అన్ని రంగాల్లో నాయిబ్రాహ్మణ మహిళలు రాణించాలని ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళినప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలరని వక్తలు వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌: నాయిబ్రాహ్మణ జన సంస్థ ఆధ్వరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికార భవన్‌లో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు ఈ సందర్భంగా పురస్కారాలు అందించారు. ప్రొఫెసర్ ఎం సావిత్రి, ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్‌ జి శారద. కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎ. దుర్గారాణి, వైద్య శాఖలో పనిచేస్తున్న కె. జయంతి, ఎస్. మంజుల, సిహెచ్. జ్యోతి, నాయిబ్రాహ్మణ మహిళా నాయకురాలు సుస్మిత. చంద్రమ్మలకు పురస్కారాలు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. సమాజంలో తమకు ఎదురైన వివక్ష, సవాళ్ల గురించి వివరించారు. మహిళా సాధికారతకు పురుషులు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ జన సంస్థ అధ్యక్షుడు శ్రీధర్ మురహరి, ఉపాధ్యక్షుడు సుశీల్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎం ప్రతాప్, కార్యదర్శి రాకేష్, ఎన్జీవో అధ్యక్షులు సుధాకర్, ఓయూ విద్యార్థి నేత జంపాల రాజేష్,మంగలి వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేష్, నాయి బ్రాహ్మణ జర్నలిస్టు ఫోరం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ బంటు, కోశాధికారి నాగశ్రీనివాసరావు, రిటైర్డ్‌ ప్రభుత్వాధికారి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.