అంబేద్కర్ ను అవమానిస్తే సహించం

  14.42019న జరిగిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొనకుండా రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతను అవమాన పరిచినందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజునుండి మొదలై 22 వరకు జరుగు నిరసన కార్యక్రమాలు పకడ్బందీగా విజయవంతమయ్యేలా ప్రతి ఒక్కరు శ్రమించాలి. హైదరాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ మరియు అన్ని అనుబంధ విభాగాల కమిటీల ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి మొదలై 22 వరకు జరుగు నిరసన కార్యక్రమాల్లో టిఆర్ఎస్ యేతర అన్ని రాజకీయ పార్టీలకు చెందిన రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రధాన నాయకులను ఆహ్వానిస్తూ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం జరుగుతుంది. రేపు ఉదయం ఇందిరాపార్కు వద్దధర్నా జరుగుతుంది. అలాగే ప్రతిరోజు వివిధ రాజకీయ పార్టీల నుండి మరియు ప్రజా సంఘాల నుండి రోజుకు ఒక్కరు, ఇద్దరు చొప్పున పాల్గొనేలా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. అదే విధంగా తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో కూడా పకడ్బందీగా జరిగేలా ప్రతిరోజు వివిధ రాజకీయ పక్షాల నుండి మరియు ప్రజా సంఘాల నుండి ప్రధానమైన నాయకులు మనం నిర్వహించే నిరసన కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా చూడాలి. మనం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రధానంగా నాలుగు అంశాలు వుండేలా చూడండి.

1) అంబేద్కర్ జయంతి ఉత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొనకుండా అంబేద్కర్ను అవమానించడాన్ని నిరసిస్తూ….

2) పంజాగుట్ట వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి జిహెచ్ఎంసీ మరియు పోలీసులు చెత్తకుప్పలో పడేయడాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో ఖండించకపోవడాన్ని నిరసిస్తూ…

3) 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేస్తామని కెసిఆర్ మాట ఇచ్చి మూడేళ్లు గడిచినా దానిపై ఎలాంటి ప్రభుత్వ పరంగా ముందడుగు వేయకపోవటాన్ని నిరసిస్తూ….

4) ప్రస్తుతం కెసిఆర్ వుంటున్న ఎర్రవెల్లి గ్రామంలో రోడ్డు వెడల్పు పేరుతో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి శిథిలావస్థలో వున్న పాఠశాల ఆవరణలో ఒక మూలకు నేల మీద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడాన్ని నిరసిస్తూ….

కృష్ణ మాదిగ హౌస్ అరెస్ట్ 

ఏప్రిల్ 17 నుంచి 22 వరకు తెలంగాణ రాష్ట్రమంతటా జరప తల పెట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడంకోసం తెరాస ప్రభుత్వం కృష్ణ మాధిగను హౌస్ అరెస్టు చేసింది. ఈ నిరంకుశ చర్యను  ఖండిస్తూ, కృష్ణ  మాదిగ  కు సంఘీభావం తెలుపుతూ బహుజనప్రతిఘటనవేదిక (B.R.F)రాష్ట్రకో ఆర్డినేటర్ ఉసా, తెలంగాణా ఇంటిపార్టీ అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ కృష్ణ మాదిగ ఇంటిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.