అల్వార్‌ ఎస్పీ ఆదేశాలు.. నిర్ణయం వెనక్కి
జైపూర్‌ : ముస్లిం పోలీసులు తమ గడ్డాలను తీసివెయ్యాలని రాజస్థాన్‌లోని అల్వార్‌ ఎస్పీ జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పద మయ్యాయి. అయితే పోలీసు విభాగం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తన ఆదేశాలను ఎస్పీ వెనక్కి తీసుకున్నారు. గడ్డాలను తీసివేయాలని గురువారం నాడు ఎస్పీ అనిల్‌ పారిస్‌ దేశ్‌ముఖ్‌ తొమ్మిది మంది ముస్లిం పోలీసులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం.. గడ్డం పెంచుకునేం దుకు 32 మంది ముస్లిం పోలీసులకు అనుమతి ఉంది. అయితే తొమ్మిది మంది పోలీసులను గడ్డాలు తీసేయాల్సిందిగా ఎస్పీ ఆదేశించారు. మిగతా 23 మందికి మాత్రం గడ్డాలతో ఉండటానికి అనుమతించారు. దీనిపై ఆ తొమ్మిది మంది పోలీసులు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఎస్పీ ఆదేశాలు వివాదాస్పదమ య్యాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదేశాలను వెనక్కి తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు.

Courtesy Navatelangana..