హైదరాబాద్‌, కొత్తగూడెం, మంచిర్యాల : సింగరేణిలో లేఫ్‌ అమల్లోకొచ్చింది. అక్కడి భూగర్భ గనులలో 22 గనులను  14దాకా మూసివేయనున్నారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌కు అనుగుణంగా సింగరేణి యాజమాన్యం బుధవారం రెండోషిప్ట్‌ నుంచి లేఆ్‌ఫను అమల్లోకి తెస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. యూజీల్లో కార్మికులు సామాజిక దూరం పాటించే అవకాశం లేనందునా లేఆ్‌ఫను అమలు చేయాలని ప్రభుత్వాన్ని పలువురు కోరారు. కొందరు  హెచ్‌ఆర్‌సీలో కూడా ఫిర్యాదు చేశారు. సింగరేణికి నోటీసులు కూడా జారీ చేసింది. ఈ మేరకు సింగరేణి పరిధిలో 27 యూజీల్లో వాటిలో 22 యూజీల్లో ఉత్పత్తిని 14వ తేదీ దాకా నిలిపివేయాలని నిర్ణయించారు. యంత్రాలతో నడుస్తున్న ఏఎల్‌పీ, వీకే-7, శాంతి ఖని, జీడేకే-11ఏ ఇంక్లెయిన్‌, కొండాపురం యూజీలు యథాతథంగా బొగ్గును ఉత్పత్తి చేయనున్నాయి. 18 ఓపెన్‌కా్‌స్ట(ఓసీ)లు కూడా నడవనున్నాయి. సింగరేణిలో 46 వేల మంది ఉద్యోగులు, కార్మికులు ఉండగా 30 వేల మందిని లేఆ్‌ఫలో పంపించనున్నారు. వీరికి పారిశ్రామిక వివాదాల చట్టం-1947ను అనుసరించి సగం వేతనాలే అందనున్నాయి.

Courtesy Andhrajyothi