– ఎన్జీఓలపై నిఘా పెట్టిన అక్రమ ముఠా
– ఆందోళన వ్యక్తం చేస్తున్న ఎన్జీఓలు
– బడుగు, బలహీన వర్గాలను అప్రమత్తంగా ఉండాలని సూచనలు
– గ్రామాల్లో అధికంగా అరాచకాలకు పాల్పడుతున్న మనవ అక్రమాలు

న్యూఢిల్లీ: కరోనా కాలంలో లాక్‌డౌన్‌ ఎన్నో అంతరాయాలు, అనర్ధాలకు దారితీసింది. ఈ క్రమంలో పెద్దలు, పిల్లలను శ్రమకోసం మానవ అక్రమ రవాణాకు పాల్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉందని నిపుణులు ఓ సర్వేలో వెల్లడించారు. ఈ లాక్డౌన్ని ఆసరాగ తీసుకొని 89 శాతం మంది ఎన్జీఓలలో, పెద్దలు మరియు పిల్లలను శ్రమ కోసం అక్రమ రవాణా దోపిడిలో ”ఇదో కొత్తరకం దోపిడీ” అని పేర్కొంది. కైలాష్‌ సత్యార్థి చిల్డ్రన్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన అధ్యయనం.. ఈ విషయంపై ఎన్జీవోలు ఆందోళనకు గురవుతున్నారు. ఇందులో అధికశాతంలో ”లైంగిక వేధింపుల కోసం, మానవ అక్రమ రవాణాను చేస్తున్నారు.

గ్రామలలో ఈ అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వారిని అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పిల్లలకు ప్రత్యేక సూచనతో తక్కువ-ఆదాయ గహాలపై లాక్డౌన్‌, ఆర్థిక అంతరాయం యొక్క శీర్షికతో, ఈ అధ్యయనం 53 ఎన్జీఓల (దశ -1) మరియు అక్రమ రవాణాకు గురయ్యే రాష్ట్రాల (దశ -2) నుండి 245 గహాల ప్రతిస్పందనలపై ఆధారపడి ఉంటుంది. దశ 1 ఏప్రిల్‌ 27-మే 5, దశ -2 మే 17 నుండి 24 వరకు జరిగింది.

లాక్డౌన్‌ అనంతర కాలంలో అధిక వడ్డీ రేట్లపై స్థానిక మనీ రుణదాతల నుండి కుటుంబాలు క్రెడిట్‌ మీద నగదు తీసుకోవచ్చని, ఫలితంగా, వారిలో ఎక్కువ సంఖ్యలో రుణ బంధం ఉచ్చులో పడవచ్చుననీ ఎన్జీఓలలో 81శాతం మంది చెప్పారు. ఈ లాక్డౌన్ సంక్షోభ కాలంలో బాల్యవివాహాలు సైతం రాష్ట్రాలలో అధికంగా పెరిగే అవకశం ఉందని చెబుతున్నారు. కరోనా కాలంలో ఎన్జీఓలలో అధికంగా ఉపాది నష్టం కలగడంతో వారు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆ సర్వేలో పేర్కొన్నారు.