Image result for anita ramachandran ias"ఓ దశాబ్దం అయిపోయింది. రెండువేల ఇరవైయ్యవ దశాబ్దం వచ్చేసింది. గత దశాబ్దం శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది. ఈ దశాబ్దకాలంలో ఎందరో మహిళలు మార్గదర్శకులుగా ఎదిగారు. గ్లాస్‌ సీలింగ్‌ను బద్దలుకొట్టారు. పర్వతాలను అధిరోహించారు. ఎన్నో రంగాల్లో తొలి అడుగులు వేశారు. ఎంత ముందడుగు వేసినా.. సాధించాల్సినవెన్నో ఉన్నాయి. అంతకుమించి అధిగమించాల్సినవి ముందున్నాయి. కారణాలేమైనా మహిళల పట్ల హింస పెరిగిపోయింది. అఘాయిత్యాలు పెరిగిపోయాయి. మరోవైపు ప్రభుత్వాల విధానాలు.. మరింత నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయి. అంత నిరాశలోంచి కూడా కొన్ని కొంత గొంతులు ముందుకొస్తున్నాయి. ప్రశ్నిస్తున్నాయి. ప్రకాశిస్తున్నాయి. ఈ కొత్త దశాబ్దమైనా మహిళల జీవితాల్లో వెలుగును, జీవితం పట్ల ఆశను ఇస్తుందన్న నమ్మకంతో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..

నిరాశజనక స్థితి మారాలి…
గత దశాబ్ద కాలంలో ఎక్కువ భాగం స్త్రీల పరంగా నిరాశాజనకంగానే ఉందని చెప్పాలి. ఈ కాలంలో దేశ రాజధాని నడిబొడ్డున ప్రపంచం పెద్ద షాక్‌ కు గురయిన దారుణమైన సంఘటన నిర్భయ అత్యాచారం, హత్య సంఘటన జరిగింది(2012). స్త్రీలపై వరుస అత్యాచార, హత్యలు దేశవ్యాప్తంగా అనేక చోట్ల జరిగి స్త్రీలు, ఆడపిల్లల పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. దళిత ఆదివాసీ, మైనారిటీ స్త్రీలపై జరిగిన లైంగిక అత్యాచారాలు, హత్యలకు అంతేలేదు. వరంగల్‌ లో స్వప్నిక, ప్రణీత అనే ఇద్దరు కాలేజీ విద్యార్థినినులపై యాసిడ్‌ దాడి, ఆదివాసీ స్కూలు పిల్లలు ప్రియాంక, భూమికల అద శ్యం, హత్య, ఆసీఫా అనే ఎనిమిదేళ్ళ బక్రావాలా ఆదివాసీ ముస్లిం బాలికను ఒక కాశ్మీరు రాష్ట్రంలోని కథువాలో ఒక హిందూ దేవాలయంలో వారం రోజులపాటు అత్యాచారం చేసి చంపిన ఘటన నుంచి ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం ఊనాలో మైనర్‌ బాలిక అత్యాచారం, తదనంతరం ఆమె న్యాయపరమైన సహాయం పొందకుండా అడ్డుకుని ఆమె తండ్రినీ, మేనత్తనీ, లాయర్నీ ఆఖరుకి ఆమెనీ హతమార్చిన ఘటన, ఇటీవల హైదరాబాద్‌ లో ‘దిశ’ హత్యాచారం, హత్య నుంచి జనం తేరుకోక ముందే అసీఫాబాద్‌ లో బుడగ జంగమ స్త్రీ ‘సమత’ అత్యాచారం, హత్య, వరంగల్‌ లో యాదవ యువతి ‘మానస’ అత్యాచారం, హత్య ఆ తర్వాత గుంటూరులో ఐదేళ్ళ దళిత చిన్నారిపై అత్యాచారం చివరకు ఆమెపై పెట్రోల్‌ పోసి కాల్చి చంపిన క్రూరమైన ఘటన కూడా ఈ దశాబ్దం దళిత స్త్రీల పరంగా మిగిల్చిన చేదు అనుభావాల పరంపరకు గుర్తు.

స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యల సందర్భంలో ప్రభుత్వం, పోలీసులు స్పందించే తీరులో వారి కుల పరిమితులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అగ్ర కుల స్త్రీల మాన ప్రాణాలకు, దళిత, ఆదివాసీ, మైనారిటీ స్త్రీల మాన ప్రాణాలకు ప్రభుత్వం వేరు వేరు విలువలు ఇస్తున్నట్టు నిర్భయ నుంచి ఇటీవలి దిశ సంఘటన వరకు స్పష్టంగానే తెలుస్తుంది. అగ్రకులాలకు చెందిన స్వప్నిక, ప్రణీత, ‘దిశ’ల పై దాడికి, హత్యకు పాల్పడిన నిందితులను తెలంగాణా పోలీసులు కాల్చి ఎన్కౌంటర్‌ చేసి బాధితులకు ‘సత్వర న్యాయం’ చేశారు. అలాగే నిర్భయ అత్యాచారం, హత్య అనంతరం దేశ వ్యాప్తంగా వచ్చిన నిరసనతో పాటు ‘నిర్భయ’ చట్టాన్ని (2013) చెయ్యడం, ‘దిశ’ సంఘటన తర్వాత తెలంగాణా పోలీసులు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘దిశ’ చట్టం చెయ్యడం ఆహ్వానించతగినవే కానీ అదే ఆదివాసీ, దళిత, మైనారిటీ స్త్రీల పట్ల జరిగే దారుణాల విషయంలో చట్టాలు కాదు కదా కనీసం నేరస్తులను పట్టుకోవడం కూడా జరగకపోవడం వెనుక ఏముందో అందరికీ తెలుసు. ఊనా దళిత బాలిక సంఘటనకు ఒక బి.జే.పి ఎం.ఎల్‌.ఎ బాధ్యుడని తెలిసినా చాలారోజుల వరకు కనీసం అతని పేరు కూడా బైటికి రాకపోవడం చూశాం. ఆంధ్రప్రదేశ్లో ముస్లిం విద్యార్ధిని ఆయేషా మీరా అత్యాచారం, హత్య జరిగి పుష్కరకాలం కావస్తున్నా ఇంతవరకు అసలు నేరస్తుడిని గుర్తించలేని స్థితిలో మన ప్రభుత్వ యంత్రాంగం ఉంది. అలాగే వాకపల్లి, భల్లుగూడలలో ఖాకీలు ఆదివాసీ స్త్రీలపై జరిపిన సామూహిక అత్యాచారం రాజ్యానికి ఆయా స్త్రీల పట్ల ఉండే దౌర్జ్యన్యపూరితమైన పురుష దురహంకారానికి నిదర్సనం. ప్రజలను కాపాడవలసిన రక్షక భటులే అణగారిన వర్గాల స్త్రీలను భక్షించే రాబందుల మూకలాగా నిస్సిగ్గుగా ప్రవర్తించడం ఈ దేశాన్ని ప్రపంచం ముందు ముద్దాయిని చేసింది. అణగారిన కులాల స్త్రీలపై దారుణాలు జరిగిన సందర్భాలలో బాధితులకు న్యాయం చెయ్యకపోగా తిరిగి వారినే తప్పుపట్టడం, వారి ప్రవర్తన మీద బురద చల్లడం అనేది తరచుగా చూస్తున్నాం. కథువా మైనర్‌ ముస్లిం అమ్మాయిని ఏకంగా దేవాలయంలో అత్యాచారం, హత్య చేసింది కాక నిందితులకు మర్యాదలు కూడా చెయ్యడం ఈదేశం మైనారిటీల పట్ల ఎంత క్రూరంగా వ్యహరిస్తుందో ప్రపంచానికి చాటి చెప్పింది. ఏరకంగా చూసినా గత దశాబ్దం స్త్రీలపరంగా, అందునాఆదివాసీ దళిత, బహుజన, మైనారిటీ స్త్రీలపరంగా నిరాశాజనకంగా ఉంది. ఈ దశాబ్దంలోనైనా ఈ పరిస్థితిలో మార్పు రావాలి…
– డాక్టర్‌ చల్లపల్లి స్వరూపరాణి, ప్రొఫెసర్‌, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ

అఘాయిత్యాలు ఆగిపోవాలి…
గత దశాబ్దంలో అన్ని రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులొచ్చాయి. 2010 నుంచి ఇప్పటివరకు చాలా ప్రోగ్రెస్‌ వచ్చింది. శాస్త్ర సాంకేతిక, వైజ్ఞానిక రంగాల్లో చాలా ముందుకు వెళ్లాం. అయితే వీటితోపాటు మహిళల మీద హింస, అఘాయిత్యాలు పెరిగాయి. ఇవి పెరిగాయా? లేక టెక్నాలజీ అభివృధ్ధి వల్ల బయటికి వచ్చాయా తెలియదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు బయటికి వస్తున్నారు. పని చేయగలుగుతున్నారు. అయితే ఇంతకుముందు కూడా శ్రమలో వాళ్లున్నారు. కానీ ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా కొంత అభివృద్ధి సాధించారు. వాళ్లలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. వాళ్ల హక్కుల కోసం వాళ్లు నిలబడుతున్నారు. బాల్య వివాహాల వంటి సామాజిక రుగ్మతలను అడ్డుకుంటున్నారు. కొంత అభివృద్ధి ఉంది. కానీ ఇది సరిపోదు.

రానున్న దశాబ్దం ఎంతో కీలకమైనది. ఇప్పటివరకు సాధించినదాంతో ఆగిపోకుండా అన్ని రంగాల్లో ప్రోగ్రెస్‌ అవ్వాలి. అలాగే ఈ అఘాయిత్యాలు ఆగిపోవాలి. అది సమాజంలోని అందరి బాధ్యత. ఇక మా జిల్లా విషయానికి వస్తే… జిల్లాలో సౌకర్యాలు ఇంకా మెరుగుపరచాలి. ప్రత్యేకించి వైద్య రంగం మీద దృష్టి సారించాలనుకుంటున్నాం. అలాగే ప్రాథమిక విద్య మీద ఎక్కువ శద్ధ్ర పెట్టాలనుకుంటున్నాం.

మాకు రిజర్వేషన్‌ కల్పించాలి…
2014లో నల్సా తీర్పు వచ్చింది. దాన్ని నీరుగారిచే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. మేం ఎంత ఆందోళనలు చేసినా.. పట్టించుకోకుండా ‘ట్రాన్స్‌జెండర్స్‌ హక్కుల సంరక్షణ బిల్లు’ అంటూ మా హక్కులను హరించే చట్టాన్ని తెచ్చిపెట్టారు. లింగమార్పిడి శస్త్ర చికిత్స ఉచితంగా చేయాలని ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్నాం. కానీ దాని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. రిజర్వేషన్‌ ఇవ్వాలని కోరాం. కానీ.. ఉన్న రిజర్వేషన్స్‌ తీసేసే పరిస్థితి నెలకొంది. సీఏఏ వల్ల అల్ప సంఖ్యాకులకు ఇబ్బంది. సీఏఏలో కూడా ఎందరికో మినహాయింపు ఇచ్చారు. బాగుంది. కానీ అదే ముస్లిం దేశాల్లో ఎల్జీబీటీ వాళ్ల హక్కులు కూడా కాలరాయబడుతున్నాయి. కానీ ఎల్జీబీటీ వాళ్లనెందుకు అందులో చేర్చలేదు. ఎన్‌ఆర్‌సీ ద్వారా మా ఉనికికే ముప్పు ఏర్పడుతున్నది. మమ్మల్ని భారత పౌరులు కాదని నిరూపించడానికే ఈ చట్టం. ఇప్పటికీ భిక్షమెత్తడం, పడుపు వృత్తుల్లోనే ఉన్నాం. ఏదో కొద్దిమంది యాక్టివిస్టులు తప్ప… అధిక సంఖ్యాకులు ఇంకా అదే పరిస్థితి. ఎంత ఉన్నత చదువులు చదువుకున్నా… ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. సంక్షేమ పథకాలు పొందలేదు. అంతకుముందు ఎక్కడున్నామో ఇప్పుడూ అక్కడే ఉన్నాం. అయితే ఈ మధ్య కాలంలో మా గళాలు బయటికి వినిపిస్తున్నాయి. మా వాయిస్‌ మేం చెప్పగలుగుతున్నాం. అదొక్కటి తప్ప.. ఎలాంటి అభివృద్ధీ లేదు. ఈ దశాబ్దంలోనైనా ఈ చట్టాల్లో మార్పులు రావాలి. అలాగే ట్రాన్స్‌ జెండర్స్‌కు విద్యా, ఆరోగ్య రంగాల్లో అవకాశాలు కల్పించాలి. వసతి లేదు. మాకు హారిజంటల్‌ రిజర్వేషన్‌ కల్పించాలి. తద్వారా విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ ఇవ్వాలి. దీనివల్ల మేం అన్ని రంగాల్లోకి, అన్ని వృత్తుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.

వచ్చే దశాబ్దానికి భూమిక సిద్ధం చేశారు
ఆధునిక స్త్రీ చరిత్రని తిరగరాస్తుంది అన్నాడు గురజాడ. ఈ దశాబ్దంలో స్త్రీలు వ్యక్తిగతంగా, సమిష్టిగా పోరాడి ఎన్నెన్ని విషయాల్లో చరిత్రని తిరగరాసారో! ఉదాహరణకి ఎవ్‌శీశీ, శబరిమల ఆలయంలోకి స్త్రీల ప్రవేశ హక్కు మీద జరిగిన చర్చ, పోరాటాలు. నaజూజూy ్‌శీ bశ్రీవవస పోరాటానికి వచ్చిన మద్దతు చూస్తే.. ఋతుస్రావ అంశం మీద అవగాహన ఎంత పెరిగిందో తెలిసింది.
అసలు ఈ దశాబ్దం అనగానే మొదట గుర్తొచ్చేది నిర్భయ సంఘటన. నిర్భయతో మొదలుపెట్టి మొన్న హైద్రాబాద్‌లో, వరంగల్‌, ఆదిలాబాద్‌లో జరిగిన రేప్‌, హత్యలు.. మన దేశంలో రేప్‌ కల్చర్‌ ఎంతగా వేళ్లూనికుని పోయిందో ప్రపంచం ముందు చెప్పింది. అగ్రకుల, చదువుకున్న, అర్బన్‌, వైట్‌ స్కిన్‌ అమ్మాయిలు రేప్‌ కి గురి అయినపుడు వచ్చినంత స్పందన, న్యూస్‌ షశీఙవతీaస్త్రవ.. కశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలు, బస్తర్‌ లాంటి ప్రాంతాల్లో ఆదివాసీ, దళిత, ముస్లిం మహిళలకి, ప్రవల్లిక లాంటి ట్రాన్సవుమేన్‌కి జరిగినపుడు రాదు అనేది ఈ దశాబ్దం ర్‌a్‌ఱర్‌ఱషaశ్రీ గా నిరూపించింది. దీన్ని ఎలా అధిగమిస్తాం అనేది తర్వాత దశబ్దానికి ఛాలెంజ్‌. స్త్రీల సమస్యలు అనగానే ఎంతసేపటికీ రేప్‌, ఎవఅర్‌బతీa్‌ఱశీఅ, బాల్యవివాహాలు, ప్రసూతి సెలవులు చుట్టూ మాత్రమే పరిమితమైన చర్చని… చట్టసభల్లో స్త్రీల నిష్పత్తి, వర్కింగ్‌ విమెన్‌ సంఖ్య, స్త్రీల శారీరక, మానసిక ఆరోగ్యం, సాధికారత దాకా విస్త తి చేయటం ఈ దశాబ్దం సాధించిన విజయం. ద్యుతీ చంద్‌, మెరికోమ్‌, హిమాదాస్‌, సింధు, పూర్ణ, మలావత్‌ నుండి ఈరోజలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టిన శ్రీaసవవసa, ల దాకా ఎటు వైపు చూసినా ఈ దశాబ్దం స్త్రీలు సమాన హక్కులకు, సమాన అవకాశాలకు అవఞ్‌ డికేడ్లో చేయాల్సిన పోరాటానికి గొప్ప ఉత్సహం, భూమిక సిద్ధం చేశారు.
– పింగళి చైతన్య, గీత రచయిత
సామాజిక ఉద్యమ కారిణి

(Courtesy Nava Telangana)