ఈ మధ్యకాలంలో బ్రిటన్‌లో హోటళ్లు, కారును కడిగే కేంద్రాలు, భవన నిర్మాణాలు తదితర పనుల్లో పనిచేసేందుకు అక్రమంగా మానవ రవాణాకు ఒడిగడుతున్న ముఠాలు పెరిగిపోయాయని తెలుస్తున్నది. అలా వచ్చినవారే కంటేనర్‌లో ఊపిరి ఆడక చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. తమ దేశంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో, మెరుగైన జీవనం కోసం కలలుగంటూ ఇంగ్లండ్‌లోకి దొంగచాటుగా ప్రవేశించటానికి ప్రవేశించిన వారి సంఖ్య చాలానే ఉంటుంది. వారు దొంగచాటుగా సరిహద్దులు దాటి వచ్చేక్రమంలో ఎదురయ్యే ప్రమాదాలు, కష్టాలు ఎదుర్కోవటానికి సిద్ధపడే వస్తున్నారు. ప్రాణాలు కూడా పోవచ్చుననేది తెలిసి కూడా ఇంతటి తెగింపునకు ఒడిగడుతున్నారు. ఎందుకంటే తమ దేశాల్లోని సంక్లిష్ట సంక్షోభ పరిస్థితులు, జీవనోపాధి లేని దుస్థితి ఈ తెగింపునకు కారణమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లోకి దొంగచాటుగా ప్రవేశించిన అక్ర మ వలసదారులు, శరణార్థుల గాథలపై పరిశోధన చేస్తున్న నేను యూకేలో అనేకమందిని కలిశాను. వారి భయంకర ప్రయాణ గాథలను విన్నాను.నా పరిశోధనలో భాగంగా బహ్రామ్ అనే వ్యక్తి గాథ ఇది.

కొద్దిరోజుల కిందట ఇంగ్లండ్‌లో 39 మంది విగతజీవులుగా మారి ఉన్న ఓ లారీ కంటేనర్ రోడ్డుపక్కన నిలిపి ఉన్న విష యం ప్రపంచాన్ని కుదిపేసింది. దీంతో ఇంగ్లండ్ పొరుగుదేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా పెద్ద కలకలం రేగింది. ఇంగ్లండ్‌లో నూ దీనిపై పెద్దఎత్తున ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. అంతర్జాతీ య సరిహద్దులు దాటుతూ వస్తువులను, కూరగాయలను, ఇతర పదార్థాలను చేరవేసే పెద్ద లారీ కంటేనర్‌లో 31 మంది పురుషులు, 8 మంది స్త్రీలు ఉండటం దిగ్భ్రాంతికి గురిచేసింది. వారు ఎక్కడినుంచి ఎక్కడికి పోతున్నారు, ఏ దేశానికి చెందిన వారన్నది ఇప్పటికీ తెలియదు. బ్రిటిష్ పోలీసుల వర్గాలు దర్యాప్తు చేపట్టినా కంటేనర్‌లో చనిపోయినవారు ఎవరై ఉంటారన్నది ఇప్పటికీ ఇదమిద్దంగా తెలియదు. వారు మానవ అక్రమ రవాణాదారులు, స్మగ్లర్ ముఠాల చేతిలో చిక్కి ఇలా చనిపోయారా అన్న అనుమానాలున్నాయి. బ్రిటన్‌లో మెరుగైన జీవితాన్ని ఆశించి దేశ సరిహద్దులు దాటివచ్చిన వారై ఉంటారన్న అభిప్రాయం ఉన్నది.

ఈ మధ్యకాలంలో బ్రిటన్‌లో హోటళ్లు, కారును కడిగే కేంద్రాలు, భవ న నిర్మాణాలు తదితర పనుల్లో పనిచేసేందుకు అక్రమంగా మానవ రవాణాకు ఒడిగడుతున్న ముఠాలు పెరిగిపోయాయని తెలుస్తున్నది. అలా వచ్చినవారే కంటేనర్‌లో ఊపిరి ఆడక చనిపోయి ఉంటారని భావిస్తున్నా రు. తమ దేశంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో, మెరుగైన జీవనం కోసం కలలుగంటూ ఇంగ్లండ్‌లోకి దొంగచాటుగా ప్రవేశించటానికి ప్రవేశించిన వారి సంఖ్య చాలానే ఉంటుంది. వారు దొంగచాటుగా సరిహద్దులు దాటి వచ్చేక్రమంలో ఎదురయ్యే ప్రమాదాలు, కష్టాలు ఎదుర్కోవటానికి సిద్ధపడే వస్తున్నారు. ప్రాణాలు కూడా పోవచ్చుననేది తెలిసి కూడా ఇంతటి తెగింపునకు ఒడిగడుతున్నారు. ఎందుకంటే తమ దేశాల్లోని సంక్లిష్ట సం క్షోభ పరిస్థితులు, జీవనోపాధి లేని దుస్థితి ఈ తెగింపునకు కారణమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లోకి దొంగ చాటుగా ప్రవేశించిన అక్ర మ వలసదారులు, శరణార్థుల గాథలపై పరిశోధన చేస్తున్న నేను యూకే లో అనేక మందిని కలిశాను. వారి భయంకర ప్రయాణ గాథలను విన్నా ను. నా పరిశోధనలో భాగంగా బహ్రామ్ అనే వ్యక్తి గాథ ఇది.

బహ్రామ్ ఇరాన్ దేశీయుడు. ఇరాన్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, రాజకీయ కారణాల చేత అతని కోసం జరిగిన వేట నుంచి తప్పించుకునేందుకు బహ్రామ్ అనేక వారాలు మిత్రుల ఇండ్లల్లో తలదాచుకున్నాడు. శత్రుదాడుల నుంచి తప్పించుకునేందుకు దేశమంతా దిమ్మరిలా కలియదిరిగాడు. చివరికి ఇరాన్ నైరుతి భాగాన ఉన్న టర్కీ సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఓ ఏజెంట్‌ను కలిసి దేశ సరిహద్దులు దాటిస్తే వచ్చిన తర్వాత ప్రతిఫలంగా డబ్బులు చెల్లిస్తానని చెప్పి అతనితో ఒప్పం దం కుదుర్చుకున్నాడు. పెద్ద కట్టె మొద్దులు తరలించే లారీలో వాటికింద పడుకొని టర్కీలోకి చేరాడు. టర్కీలో బహ్రామ్ మరో లారీలోకి మారా ల్సి వచ్చింది. ఆ లారీ డ్రైవర్ అతని చుట్టూ అల్యూమినియం రేకు ఒకటి చుట్టి లారిలో పడేశాడు. దాంతో ఎలాంటి డిటెక్టర్ నుంచి అయినా తప్పించుకోవచ్చునని తెలిపారు. ఆ తర్వాత మూడో లారీ ఎక్కాడు.

ఇటలీదో, ఫ్రాన్స్‌దో తెలియదు. కానీ ఆ లారీ డ్రైవర్ బహ్రామ్‌ను ఓ అడవిలో వదిలిపెడుతామని మాత్రం చెప్పాడు. అడవిలో వదిలిన తర్వాత అక్కడ నిండా యాపిల్ పండ్లు ఉన్న నాలుగో లారీ ఎక్కాల్సి వచ్చింది. ఆ పండ్లపై బహ్రా మ్ పడుకోవాల్సి వచ్చింది. అయితే ఆ లారీ ఒక పెద్ద రిఫ్రిజిరేటర్ లాంటి ది. దానిలో 14 గంటలు ప్రయాణించాల్సి వచ్చింది. అందులో మాంసం, ఇతర ఆహార పదార్థాలు రవాణాచేసే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. రవా ణా చేస్తున్న పదార్థాలు చెడిపోకుండా అందులో నాలుగు సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వచ్చేవరకు చల్లబరుస్తారు. నాలుగు సెంటిగ్రేడ్లకు పడిపోయిన తర్వా త రిఫ్రిజిరేటర్ పది నిమిషాలు ఆగిపోయి తిరిగి పనిచేయటం ప్రారంభి స్తుంది. ఒకానొక దశలో బహ్రామ్ చనిపోతానేమోనని భయపడ్డాడు. చివరికి బహ్రామ్ ఇంగ్లండ్‌లోన లీడ్స్-మాంచెస్టర్ మధ్య రోడ్డు మార్గంలో విడిచిపెట్టారు.

బహ్రామ్‌కు తాను ఎక్కడున్నాడో తెలియదు. చుట్టూ ఉన్న మనుషులు ఎవరు? తానున్నది ఏ దేశమో కూడా తెలియదు. లారీ డ్రైవర్ బహ్రామ్ దగ్గరున్న సూట్‌కేస్‌ను కూడా ఇవ్వకుండా లారీ నుంచి కిందకు నెట్టేసి వెళ్లిపోయాడు. బట్టలన్నీ మాసిపోయి చూడటానికే భయం గొలిపే లా తయారైన అతను ఓ వాహనాన్ని నిలిపి తాను ఎక్కడున్నానని అడిగాడు. వాహనదారుడు ఇంగ్లండ్ అని తెలిపాడు. అంతలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బహ్రామ్ రెండుచేతులు వెనుకకు విరిచి కట్టి పోలీస్‌స్టేషన్‌కు తీసుకుపోయారు. అనేక ప్రశ్నల పరంపర తర్వాత ప్రమాదకరమైన వ్యక్తి కాదని తేలింది. బహ్రామ్ దగ్గరికి ఎవరూ రావటం లేదు. ఎందుకంటే వారాల తరబడి గూడ్స్ లారీల్లో ప్రయాణం చేసి వచ్చిన కారణంగా బట్ట లు, మనిషంతా మురికిలో మునిగిపోయాడు. చూడటానికే భయం గొలిపేలా తయారయ్యాడు. చివరికి శరణార్థి హోదాతో కడు దయనీయంగా బతుకాల్సిన స్థితిలో ఉన్నాడు. సరిగ్గా ఇదేవిధంగా ఈ 39 మంది కూడా ఇంగ్లండ్‌లో ప్రవేశించటానికి సాహసించి మృత్యువాత పడ్డవారై ఉంటారనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఈ 39 మంది మాత్రమే కాదు మొత్తం వందమంది దాకా ఇంగ్లండ్‌లో ప్రవేశించారని, మిగితా వారు మరెక్కడో ఉండి ఉంటారనే అనుమానాలున్నాయి.

ఏదేమైనా ఈ అక్రమ వలసదారుల పరిస్థితులు కడు దయనీయంగా ఉంటున్నాయి. సరిహద్దులు దాటి దొంగచాటుగా ప్రయాణించే క్రమంలో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. దొంగచాటుగా ఎన్నో కష్టాలకోర్చి ఇంగ్లండ్ గడ్డమీద కాలుపెట్టినా జీవన పరిస్థితులు దుర్భరంగా ఉంటున్నాయి. ఇప్పటికైనా మానవ అక్రమరవాణాను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

Courtesy Namaste Telangana..