citizens (NRC) and National Population Register (NPR) have become a movement across the nation. Terming the movement as ‘Bharat Jodo Andolan’ like ‘Bharat Chhodo Andolan’ (Quit India Movement), he said the Centre will continue to divide and rule, but we will continue to unite and fight.

“We need to reclaim our Constitution. The freedom movement was to form a nation where people of all religions get equal rights,” Yadav said, adding that democracy, diversity and development have been put at stake by the government.

Stressing on the need to keep the protests non-violent, Yadav said, “Violence will lynch the movement and the only way we can achieve our aim is by remaining aggressively non-violent.”

(Courtesy Times of india)