రచన బి. భాస్కర్

తాజా కేంద్ర బడ్జెట్ ఏడాదికి కోటి రూపాయల బ్యాంకు నగదు లావాదేవీలపై విధించిన 2% లెవీ అన్నదాతలపై ముఖ్యంగా దేశంలో అత్యధికులు గా ఉన్న దళిత బహుజన వర్గాలపై అదనపు భారం పడనుంది.

భారతదేశంలో 57 కోట్ల మంది నేటికి వ్యవసాయ రంగం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. జిడిపిలో 15% ఈ రంగం నుంచే వస్తున్నది. మొత్తం రైతుల్లో 95.1 శాతం మంది చిన్న, సన్నకారు, దిగువ మధ్యతరగతి రైతులే ఉన్నారు. వీరి చేతుల్లో సగటున చూస్తే 2.47 ఎకరాలు, 4పాయింట్ 94, 9.88 ఎకరాల భూమి ఉన్నది అదే మధ్యతరగతి పెద్ద రైతుల చేతుల్లో ఇరవై నాలుగు ఎకరాల కమతం ఉన్నది. గంగా సగటు చూసుకుంటే చిన్న తరహా రైతు కన్నా పెద్ద రైతులకు 45 రెట్ల అధిక భూమి ఉన్నది. చిన్న సన్నకారు రైతులు,కౌలుదారులు అత్యధికులు బీసీ, ఎస్సీ, ఎస్టీలే.20 శాతం భూమి ఎస్సీ, ఎస్టీల చేతిలో ఉన్నదని వ్యవసాయ సర్వే గణాంకాలు చెబుతున్నాయి. అలాగే బీసీల చేతిలో.45 శాతం భూమి ఉన్నది. బిసి, ఎస్టి, ఎస్సిల వన్నీ చిన్న కమతాలను అనేది గమనార్హం ఇది మొత్తం వ్యవసాయ రంగంలో ఉన్న రైతులలో అత్యధిక శాతం దళిత బహుజనులే.  వ్యవసాయ కుటుంబాల్లోని 70శాతం మందికి నెల ఖర్చులకు సరిపడా ఆదాయం రావడం లేదని ఎన్ఎస్ఎస్ సర్వే అధ్యయనం తెలియజేస్తున్నది. వీరి కుటుంబాల నుంచే అత్యధిక శాతం అన్నదాతల ఆత్మహత్యలు నమోదవుతున్నాయి రైతులు తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్లకు తీసుకెళ్లి అమ్ముకుంటారు. ఆంధ్రప్రదేశ్ లోని ఒక మండిలో పరిస్థితి ఒక నమూనాగా చూసినప్పుడు ఏడాది సగటు తీసుకుంటే ఒక్క రోజులోనే రైతులకు ఒక కోటి 20 లక్షల రూపాయల నగదు చెల్లింపులు జరుగుతాయి. నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రకారం కోటి రూపాయల నగదు విత్ డ్రాయల్ ఉంటే 2% లెవీ ముందస్తుగా టిడిస్ రూపంలో రాబడతారు.120 రోజులు ఉంటే 150 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. ఒక మార్కెట్ నుంచే మూడు కోట్ల రూపాయల నిర్మలమ్మ లె వి కట్టాలి అన్నమాట. ఈ మొత్తాన్ని సహజంగానే వ్యాపారులు రైతులకు ఇవ్వాల్సిన మొత్తం నుంచి మినహాయించుకున్నారు అంటే రైతుల ఉత్పత్తులకు వచ్చే ఆదాయం పడిపోతుంది అన్నమాట.. అసలే దేశంలో రైతుల పండించే పంటలకు గిట్టుబాటు ధర రావడంలేదు.

ఇలా ఉంటే మాంసం ప్రాసెసింగ్ ప్లాంట్ లకు పశువుల మార్కెట్ నుంచి క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. గ్రామస్థాయి వ్యాపారులకు రైతులకు మధ్య సగటున రోజుకు కొన్ని కొన్ని మార్కెట్లలో నుంచి 20 లక్షల వరకు లావాదేవీలు ఉంటాయి. ఒక పసుపుకు 20000 అనుకుంటే రూ 400 రైతులకు మినహాయించి వ్యాపారులు ఇకనుండి ఇస్తారన్నమాట.

అసలే ఒకపక్క వ్యవసాయం గిట్టుబాటు కాక ఏటా వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితికి కొంత ఉపశమనంగా బహుశా ఇటీవలి కొన్ని రాష్ట్రాల ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏమో ప్రభుత్వాలు  రైతుబంధు పేరిట ఏటా కొంత మొత్తంలో సబ్సిడీ ఇస్తున్నాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఈ రెండు శాతం లెవీ భారం చూస్తే రైతులకు ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో రాయితీ లాగేసుకున్నట్లు ఉంది. డిమానిటైజేషన్, కరువులు వర్షాభావం ఏదో ఒక  కారణంగా గ్రామీణ కార్మికుల కూలీల సైతం 2017 నుంచి పెరగడం లేదని ఆర్థిక వేత్తల అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ విధంగా చూస్తే రైతుకూలీల పరిస్థితిపై కూడా ఈ తాజా లెవీ విధానం ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నది.  ఆర్థిక బిల్లు కొన్ని విభాగాలను ఈ లెవీ నుంచి మినహాయించింది. రైతుసంఘాలు, పౌర సమాజం ఆర్థికవేత్తలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు కూడా ఈ మినహాయింపు ఇప్పించాల్సిన అందుకు ప్రభుత్వం పై, ఒత్తిడి చేయాల్సిన అవసరం ఎంత అయిన ఉన్నది.

( రచయిత సీనియర్ జర్నలిస్టు)