బెంగళూరు : భారత ప్రతిష్ఠాత్మక కలల ప్రాజెక్టు గగన్‌యాన్‌. తొలిసారిగా వ్యోమగాములతో కూడిన వ్యోమనౌకను రోదసీలోకి పంపే ప్రాజెక్టు ఇది. 2021 డిసెంబరులో ఈ మానవసహిత రోదసీయాత్రకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. అయితే దానికి ముందే రెండు మానవరహిత (అన్‌మ్యాన్‌డ్‌) గగన్‌యాన్‌ ప్రాజెక్టులను చేపడతామని, అందులో ‘వ్యోమమిత్ర’ అనే లేడీ రోబోను పంపిస్తామని ఇస్రో చైర్మన్‌ కె శివన్‌ బుధవారం ప్రకటించారు.

ఈ ఏడాది డిసెంబరులో ఒకటి, 2021 జూన్‌లో మరొక గగన్‌యాన్‌ ప్రయోగం ఉంటుందన్నారు. బుధవారమిక్కడ జరిగిన ‘హ్యూమన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ అండ్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ – ప్రెజెంట్‌ చాలెంజెస్‌ అండ్‌ ఫ్యూచర్‌ ట్రెండ్స్‌’ కార్యక్రమంలో శివన్‌ ఈవిషయాన్ని ప్రకటించారు.