శ్రీనగర్‌: ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో అసాధారణ పరిస్థితులు ఇంకా కోనసాగుతున్నాయనడానికి అక్కడి వలస కార్మికుల దుస్థితి అద్దం పడుతున్నది. ప్రస్తుతం వలస కార్మికులను ఉగ్రమూకలు టార్గెట్‌ చేసుకుని దాడులకు తెగబడుతున్నా రు. దీంతో వలస కార్మికులతో పాటు స్థానికు లు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. అలాగే ఆంక్షల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితు లతో వారికి పనులు లభించడంలేదు. దీనిక ితోడు జమ్మూకాశ్మీర్‌ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. తాజాగా లో యలో స్థానికేతరులను హెచ్చరిస్తూ పలు పో స్టర్లు వెలువడటం గమనార్హం. వాటిల్లో స్థాని కేతరులు వెంటనే రాష్ట్రం విడిచి వెళ్లాలని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే కాశ్మీరీ ల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో వలస కార్మికులు జమ్మూకాశ్మీ ర్‌ను వొదిలి వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వందలాది వలస కార్మికులు శ్రీనగర్‌ సమీపం లోని నార్బల్‌ నుంచి తమ ప్రాంతానికి రావ డానికి సిద్ధమయ్యారు. అలాగే మిగతా ప్రాం తాల్లో ఉన్న పలువురు వలస కార్మికలు తమ ప్రాంతానికి వెళ్లడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు.
వలస కార్మికుల్లో ఒకరు మాట్లాడుతూ.. ‘మూడు నెలల నుంచి పరిస్థితులు ఏం బాగలేవు. పని దొరకట్లేదు. దీనికి తోడు వలసొచ్చిన వారిపై మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం భయం భయం గానే రోజులు వెళ్లదీస్తున్నాం. దీనికి తోడు చలి తీవ్రత పెరిగింది. ఇన్ని ప్రతికూలతల మధ్య ఇక్కడే ఉండే కంటే మా ప్రాంతానికి పోయి బతకటం మంచిదనిపిస్తుంది. కానీ వెళ్లడానికి రవాణా సౌకర్యమూ లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Courtesy Navatelangana…