Maharashtra BJP proposes Bharat Ratna for Savarkar - Sakshi

మళ్లీ అధికారంలోకి వస్తే.. అందుకు ప్రయత్నిస్తాం
బీజేపీ హామీ.. మ్యానిఫెస్టో విడుదల

ముంబై: మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి వస్తే.. హిందూత్వ సిద్ధాంత రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు వీరసావర్కర్‌కు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న కోసం ప్రయత్నిస్తామని భారతీయ జనతాపార్టీ హామీ ఇచ్చింది.  సావర్కర్‌తోపాటు మహాత్మా ఫూలే, సావిత్రిభాయ్ ఫూలేకు  భారతరత్న కోసం కేంద్రానికి సిఫారసు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముంబైలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. వచ్చే ఐదేళ్లలో మహారాష్ట్రలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని కమలదళం తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అందరికీ ఇళ్లు, ఆరోగ్యం, మంచినీటి సరఫరా కల్పిస్తామని తెలిపింది. రాష్ట్రాన్ని కరువురహితంగా చేసేందుకు 11 డ్యామ్‌లతో మహారాష్ట్ర వాటర్‌గ్రిడ్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చింది.

Courtesy Sakshi