Prof. Surepally Sujatha 

అన్ని మతాలల, ప్రాంతాలలో పెళ్ళి తప్పదు అని, వర్ణాశ్రమంలో గ్రుహస్తాశ్రమం చాలా ముఖ్యమని మనలని పెంచుతున్నారు. ఆ తరువాత వంశోద్ధారకుడు, పుత్రుడు పున్నామ నరకం నుండి కాపాడతాడని పిల్లలు అందులో అబ్బాయి ముఖ్యం అన్నారు. సమాజం ముందుకు పోతున్నా, కొద్దీ కొద్దిగా మార్పులు కనపడుతున్నా, కొద్ది మంది తమ కిష్టమైన వ్యక్తులని పెళ్ళి చేసుకుంటున్నారు కాని, వాళ్ళూ, మనం సంప్రదాయాల నుండి బయట పడలేదు. పిల్లలని ఆస్తులుగా, స్త్రీలని (ముఖ్యంగా యోనిలని) సంస్క్రుతి, పరువు, ప్రతిష్టకి కేంద్రాలుగా చూస్తున్నారు/ము.

గత అయిదారు సంవత్సరాలుగా ప్రేమ, పెళ్ళి పేరు మీద ఎన్నో హత్యలు, నేరాలు చూసినం, పని చేస్తున్నాం. కులం చాలా బలంగా అన్ని వర్గాల్లో,కులాల్లో నాటుకు పోయింది. క్రింది కులాల వాళ్ళు కాస్త పెద్ద కులం అమ్మాయి అయినా అబ్బాయి అయినా మంచిగా చూసుకుంటున్నారు ( క్కడ కూడా బలంగా పనిచేసేది కులమే, మనకంటే వాళ్ళు పెద్ద అనే భావం కాని పై కులాల వాళ్ళు దీనికి వ్యతిరేకంగా ఎకంగా చంపెస్తున్నారు లెదా తరువాత అమ్మాయిలకి, అబ్బాయిలకి బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు).

ఇక్కడ మీముందు, మీకు తెలిసిన కేస్ వివరాలు ప్రశ్నలు పెడుతున్నా.స్వేచ్చ, సంప్రదాయాలు,న్యాయం, అన్యాయం మధ్య నలిగిపోయే సంధర్భాలు మాముందు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అయినా మనకి తప్పదు మారుతున్న కాలాలని, భంధాలని, దేనికి లొంగని స్వేచ్చ, స్వార్ద ప్రయోజనాలని చర్చించక తప్పదు. ఇవ్వాళ హుస్నాబాద్లో భారతిని చేరుకున్నాం. ఆమె చిన్న పిల్ల (దళిత యువతి, నేతకాని కులం, మంచిర్యాల) కుమ్మరి కులస్తుడు అమ్మాయిని ప్రేమించాను అన్నాడు, గుళ్ళో పెళ్ళి చేసుకున్నాడు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, దళిత స్త్రీ, పురుషుడు అంటే వొప్పుకునేది ఎవరు చెప్పండి).

ఈ విషయంలో మాత్రం అందరూ సమానమే, నో క్లాస్, కాస్ట్. అయినా ఎప్పటిలాగానే తక్కువ అనుకునే కులం బాగానే చూసుకుంటుంది. ఇక్కడ అమ్మాయి తల్లితండులు ఉన్న రెండెకరాలు అమ్మి అతనికి బెకరి పెట్టించారు, ఇద్దరు పిల్లలని కన్నారు, ఆడబిడ్డ పెళ్ళి అని అత్తగారు తీసుకు పొయారు, అంతా బాగానె ఉంది అనుకునే లోపల ఆడబిడ్డ భర్త మొదలు పెట్టాడు నీ అన్న ఒక ఎస్సి (ఇంత మర్యాదగా కాదులెండి) చేసుకున్నాడు అని, అది బిడ్డ నుండి అత్తగారి కి అక్కడినుండి భర్తగారికి పాకింది.. 20 లక్షల కట్నం కావాలన్నాడు, చిన్న బిడ్డ నాకు పుట్టలేదు అని, అసలు బిడ్డ పుడితే వద్దు అని నానా హింసలుపెట్టారు. డెలివరి కోసం పుట్టింటికి పోతే నేను వేరే పెళ్ళి చేసుకుంటా అని మెసెజ్ పెట్టాడు, ఎంచేయాలో తోచక చంటి పిల్లలతో వచ్చేసింది. నగరాల్లో, ఇక్కడ చదువుకున్న మూర్ఖుల్లో మా కులం, మా ప్రాంతం కాదు కధా అని ఎవడూ పట్టించుకోడు కాని ఊరుకాని ఊర్లో మొత్తం మాదిగ జనాభా అమ్మాయికి అండగా నిలబడ్డది అక్కున చేర్చుకుంది, ఎన్నో వాయిదాలు పెట్టారు, అక్కడ కొమరన్న, పాతకాలం కమ్యునిస్ట్ నాయకుడు, కొమ్ము భాస్కర్ ఆద్వర్యంలో ఇప్పటి వరకు కత లాక్కొచ్చారు. గత మూడు నెలలుగా అమ్మాయి ఏడుస్తూ ఫొన్ చేస్తూనె ఉంది. ఒక పేద అమ్మాయి అందులో దళితురాలు, ఇద్దరు ఆడబిడ్డలు, నమ్మించి మోసం చేస్తే ఉండే భాధ అనుభవించిన వారికే తెలుస్తుంది.మళ్ళీ వాయిదా పడింది, బలవంతంగా ఇంట్లో అమ్మాయిని పంపిద్దాం (నాకైతే ఇష్టం లేదు) అని లేదా అమ్మాయి అక్కడే ఉండి కూలో నాలో చేసుకుని బ్రతకాలని, అమ్మాయికి ఇష్తమైనవి అవి రెండే.

ఎప్పు డూ ఎదురయ్యే రెండు క్లిష్టమైన ప్రశ్నలు..
*అవును మోసం చెసాడు, ప్రేమ, పెళ్ళిలో కులం బలంగా పని చేస్తుంది. పచ్చిగా చెప్పాలంటే వాడుకొని వదిలేస్తున్నారు, మొగాళ్ళైతే చంపేస్తున్నారు, లేదా బెదిరిస్తున్నారు (అది ఇంకొక కెస్) ఆడపిల్లలైతె వదిలేస్తున్నారు లేదా కాల్చి బూడిద చేస్తున్నారు.
*అసలు మన సమాజం లో ప్రతి పరిచయం ఖచ్చితంగా ప్రేమ గా మారాలని, అది పెళ్ళి తో ముగించాలని అందరి మెదళ్ళలో ఫీడ్ అయిపోయింది. టు భి ఫ్రాంక్ ఆ మాట లేకపోతే సెక్స్ కష్టం ఇక్కడ. మొన్నొకాయాన ఒపెన్ గా అందుకోసమేగా పెళ్ళిళ్ళు అని చక్కగా చెప్పాడు. సరే ఇవన్ని కొన్ని రొజులకి ఆవిరి అయిపోతున్నాయి. హఠాత్తుగా అమ్మాయికో అబ్బాయికో కులం గుర్తుకు వస్తుంది, వాస్తవ ప్రపంచంలోకి వచ్చేసరికి అన్నీ అంటే సాంప్రదాయాలు కట్టుబాట్లు చాలాపెద్దవిగా కనపడుతున్నాయి.

కుటుంబాలు, సంబంధాలు పవర్ సెంటర్స్ అయిన విషయం కూడా చాలమందికి తెలియదు. పిత్రుస్వామ్యం, జెండర్ వివక్ష ముందుకొస్తాయి. ఇక బెదిరించో, బ్రతిమాలో ఒకదగ్గరికితెస్తున్నం. అవి నిజంగా నిలబడతాయా ? ఎవరో ఒకళ్ళు ఉంటారా ? చంపెస్తారా ?

* వివాహం, ఆ వ్యవస్థలొ లెకపొతే బ్రతుకు లేదా ?చచ్చిపోతారా ?

* భర్తో భార్యో లేకపోతే బ్రతకడం అంత కష్టమా ? ఒక వేళ అక్సిడెంట్ లోనొ, దుబై లోనో చచ్చిపోతే పార్ట్నర్ కూడా చావాల ?

చెప్పండి అన్యాయం చేసింది నిజమే కాని మోసం చేసిన వాడితోటే జీవితాతం చావాలా ?

కోర్ట్ లు, పొలిస్ స్టెషన్లు, మీడియా, వాదోపవాదాలు.. చివరికి అమ్మాయికి సెక్యూరిటి కొరకు అంతో ఇంతో సహాయం, అది కూడా అబ్బాయికి ఎమైనా ఉంటే  అమ్మాయిలు ఎదన్నా ఉద్యోగం, పనిచేసుకుంటూ ఉంటారా అంటే అంత ధైర్యంగా కనపడట్లేదు. అసలు పైచదువులే లేవు  ఉన్నా పెళ్ళి మీద పెట్టిన శ్రద్ధ వేరే విషయాల్లో లేదు. పెళ్ళి నిజంగా జీవితంలో టర్నింగ్ పాయింటా లేకపొతే సూసైడ్, డెత్, క్రైం పాయింటా ?

(చదువుకొని, పట్టణాల్లో, యూనివర్సిటిలలో చదువుకొని సక్సెస్ అయిన వాళ్ళ అనుభవాలు ఈ కోవలో రావు) చెప్పండి ! రేపు మరో కోణంలో మరో చర్చ.