– మోడీ హయంలో రూ.4.5 లక్షల కోట్లు పెరిగిన సంపద

న్యూఢిల్లీ: భారతదేశంలో అత్యంత ధనవంతు డు రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ. కేవలం భారత దేశంలోనే కాదు ఆరు లక్షల కోట్ల రూపాయల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో నాలుగో స్థానం లో నిలిచాడు. ప్రపంచంలోని అత్యంత సంపన్ను లైన పది మంది జాబితాలో ముకేశ్‌ అంబానీకి తప్ప మరే బ్రిక్స్‌ దేశాలకు చెందిన వ్యాపారవే త్తకు స్థానం దొరకలేదు. ముకేశ్‌ అంబానీ సంపద పెరిగిన తీరు ఆశ్చర్యకరంతోపాటు గొప్పదైన విషయమే. అయితే ఈ సంపద పెరుగుదల ఎలా జరిగింది? ముకేశ్‌ అంబానీ పారిశ్రామిక రంగం లో సాధించిన కొత్త కొత్త ఆవిష్కరణ కారణంగా జరిగిందా? లేక అవినీతి, ఆశ్రిత పెట్టుదారీ విధానం వల్ల జరిగిందా? గణాంకాలను చూస్తే మనకు ఇట్టే అర్దమైపోతుంది.

రూ.6 లక్షల కోట్లకు చేరిన సంపద
ప్రధానిగా మోడీ అధికారంలోకి రాకమునుపు 2014 నాటికి ముకేశ్‌ అంబానీ సంపద కేవలం రూ.1.3 లక్షల కోట్లు మాత్రమే. కానీ ఈ ఆరేండ్లల్లో ఆ సంపద రూ.4.5 లక్షల కోట్లకు పైగా పెరిగి మొత్తం సంపద రూ.6 లక్షల కోట్లు దాటింది. కరోనా కారణంగా దేశ ఆర్థికాబివృద్ధి క్షీణించి ప్రజల ఆదాయాలు పడిపోయి అందరూ ఇబ్బందులు పడుతుంటే ముకేశ్‌ అంబానీ మాత్రం గత పది నెలల కాలంలోనే
రూ.1.6 లక్షల కోట్ల సంపద పోగేసుకున్నాడు.

అదానీ ఆస్తులూ పెరిగాయ్..
మోడీ పరిపాలనలో ముకేశ్‌ అంబానీతో పాటు అదానీ సంపద కూడా అధి కంగా పెరిగింది. అంతేకాక ఈకాలంలో భారత్‌లో బిలియ నీర్లగా మారుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 2019సం||లో భారత్‌ దేశంలో ప్రతినెలకు కొత్తగా ముగ్గురు శతకోటీశ్వరులు తయారయ్యారు. మొత్తం బిలీయనీర్ల సంఖ్య 139దాటింది. అమెరికా, చైనా తర్వాత భారతదేశంలోనే బిలియనీర్ల సంఖ్య అత్యధికంగా ఉంది.

వృద్ధి పాతాళానికి..
కానీ భారత ఆర్థికాభివృద్ధి రేటు మాత్రం చాలా తక్కువగా ఉంది. గత ఐదేండ్లుగా జీడీపీ వరుసగా తగ్గుతూ వస్తోంది. దేశంలో కొత్త ఆవిష్కరణలను చేపట్టి ఉత్పాతకతా రేటును పెంచడం ద్వారా మొత్తం గా దేశ ప్రజలందరి ఆదా యం పెంచే పనులను మోడీ సర్కార్‌ చేయ డం లేదు. కానీ అంబానీ, అదానీలకు అప్పనంగా సంపాదించేకునేలా చట్టాలను కూడా వారికి అనుకూలంగా మారుస్తున్నారు. ఆ కారణంగానే ఒకవైపు ప్రజల ఆదాయం తగ్గిపోతూ ఉండగా కార్పొరేట్ల సంపద మాత్రం పెరిగిపోతూ ఉంది. ప్రపంచ అసమానతల నివేదిక లెక్కల ప్రకారం భారత దేశంలో కింది స్థాయిలో ఉన్న 50 శాతం మంది జనాభా సంపద మొత్తం దేశ సంపదలో 6.4 శాతం మాత్రమే ఉండగా అత్యంత సంప న్నులుగా ఉన్న ఒక శాతం వారి సంపద 30 శాతం వరకు ఉంది. ఈ అసమా నతలు మోడీ పరిపాలనా కాలంలో మరింత పెరిగాయి. అశ్రిత పెట్టుబడిదారీ విధానం కారణంగా లబ్ది పొందిన భారత కార్పొరేట్ల సంపద మొత్తం దేశ జీడీపీలో 3.4 శాతంగా ఉందని ఎకానమిస్ట్‌ పత్రిక తన నివేదికలో తెలిపింది. ప్రధాని మోడీ ఆరేండ్ల పరిపాలనా కాలంలో ముకేశ్‌ అంబానీ సంపద విలువ ఐదు రెట్లు పెరగగా..అదానీ సంపద విలువ మూడు రెట్లు పెరిగింది. ముకేశ్‌ అంబానీ వ్యాపారాలైన చమురు, టెలీ కమ్యూనికేషన్స్‌, రిటైల్‌, ఎంటైర్‌టైన్‌మెంట్‌తో సహా అన్ని రంగాల్లో అతనికి అనుకూలంగా మోడీ సర్కార్‌ చట్టాలు తీసుకొచ్చింది.

ఏకస్వామ్య వ్యవస్థగా జియో
రిలయన్స్‌ జియోకు మేలు చేసేందుకు ట్రారు నిబంధనలను సైతం మార్చింది. ఆ నిబంధనలతో రిలయన్స్‌ జియో టెలీ కమ్యూనికేషన్స్‌ రంగంలో 40 కోట్ల మంది వినియోగదారులతో ఏకస్వామ్య సంస్థగా అవతరించింది. రిటైల్‌ రంగంలో కూడా రిలయన్స్‌కు మేలు చేసేలా ఇ కామర్స్‌ విధానంలో మార్పులు చేసింది. దీంతో అమెజాన్‌, పిఫ్ల్‌కార్ట్‌ కు అవరోధాలు కల్గించి రిలయన్స్‌కు మేలు చేసింది. దేశీయ సంస్థలకు సమాన అవకాశాలు కల్పించేందుకే ఇ కామర్స్‌ విధా నంలో మార్పులుచేశామని మోడీ ప్రభుత్వం చెప్పినప్పటికీ లాభం చేకూరింది మాత్రం ఒక్క రిలయన్స్‌కు మాత్రమే. నెట్‌ న్యూట్రియాల్టీ అనే భావనకు తిలో దకాలు ఇచ్చి రియలన్స్‌ జియో, ఫేస్‌ బుక్‌ సంస్థల మధ్య ఒప్పందానికి మోడీ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న ఆశ్రితపెట్టుబడి దారీ విధానాల కారణంగా అంబానీతోపాటు మిగతా కార్పొరేట్లు సంపద పొగేసు కుంటున్నారు.సామాన్యులు మాత్రంఆదాయాలు కోల్పోయి అవస్థలు పడుతున్నారు.

Courtesy Nava Telangana