హౌంమంత్రి అమిత్‌షా

న్యూఢిల్లీ: హౌంమంత్రి అమిత్‌షా మరో వివాదానికి తెర తీశారు. బహుళ పార్టీ వ్యవస్థ విఫల ప్రయోగమంటూ వ్యాఖ్యానించారు. మన రాజ్యాంగ నిర్మాతలు పలు దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థల్ని అధ్యయనం చేసి బహుళపార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థకు రూపకల్పన చేశారు. కానీ, ఈ 70 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో బహుళపార్టీ ప్రజాస్వామ్యం విఫల మైందని అమిత్‌షా అన్నారు. మూడో కూటమి(థర్డ్‌ ఫ్రంట్‌) ప్రయోగాలు విఫలమయ్యాయని, స్థిర ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేకపోయాయని అమిత్‌షా అన్నారు. కానీ, విపి సింగ్‌ ప్రభుత్వం పడిపోవడానికి కారణం బీజేపీ అన్నది గమనార్హం. 1990లో ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగా ల్లో 27శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ విపి సింగ్‌ ప్రభుత్వం నిర్ణయం వెల్ల డించగానే బయటినుంచి ఇస్తున్న మద్దతును బీజేపీ ఉపసంహరించింది. దాంతో, ఆ ప్రభుత్వం కూలిపోగా, జనతాదళ్‌ చీలిక నేత చంద్రశేఖర్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ బయటి నుంచి మద్దతు ఇచ్చి ఆరు నెలల తర్వాత ఉపసంహరించింది.

1996 నుంచి 1998 వరకూ యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం 18నెలలపాటు మనగలిగింది. యునైటెడ్‌ ఫ్రంట్‌ కాలంలో నూ ఇద్దరు(హెచ్‌డి దేవెగౌడ, ఐకె గుజ్రాల్‌) ప్రధానులయ్యారు. కొన్ని ప్రభుత్వాలు 30 ఏండ్లు అధికారంలో ఉన్నా ఏ ఒక్క పెద్ద నిర్ణయమూ తీసుకోలేకపోయాయి. తమ ప్రభుత్వం మాత్రం ఐదేండ్లలోనే జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, (పీవోకేపై) వైమానిక దాడులులాంటి 50 కీలక నిర్ణయా లు తీసుకున్నదని అమిత్‌షా చెప్పుకొచ్చారు. అమిత్‌షా తాజా వ్యాఖ్యల ఉద్దేశం దేశంలో రెండు పార్టీల వ్యవస్థను నెలకొల్పాలనా? లేదంటే జర్మ నీలో నాజీ నియంత హిట్లర్‌లా, ఇటలీలో ఫాసిస్ట్‌ నియంత ముసోలినీలా ఏకపార్టీ వ్యవస్థను కలలు కంటున్నారా..? అని తెలుస్తోంది. .

(Courtesy Nava Telangana)