Image result for women mekuup"లండన్‌: అలంకరణ సాధనాల వాడకంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను బ్రిటన్‌లోని ఆస్టన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు నొక్కి చెప్పారు. లిప్‌ గ్లాస్‌, బ్యూటీ బ్లెండర్లు, మస్కారా తదితర సాధనాల్లో ఔషధాలకు లొంగని ఇ-కోలి, స్టఫైలోకోకై వంటి మొండి బ్యాక్టీరియా జాడను తాము గుర్తించినట్లు తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రతి 10 అలంకరణ సాధనాల్లో 9 కలుషితమైనవేనని తేల్చారు. వాటి కారణంగా చర్మ వ్యాధులు మొదలుకొని రక్తం విషతుల్యమవడం వంటి ప్రాణాంతక సమస్యలు కూడా తలెత్తుతున్నట్లు చెప్పారు. పలు ఉత్పత్తులను నిర్దేశిత గడువు దాటిన తర్వాత వాడుతుండటం, సరిగా శుభ్రం చేసుకోకపోవడంతో బ్యాక్టీరియా పేరుకుపోతున్నట్లు పేర్కొన్నారు.

(Courtesy Eenadu)