ప్రస్తుతం ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న యువతులంతా వారి కుటుంబాల్లో చదువుకుంటున్న మొదటితరం లేదా ఉన్నతచదువులు చదువుతున్న మొదటితరం. వాళ్ల అమ్మమ్మలకు, తల్లులకు ఇలాంటి అవకాశం లేకపోవడమే నాటితరాలు వెనుకబాటుతానికి కారణమని నేటి యువతులు అర్థం చేసుకున్నారు. అందుకే వారి లక్ష్యాలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఎలాంటి చట్టాలైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఈశీతాకాలంలో జరిగిన జేఎన్‌యూ నుంచి జామియా వరకు అలీగఢ్‌ నుంచి జాదవ్‌పూర్‌ వరకు ప్రతి ఆందోళనలోనూ, ఊరేగింపులోనూ యువతులే ముందువరుసలో నిలిచారు. యువతులు నాయకత్వం వహించిన ఇలాంటి స్థిరమై న రాజకీయ ఆందోళనలను స్వతంత్ర భారతదేశం గతంలో మునుపెన్న డూ చూడలేదు. ఈ ఉద్యమాలు యువతుల నినాదాలతో, నిశ్చితాభిప్రాయాలతో విజయవంతమయ్యాయి. దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన ఈ యువతులు ఎవరు? వీళ్లు కేవలం దేశంలోని ఉదారవాద క్యాంపస్‌ల నుంచి వచ్చిన విద్యార్థులేనా? లేక ప్రతిపక్షాలు ఉసిగొల్పిన గుంపులా? ఉద్యమాల్లో వీళ్ల భాగస్వామ్యం యాదృచ్ఛికమా? లేక ఒక పద్ధతి ప్రకారం జరిగిందా? ఇది యాదృచ్ఛికమూ కాదు, పథకం ప్రకారమూ జరిగింది కాదు. ఒకే ఆలోచనావిధానం కలిగిన వ్యక్తులనుంచి వచ్చినది ఈ మార్పు. దేశంలోని యూనివర్సిటీ క్యాంపస్‌లలోని విద్యార్థినులు భవిష్యత్తు రాజకీయాలను వేగంగా మార్చివేస్తున్నారు. 21వ శతాబ్దపు రాజకీయాలను వాక్చాతుర్యం కలిగిన పురుషులు ఇక ఎంతమాత్రం ముందుకు తీసుకొని వెళ్లలేరని అర్థమౌతున్నది.

రాజకీయాల్లో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం వారికి ఎవరో ప్రసాదించే భిక్ష కాదని స్పష్టం చేస్తున్నది. ప్రస్తుత రాజకీయాల స్వభావం, ఉద్దేశాలు ఒక పద్ధతి ప్రకారం మహిళలు భాగస్వామ్యమయ్యేందుకు దోహదపడుతున్నాయి. వీధి రాజకీయాల స్థానంలో విశాల దృక్పథం కలిగిన విధానపరమైన రాజకీయాలు ఆవిర్భవిస్తున్నాయి. ఈ మహిళల భాగస్వామ్యం దీన్ని గుర్తుచేస్తున్నది. మొదట పౌరసత్వ సవరణ చట్టం పురుషుల కన్నా మహిళలకే ఎక్కువ ప్రమాదకరం. అస్సాంలోని డిటెన్షన్‌ సెంటర్లకు సంబంధించిన ఫొటోలు, నివేదికలు ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నా యి. మైనారిటీ వర్గం నుంచే కాకుండా అన్నివర్గాల మహిళలు ఈ చట్టం పట్ల తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వలస పాలన నుంచి కూడా దేశంలో ఓటు హక్కు అనేది కీలకమైన అంశం. భారత్‌ లాంటి దేశంలో వలసవాదం అంతమైన తర్వాత జాతీయ చరిత్ర నిర్మాణంలో, స్వతంత్ర పోరాటంలో మహిళలు గుర్తింపునకు నోచుకోవడం కష్టం. ఓటుహక్కు తిరస్కరణ ప్రమాదం,పౌరసత్వం అనే అంశాలు మహి ళల పట్ల తీవ్రమైన ప్రభావం చూపించాయి. మహిళలు తమ గొంతుకను వినిపించేందుకు అవసరమైన ఉన్నత విద్యారంగంలో వారి మనుగడ ఇప్పటికీ పెద్ద చర్చనీయాంశం. లింగవివక్ష ప్రదర్శించే చట్టాలు విధానాల పట్ల మహిళలు లోతుగా దృష్టిసారించడానికి ఈ వివక్షలే కారణం.

దేశంలో మహిళలకు తమకు కావాల్సిన  ప్రభుత్వపరమైన పత్రాలు అందుబాటులో లేకపోవడం కూడా ప్రస్తుత మహిళల ఆందోళనకు ఒక కారణం. 2019 డిసెంబర్‌ 15న ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామి యా యూనివర్సిటీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పోలీసుల దాడి నుంచి ఒక పురుషుడిని కాపాడేందుకు మహిళలు రక్షణ కవచంగా నిలిచారు.1990 దశాబ్దం నుంచి కూడా గ్రామీ ణ ప్రాంతాల్లో మహిళల జనన ధృవీకరణ పత్రాలు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. వివాహ ధృవీకరణ పత్రాలనేవి ఇప్పటికీ మిథ్యే. మహిళల పేరుమీద స్థిరాస్థులుండటం గగనమే. మహిళలు కేవలం తండ్రి లేదా భర్త సంరక్షణలో బతుకాల్సిందే. ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం, పౌర రిజిస్టర్‌ చట్టాలు మహిళలకు మరోసారి మతం, కులం హోదా అన్న తేడా లేకుండా పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయి. గ్రామీణ ప్రాంతంలో పెరుగుతున్న అక్షరాస్యత, పట్టణాల్లో పెరుగుతున్న వలసలు ఈ ప్రమాదాలను వారికి తెలియకుండా దాచలేని పరిస్థితిని కల్పించాయి. ప్రస్తుతం ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న యువతులంతా వారి కుటుంబాల్లో చదువుకుంటున్న మొదటితరం లేదా ఉన్నతచదువులు చదువుతున్న మొదటితరం. వాళ్ల అమ్మమ్మలకు, తల్లులకు ఇలాంటి అవకాశం లేకపోవడమే  నాటితరాలు వెనుకబాటుతానికి కారణమని నేటి యువతులు అర్థం చేసుకున్నారు. అందుకే వారి లక్ష్యాలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఎలాం టి చట్టాలైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అక్షరాస్యత పెరుగడం కూడా ఉద్యమాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగడానికి మరో కారణం. ఉన్నత విద్యారంగంలో యువతులు భాగస్వామ్యం పెరుగడం అంటే వాళ్లు దూర ప్రాంతాలకు ప్రయాణించే అవకాశం, హాస్టళ్లలో ఉండే అవకాశం, కిరాయి ఇండ్లల్లో ఉండగలిగి స్వతంత్రంగా తమ జీవితంపై తామే నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కుటుంబాలకు దూరంగా ఇలా స్వతంత్రంగా బతుకగలుగుతున్నందు వల్లనే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కూడా తమ గళాన్ని వినిపించగలుగుతున్నారు. 2019 డిసెంబర్‌ 29న జామియా మిలియా యూనివర్సిటీలో ఆందోళన సందర్భంగా పోలీసుల దాడిలో కంటిచూ పు కోల్పోయిన ఒక విద్యార్థికి సంఘీభావంగా ఒక యువతి తన కండ్లకు గంతలు కట్టుకొని ఆందోళనలో పాల్గొనడం విశేషం. మహిళల్లో పెరిగిన ఈ చైతన్యానికి టెక్నాలజీ కూడా ఒక కారణం. వేగంగా విస్తరిస్తున్న డిజిటల్‌ ప్రపంచంలో యువతులు ప్రపంచంతో వేగంగా కలిసి నడువడం సాధ్యమౌతున్నది. ఈ విషయంలో పురుషుల కంటే మహిళలే ముందున్నారు. స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రావడం, సోషల్‌ మీడియాలో ఇతరులతో ఈజీగా కలిసిపోయే అవకాశం ఏర్పడటంతో ప్రజాందోళనలలో వారి భాగస్వామ్యం మరింత పెరుగుతున్నది. పౌరసత్వానికి సంబంధించిన కీలకమైన పత్రాలు బయటపెట్టేందుకు ప్రభుత్వం నిరాకరిస్తున్నప్పటికీ ఈ అంశాన్ని తేలికగా వదిలివేసేందుకు యువతులు సిద్ధంగా లేరు.

2004లో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులను పాఠశాలకు ఆకర్షించడంతో పాటు బాలికల్లో పౌష్టికాహార లోపాన్ని కూడా తీర్చింది. ఇకముందు కూడా ఈ పథకం డ్రాపౌట్స్‌ తగ్గించనున్నది. అట్లనే లింగ అసమానతలను పాఠశాలల్లో రూపుమాపనున్నది. ఈ పథకం కారణంగా పాఠశాలకు విద్యార్థులు నేడు పద్దెనిమిది నుంచి ఇరువై ఐదేండ్ల వయస్కులయ్యారు. విద్యావకాశాల విస్తరణ ప్రభుత్వ విద్యద్వారా నైతిక వికాసంతోపాటు తమ పుట్టిన తేదీకి సంబంధించిన ఆధారాలు కూడా పొంది నవారిలో ఈ తరం ఒకటి. అందువల్ల తనకు, తన తల్లి అస్తిత్వానికి ప్రమాదకరంగా మారుతున్న ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించకుండా ఏం చేస్తారు? నేటి మహిళలు తామేం చేయాలనుకుంటున్నారో ఆ పనిని ధైర్యంగా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ర్యాలీలతో ఉద్యమిస్తున్నారు.

(వ్యాస్తకర్త: సౌత్‌ అండ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఏషియన్‌ స్టడీస్‌ డిపార్ట్‌మెంట్‌, కోల్‌కత్తా యూనివర్సిటీలో పరిశోధకురాలు)  ‘ది వైర్‌’ సౌజన్యంతో…

(Courtesy Namasthe Telangana)