రాజస్థాన్‌లో వైద్యుల మతవివక్షతో బిడ్డ మృతి

జైపూర్‌ : డాక్టర్లు మతం పేరుతో వివక్ష చూపి, వైద్యం నిరాకరిం చడంతో ఓ ముస్లిం గర్భిణీ తన బిడ్డను కోల్పోయిన సంఘటన రాజస్థాన్‌్‌ లోని భరత్‌పూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. గర్భిణీ భర్త ఇర్ఫాన్‌ఖాన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి ఆమెకు పురిటి నొప్పులు రాగా, సిక్రీలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి తరలించారు. కేసు క్లిష్టంగా ఉందంటూ అక్కడి వైద్యులు ఆర్‌బీఎం జనన ఆస్పత్రికి తీసుకెళ్లవెళ్లమని చెప్పారు. శనివారం. అక్కడికి వెళ్లగా, ఒక వైద్యురాలు.. మహిళ భర్తను వివరాలు అడిగారు. ఇక్కడ ముస్లింలకు చికిత్స అందించమనీ, జైపూర్‌కు తరలించాలని ఇర్ఫాన్‌తోనూ, అక్కడ ఉన్న మరో డాక్టర్‌తోనూ చెప్పారు. దీంతో, తన భార్యను అంబులెన్స్‌లో ఎక్కించగా, అందులోనే ఆమెకు డెలివరీ అయిందని ఇర్ఫాన్‌ తెలిపారు. తమ బిడ్డ చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాజస్థాన్‌ ఆరోగ్య శాఖ మంత్రి, భరత్‌పూర్‌ ఎమ్మెల్యే సుభాష్‌ గార్గ్‌ దర్యాప్తునకు ఆదేశించారు. ఘటనపై భరత్‌పూర్‌ ప్రిన్సిపల్‌ ఆఫీసర్‌ నవదీప్‌ సింగ్‌ సైనీ మాట్లాడుతూ.. దీనిపై ప్యానెల్‌ విచారణ చేపడుతుందని చెప్పారు.

Courtesy Nava Telangana