Image result for దక్షిణాదిలో మానసిక"

  • దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి ఈ సమస్య
  • 2017నాటికి 1.97 కోట్ల మంది వ్యాధిగ్రస్థులు
  • 1990-2017 మధ్యలో రోగుల సంఖ్య రెట్టింపు
  • తాజా అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్‌ : దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. మానసిక రుగ్మతలతో బాధపడేవారి సంఖ్య దాదాపు రెట్టింపయిందని, వాటిలో దక్షిణాది రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయని వివరించింది. బిల్‌ మెలిండా గేట్స్‌ పౌండేషన్‌( జీబీడీ) ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పరిశోధక విభాగం సంయుక్తంగా అధ్యయనం చేసి ఆ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం 2017 చివరి నాటికి ఇండియాలో 1.97 కోట్ల మంది మానసిక వ్యాధుల బారినపడ్డారు. అందులో 46 లక్షల మంది డిప్రెషన్‌తో, మరో 45 లక్షల తీవ్రమైన మానసిక ఆందోళనతో ఉన్నారు. 1990నుంచి 2017 కాలం మధ్య వీరి సంఖ్య రెట్టింపు అయింది. దక్షిణాది రాష్ట్రాల్లో మానసిక రుగ్మతల కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ్‌ వెల్లడించారు. ఉత్తర భారతంలో పిల్లలకు సంబంధించిన మానసిక రుగ్మతల కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు.

తెలంగాణలో ఇదీ లెక్క
రాష్ట్రంలో కూడా మానసిక వ్యాఽధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూనే ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి లక్ష మందిలో 756 మంది డిప్రెసివ్‌ డిసార్డర్‌తోనూ, 324 మంది యాంగ్జయిటీ డిసార్డర్‌తో, 142 మంది ఐడియోపాథిక్‌ డెవలె్‌పమెంట్‌ ఇంటెలెక్చువల్‌ డిసెబిలిటీతో, 175 మంది స్ర్కీజోఫ్రీనియాతో, 120 మంది బయోపోలార్డ్‌ డిసార్డర్‌, 85 మంది కండక్డ్‌ డిసార్డర్‌తో, 52 మంది ఆటిజంతోనూ, 43 మంది ఈటింగ్‌ డిసార్డర్‌, 4.7 శాతం మంది అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ యాక్టివిటీ డిసార్డర్‌, 140 మంది ఇతర మానసిక వ్యాధులతో బాధపడుతున్నట్లు ఆ అధ్యయనంలో వెల్లడైంది.
అధ్యయనంలో వెల్లడైన అంశాలివే
2017లో దేశవ్యాప్తంగా 19.7 కోట్ల మంది భారతీయులు వివిధ రకాల మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఇందులో 45.7 లక్షల మంది డిప్రెషన్‌, 44.9 మంది మానసిక ఆందోళనతో బాధపడుతున్నారు.
1990లో వీరి సంఖ్య 2.5 శాతంగా ఉండగా 2017 నాటికి 4.7 శాతానికి పెరిగింది.
మానసిక రుగ్మతలన్నింటిలోనూ 33.8 శాతం డిప్రెషన్‌ వాళ్లుంటే, ఐడియోపాథిక్‌ డెవలె్‌పమెంట్‌ ఇంటెలెక్టువల్‌ డిసేబులిటీ 10.8 శాతం, స్ర్కీజోఫ్రీనియా 9.8 శాతం ఉన్నారు.

యుక్తవయసు వారిలో 3.3 శాతం డిప్రెషన్‌, 3.3 శాతం మానసిక ఆందోళన, 0.55 శాతం బయోపోలార్డ్‌ డిసార్డర్‌, 0.25 శాతం స్ర్కీజోఫ్రీనియాతో బాధపడుతున్నారు. మహిళల్లో విపరీతంగా తినడమనే డిసార్డర్‌, మానసిక ఆందోళన, డిప్రెషన్‌ ఎక్కువగా ఉంది.

(Courtesy Andhrajyothi)