పేదరికాన్ని ఎదుర్కోవటానికి, ఆర్థిక వ్యవస్థ చైతన్యాన్ని నిర్ధారించడానికి కనీస వేతనాలు ఒక ముఖ్యమైన మార్గంగా ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడింది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు శక్తి క్షీణించిన తరువాత, ఇంటర్నేషనల్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌లో అంతర్జాతీయ ఉద్యోగ కల్పన ఒప్పందం 2009 జరిగింది. దీని ప్రకారం సామాజిక భాగస్వాములతో సంప్రదించి క్రమబద్ధమైన వేతనాల సర్దుబాటు చేయాలి. ఇది కనీస వేతనాలు ఆర్థిక స్థిరత్వానికి దోహదం చేస్తుంది. అసమానతను తగ్గించే సాధనమౌతుంది.

ఇప్పటి వరకు జరిగిన కథ: 2019 పార్లమెంటు ఆమోదించిన వేతనాల కోడ్‌- 2019 కు ఆగస్టు 8వ తేదీన రాష్ట్రపతి అంగీకారాన్ని తెలిపారు. వేతనాల చెల్లింపు చట్టం-1936, కనీస వేతనాల చట్టం-1948, బోనస్‌ చెల్లింపు చట్టం- 1965 మరియు సమాన వేతనం చట్టం -1976. ఈ నాలుగు చట్టాల స్థానంలో తేబడిన ఈ కోడ్‌…ఏదైనా పరిశ్రమ, వాణిజ్యం, వ్యాపారం లేదా ఉత్పత్తి రంగాల్లో పని చేసే కార్మికులందరికీ వేతనాలు మరియు బోనస్‌లను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది.<br ‘times=”” new=”” ‘;=”” font-size:=”” “=””> కోడ్‌ ఇప్పుడు చట్ట రూపం తీసుకోనుండటంతో సంబంధిత నిబంధనలను అమలు చేయడానికిగాను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నవంబర్‌ 1వ తేదీన ముసాయిదా నియమాలను ప్రచురించింది. దీనిపై డిసెంబర్‌ 1వ తేదీ లోగా తమ అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా భాగస్వామ్య పక్షాలను కోరింది. వారితో చర్చించి నైపుణ్యం లేని, సెమీ-స్కిల్డ్‌, నైపుణ్యం మరియు అత్యంత నైపుణ్యం కలిగిన వివిధ వర్గాల కార్మికులకు కనీస వేతనాలను నిర్ణయించటానికి కావలసిన నిబంధనలను కేంద్రం నోటిఫై చేస్తుంది. దాని ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుకు చర్యలు తీసుకోవాలి.

కోడ్‌ ఎందుకు ముఖ్యమైనది?
పేదరికాన్ని ఎదుర్కోవటానికి, ఆర్థిక వ్యవస్థ చైతన్యాన్ని నిర్ధారించడానికి కనీస వేతనాలు ఒక ముఖ్యమైన మార్గంగా ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడింది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు శక్తి క్షీణించిన తరువాత, ఇంటర్నేషనల్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌లో అంతర్జాతీయ ఉద్యోగ కల్పన ఒప్పందం 2009 జరిగింది. దీని ప్రకారం సామాజిక భాగస్వాములతో సంప్రదించి క్రమబద్ధమైన వేతనాల సర్దుబాటు చేయాలి. ఇది కనీస వేతనాలు ఆర్థిక స్థిరత్వానికి దోహదం చేస్తుంది. అసమానతను తగ్గించే సాధనమౌతుంది.
కార్మికులకు ”కనీస జీవన ప్రమాణాలను” నిర్ధారించడమే నెలసరి వేతనాన్ని నిర్ణయించడంలోని లక్ష్యమని కోడ్‌ అంగీకరించింది. 1992లో సుప్రీంకోర్టు తీర్పులో ప్రకటించిన ప్రమాణాలు, 15వ భారత కార్మిక సదస్సు చేసిన సిఫారసులు ముసాయిదా నియమాలలో ఉంటాయి. కార్మికుని కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తే వారికి (సంపాదించే కార్మికుడు, జీవిత భాగస్వామి మరియు ఇద్దరు పిల్లలు లేదా ముగ్గురు పెద్దవారు ఒక యూనిట్‌ కు సమానం) రోజుకు 2700 కేలరీల చొప్పున ఆహారం, కుటుంబానికి సంవత్సరానికి 66 మీటర్లు చొప్పున దుస్తులు, ఆహారం మరియు దుస్తులు ఖర్చులో 10 శాతం లెక్కన ఇంటి అద్దె ఖర్చులు, అలాగే పిల్లల విద్య, వైద్య అవసరాలు, వినోదం, ఆకస్మిక ఖర్చులు వీటన్నిటిని పరిగణన లోకి తీసుకుని కనీస వేతనాలు నిర్ణయించాలి.
అదేవిధంగా దీనికి సంబంధించిన నియమాలను కూడా మొత్తం వేతన సంబంధిత అంశాలను అంటే సాధారణ పని దినం (తొమ్మిది గంటలుగా చేయబడుతోంది), కరువు భత్యంలో సవరణలు, రాత్రి షిఫ్టులు మరియు ఓవర్‌ టైం, విరామ సమయం మొదలైన అంశాలను లెక్క లోకి తీసుకుని తయారుచేస్తారు. బోనస్‌ చెల్లింపుకు సంబంధించి ముసాయిదా నిబంధనలలో ఒక పేరాలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అదేవిధంగా మరొక పేరాలో సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డు ఏర్పాటుకు, దాని పనితీరుకు సంబంధించిన మార్గదర్శకాలను పొందుపరిచారు.

ఇది ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది?
భౌగోళిక పరిస్థితుల ఆధారంగా వేర్వేరు ప్రాంతాలకు వేరు వేరు మూల వేతనాలు ఉండవచ్చు. కనీస వేతనాన్ని నిర్ణయిం చటానికి కేంద్రం వేతన బోర్డ్‌తో పాటు ఏ రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాలని ఎంపిక చేసుకుంటుందనేది కీలకం. 2017లో జాతీయ కనీస వేతనం రోజుకు రూ.176 ఉండాలని సిఫారసు చేయగా, కార్మిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ”భారతదేశానికి అవసరమయ్యే జాతీయ కనీస వేతనం” రోజుకు రూ. 375 గా (నెలకు రూ. 9,750) నిర్ణయించాలని సిఫారసు చేసింది.
అదనంగా, పట్టణ కార్మికులకు రోజుకు సగటున రూ.55 వరకు నగర పరిహార భత్యం చెల్లించాలని కమిటీ నిర్ణయించింది. అంతకు ముందు, 2015 లో, ఏడవ కేంద్ర వేతన సంఘం ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం నెలకు రూ.18,000గా నిర్ణయించాలని సిఫారసు చేసింది. గత నెలలో ఢిల్లీ ప్రభుత్వం నైపుణ్యం లేని కార్మికులకు నెలకు కనీస వేతనం, రూ.14,842గా నిర్ణయించింది. సుప్రీంకోర్టు స్థానిక ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన తరువాత, యజమానుల సంఘాలు అధికంగా లేవనెత్తిన అభ్యంతరాలను పక్కన పెట్టింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలైలో నిర్వహించిన ఆర్థిక సర్వే నివేదికలో, సమర్థవంతమైన కనీస వేతన వ్యవస్థ స్థాపన ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ‘సమగ్ర వృద్ధి కోసం భారతదేశంలో కనీస వేతన వ్యవస్థను పున:రూపకల్పన చేయడం’ అనే అధ్యాయంలో ఈ అంశం వుంది. ఇటువంటి చట్టబద్ధమైన జాతీయ కనీస వేతనం వల్ల వేతన స్థాయిలను పెంచడానికి సహాయ పడటం, వేతన అసమానతను తగ్గించడం వంటి బహుముఖ ప్రయోజనాలు ఉంటాయి. తద్వారా సమగ్ర వృద్ధిని పెంచుతుంది. భారతదేశంలో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, త్వరితగతిన ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే బలమైన వేతన సవరణ అత్యంత అవసరం.
ఆర్‌ఎస్‌ఎస్‌-అనుబంధ భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు (బిఎంఎస్‌) మరియు అఖిల భారత ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఎఐటియుసి) తో సహా ప్రధాన కార్మిక సంఘాలు కోడ్‌ లోని పలు అంశాలపై తమ అభ్యంతరాలను వినిపించాయి. అలాగే తమ అభిప్రాయాలను వివరంగా రాతపూర్వకంగా సమర్పించాలని యోచిస్తున్నాయి. వివాదాస్పద అంశాలలో తొమ్మిది గంటల పని దినం నిర్వచనం, కార్మికుల నైపుణ్యాన్ని పెంచడానికి సంబంధించిన పరిధిపై నిబంధనలలో స్పష్టత లేకపోవడం, వేతన స్థిరీకరణ కమిటీలో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం లేకపోవడం మొదలైన ముఖ్యమైన అంశాలున్నాయి. అసంఘటిత రంగాల లోని కోట్లాది మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కనీస వేతనం ఎంతవరకు న్యాయంగా, వాస్తవంగా అమలు చేయబడుతుందనే దానిపై కోడ్‌ అంతిమ విజయం ఆధారపడి ఉంటుంది.

సురేష్‌ శేషాద్రి