రచన బి.భాస్కర్

రోజుకి 178 రూపాయలు నలుగురైదుగురు ఉన్న కుటుంబానికి సరిపోతాయా! పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, ఇంటి అద్దె, ఇతర అవసరాలన్నీ తీరుతాయా! అవునంటున్నది కేంద్ర ప్రభుత్వం.

కేంద్ర కార్మిక మంత్రి నటించిన రూ 178 కనీస వేతనం కార్మికుల పొట్ట కొట్టినట్లుగా గా ఉన్నది.2017 లో ప్రకటించిన జాతీయస్థాయి కనీసవేతనం 176 రూపాయలకు రెండు రూపాయలు జోడించి ఇప్పుడు ఈ కొత్త కనీస వేతనాన్ని మోడీ సర్కారు ప్రకటించింది. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు అసలు ఏమి పెంచినట్లే కాదు ఇంకా తగ్గించినట్లు కూడా చెప్పుకోవచ్చు..! మనిషి ఒక్కొక్కరికి రోజుకు కావలసిన కాలరీలు, సభ్యుల అవసరాల అన్నింటిని గణనలోకి తీసుకొని కనీస వేతనాన్ని అంచనా వేస్తారు. అయితే ప్రస్తుత కేంద్ర మంత్రి వస్తే వేతన నిర్ణయం ఏ మాత్రము శాస్త్రీయంగా జరగలేదని స్పష్టమవుతున్నది. కనీస వేతనం ఎప్పుడైనా కార్మికుల కుటుంబాన్ని హాయిగా నడిపించేది గా ఉండాలి. కనీస వేతనం అనేది కార్మికుల హక్కు. ఇది కుటుంబ జీవన ప్రమాణాలు పెంచేందుకు దోహదపడాలి. కనీస వేతనం అనేది దేశ ఉత్పత్తుల డిమాండ్ పెంచేందుకు ఉపయోగపడాలి. కార్మికుల్ని శ్రామికుల స్థాయి నుంచి పెంచి మధ్యతరగతి స్థాయికి చేర్చ గలగాలి.

వాస్తవానికి కనీసవేతనం నిర్ధారణ కోసం ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ రూ 375 నుంచి నువ్వు 447 గా ఉండాల్సిందిగా సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును సైతం కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవటం దారుణం. నిజానికి ఇప్పటికే దేశంలోని 26 రాష్ట్రాలు 178 కన్నా అధికంగా కనీస వేతనాన్ని నిర్ణయించాయి. కేంద్రం కార్మికులకు ఏమి పెంచినట్లు.? భారతదేశంలో 93 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వీరిలో అత్యధిక శాతం మంది దళిత బహుజనులేఉంటారు. వీరికి ప్రభుత్వాలు ప్రకటించే కనీస వేతనాలు నేటికీ సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదు. కార్మిక శాఖ సైతం కనీస వేతనం అమలు అవుతుందా లేదా అని విస్తృతంగా పరిశీలించి గట్టిగా అమలు జరిపే విధమైన చర్యలకు అసలు పోవటమే లేదు. దేశంలో ఒక పక్కా కరువు పరిస్థితులు, వ్యవసాయ సంక్షోభం డీమానిటైజేషన్ వల్ల, చిన్న పరిశ్రమల మూత, దీంతో పనిలో కోసం కోట్లాది మంది కార్మికుల వలస… ఇది ప్రస్తుత నిజ పరిస్థితి. ఐక్యరాజ్యసమితి సైతం కార్మికుల కనీసవేతనం  వారి కి మెరుగైనజీవన ప్రమాణాలను కల్పించాలని జరిగిన అనేక తీర్మానాల ద్వారా కోరింది. భారతదేశ కార్మిక సంఘాలు పెరిగిపోతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని నెలకు 18 వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని భారత్ బంద్ లు  సైతం నిర్వహించాయి. ప్రపంచంలో ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద సమ్మెగా ఈ బందులు పేరుగాంచాయి అయినప్పటికీ మోడీ సర్కార్. సానుకూలంగా స్పందించక పోగా ఇప్పుడీ అరకొర వేతన సిఫార్సు చేసింది. ఇంకోపక్క క్రోడీకరణ పేరిట కొత్తగా కార్మిక చట్టాల నిర్వీర్యాన్ని కి పూనుకున్నది. కాంట్రాక్టర్ లే కార్మికుల వేతనాన్ని నిర్ణయించే ల కార్మిక చట్టం తీసుకు వస్తున్నది. ఇక అప్పుడు కనీస వేతనం అనేదానికి ఇక అర్థమే లేకుండా పోతుంది.  కాంట్రాక్టర్లకు ఎంత వస్తే అదే కనీస వేతనం అవుతుంది. ఇవన్నీ కార్మిక హక్కుల్ని, మానవ హక్కుల్ని, జీవించే హక్కు ని దెబ్బతీసే చర్యలే. దేశీయ తయారీ ఉత్పత్తులు అమ్మకాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి, ప్రజల కొనుగోలు శక్తి పెరిగిన అప్పుడే మొత్తంగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి బాటన పయనించ గడుపుతుంది. అసలు ప్రజలకు జీవనం గడపటానికి చాలినంత వేతనాలు సైతం అందకపోతే ఇక ఫ్యాక్టరీల నుంచి తయారయ్యే ఉత్పత్తుల్ని కొనే వారు ఎవరు. ప్రస్తుతం దేశంలో వినిమయ వస్తువుల కొనుగోళ్లు పెరగకుండా ఉండటంతో ఒక రకంగా భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నది. ప్రైవేటు పెట్టుబడులు మందగిస్తున్నా యి. ఈ నేపథ్యంలో కనీస వేతనం నిర్ధారణ ఎంత నీరసంగా ఉంది అంటే ప్రధాని చెప్పిన 5 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ను తీసుకెళ్ళ టం ఇలాగేనా అనిపిస్తున్నది.

( రచయిత సీనియర్ జర్నలిస్టు)