• ఎంవీ యాక్ట్‌ను ఉపసంహరించుకోవాలి: సురవరం

హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, సమ్మెపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ చేసిన ఫిర్యాదు మేరకు ఎన్‌హెచ్‌ఆర్సీ స్పందించింది. కార్మికుల ఆత్మహత్యలు, సమ్మె అంశాలపై నవంబరు 28లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంగళవారం ఇచ్చిన నోటీసులో స్పష్టం చేసినట్టు బుధవారం నారాయణ తెలిపారు. కాగా, రవాణా శాఖ ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేసే వివాదాస్పద ఎంవీ యాక్ట్‌-2019ను తక్షణం ఉపసంహరించాలని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. విధుల్లో చేరడానికి కార్మికులు సంసిద్ధత వ్యక్తం చేసినందున ప్రభుత్వం సమ్మెకు ముగింపు పలకాలని సీపీఎం నేత డీజీ నర్సింహారావు కోరారు. సమ్మెపై ప్రభుత్వ వైఖరిని ప్రకటించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు కోరారు.

Courtesy andhrajyothy….