~కామ్రేడ్ దొడ్డి కొమరయ్య :-నాడు దేశ్ ముకుల, జమీందారుల వెట్టిచాకిరి, లేవిదాన్యం(పేర చేస్తున్నఅక్రమ) వసూళ్ళను రద్దు చేయాలని, నిజాం రజాకార్ల దోపిడీ,పీడనలకు,నిర్భంద పన్నులవసూళ్ళకు, భూస్వామ్య దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గ్రామ గ్రామాన ఊరేగింపులు నిర్వహిస్తుండగా 1946జూలై 4 న కడివెండి గ్రామంలో విసునూర్ దేశ్ ముఖ్ కిరాయి గూండాలు దొంగచాటుగా జరిపిన తుపాకి కాల్పుల్లో నేలకొరిగిన తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య. ఆయన మరణంతో ప్రజా ఉద్యమం మలుపు తిరిగి ఉన్నత పోరాటంగా వృద్దిచెంది, భూస్వాముల, దేశ్ ముక్ ల చేతుల్లో బందించబడి ఉన్న 10లక్షల ఎకరాల భూములను ప్రజలు పంపిణీ చేసుకున్నారు. పంచుకున్న భూములను రక్షించుకొనేందుకై 10వేల మంది ప్రజలు సాయుధ గెరిల్లాలుగా తయారైనారు. నిజాం నియంతృత్వ పాలనను ఎదిరించి, 50వేల నెహ్రూ కసాయి సైన్యంతో విరోచితంగా పోరాడారు. భూమి, భుక్తి, విముక్తి ల కొరకై సాగిన ఆ మహత్తర పోరాటం లో అశేష ప్రజానీకంతోపాటు, మహిళలు కూడా  విరోచితంగా పాల్గొని, మూడు వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాల నేర్పరుచుకున్నారు.ఈ పోరాటంలో వేలాదిమంది అమరులైనారు.

~కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వర రావు (డి.వి) 1946నుండి1951 వరకు సాగిన మహత్తర తెలంగాణ ప్రజల సాయుధ పోరాటంలో తాను స్వయంగా పొందిన అనుభవాలతో నగ్జల్ బరీ, శ్రీ కాకుళం తదితర అనేక పోరాటాల గుణపాటాలతో పాటు ప్రపంచ విప్లవానుభవాలను క్రోడీకరించి, మార్క్సిజం-లెనినిజం- మావోఆలోచనవిధానం(ప్రజాయుద్దపంథా)ను  ప్రాపంచిక దృక్పథంగా ప్రకటించి, విప్లవం కుట్రకాదు -విప్లవకారులు కుట్ర దారులుకారు, భారత విప్లవం- భారత ప్రజల జన్మ హక్కు, ఈవిప్లవంకోసంపనిచేయటం  విప్లవకారుల జన్మ హక్కు, ఆజన్మ హక్కును ఏ రాజ్యాంగము, ఏచట్టమూ, పాలకవర్గాల లక్షలాది సాయుధ బలాల పాశవిక నిర్భంధ విధానం హరించజాలదు, అణచివేయజాలదు, భారత విప్లవం విజయవంతమై తీరుతుంది. ప్రపంచ విప్లవ గమనంసూచిస్తున్నది  ఇదేననిచాటిచెప్పారు.

~కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి(టి.ఎన్)  కమ్యూనిస్టు విప్లవకారుల మైన మేము ప్రజాయుధ్ద సిద్దాంతాన్ని నమ్ముతున్నాం, మావిప్లవపంథా రివిజనిస్టు, పార్లమెంటరీ పంథాకు పూర్తిగా బిన్నమైనది, మా పంథాను గురించి మా తక్షణ కార్యక్రమం లో ప్రకటించాం”గ్రామాలను విముక్తి చేసి పట్టణాలను చుట్టుముట్టి క్రమంగా పట్టణప్రాంతాలను విముక్తి చేయటం, ఈ కార్యక్రమంలోని కీలకాంశం అనికూడా అందులో మేం ప్రకటించాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా అమలుచేయడంలో వ్యవసాయ విప్లవం కీలకపాత్ర వహిస్తుంది” అందువలననే విప్లవకారులు భూమి పంపిణీ ప్రాధాన్యతను ప్రచారం చేయ వలసిన, భూమి సమస్యపై ప్రజలను కార్యాచరణకు సంఘటిత పర్చ వలసిన అవసరం ఎంతైనా ఉందని చాటిచెప్పారు. “విప్లవకారుల ఐక్యతను ప్రగాఢంగా కాంక్షిస్తూ, యువతను విప్లవోద్యమం లోకి సమీకరించాల్సిందిగా నొక్కి చెప్పారు.
~కామ్రేడ్స్ డివి-టిఎయన్ లు దేశ వ్యాప్తంగాఉన్నవిప్లవకారులను ఐక్యంచేయడానికై 1975లో యు. సి.సి.ఆర్.ఐ(ఎంఎల్)నుస్థాపించారు.ఈ క్రమంలోనే అనేక ఇబ్బందులను ఎదుర్కొని, అనేక సంవత్సరాలు జైలు జీవితం, రహస్య జీవితాలను గడిపారు.చివరకు శత్రువును గేలిచేస్తూ అజ్ఞాత వాసంలోనే కా,, డివి 12/07/1984 న- కా,, టిఎన్ 28/07/1976న ఇరువురూ జూలై మాసంలోనే అమరులైనారు. అలాగే అనేకమంది విప్లవకారులు జూలై మాసంలోనే అమరులైనారు.

~వివ్లవం కోసం జీవించి-విప్లవం కోసం మరణించిన అమర వీరులందరికీ విప్లవ జోహార్లు అర్పిస్తూ వారందించిన విప్లవ స్పూర్తితో భారత జనతా ప్రజాతంత్ర విప్లవానికి ఇరుసువంటిదైన వ్యవసాయ విప్లవోద్యమాన్ని, కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన, ఉపాద్యాయ, మేధావి తదితర ప్రజాతంత్ర ఉద్యమాలను మరింత ముందుకు తీసుకు పోవడమే అమరులకు మనమందించే నిజమైన నివాళిగా బావిస్తున్నాము. దానిలో బాగంగానే జూలై మాసాన్ని అమరులమాసంగాబావిస్తూ.. తెలంగాణ ప్రజల సాయుధ పోరాటంలో తొలి అమరుడైన కామ్రేడ్ దొడ్డి కొమురయ్య, భారత విప్లవ రథసారథులుకామ్రేడ్స్ డివి- టిఎన్ ల సంస్మరణ సభలను రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిదగ్రామాలు, పట్టణ కేంద్రాలలో నిర్వహించ తలపెట్టాము.
~కావున అమరవీరుల సంస్మరణ సభలకు అన్ని రంగాల ప్రజలు తమ విలువైన ఆర్థిక,హార్దిక,సహాయ, సహకారాలనుఅందించివిజయవంతంచేయవలసిందిగామనవిచేస్తున్నాము.

~విప్లవాభివందనలతో…….
జి.సదానందం,కార్యదర్శి ~భారత కమ్యూనిస్టువిప్లవకారుల సమైక్యతాకేంద్రం(మార్క్సిస్టు-లెనినిస్టు) UCCRI-(ML) కిషన్ వర్గం.సెల్ నెం:9494970334.