రంగనాయకమ్మ
– 2 –
మాంగే కూతురు ప్రియాంక సైకిల్‌ మీద కాలేజీకి పోయేటప్పుడూ, వచ్చేటప్పుడూ, ఓబీసీ కులాల మొగ పిల్లలు, ఆమెని ఏడిపించడానికి చూస్తూ ఉంటారు. దాన్ని ప్రియాంక కొన్ని సార్లు పట్టించుకోదు. కొన్ని సార్లు సహించలేక, పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి చెబుతుంది. అక్కడ చెప్పినా, ఏమీ ప్రయోజనం ఉండదని ఆ పిల్లకి తెలీదు. మాంగే పొలాల చుట్టూ, శివశంకర్‌, అతిల్‌కర్‌, గ్యానిరామ్‌, విజయ కాడ్వతే, రాందాస్‌ కొస్రేల భూములున్నాయి. వీళ్లు ఓబీసీలు. మాంగే ఈ గ్రామంలో నివాసం పెట్టక ముందు, ఆ పొలాల గొడవలు ఎలా జరిగేవో మాంగేకి తెలీదు. ఇప్పుడు, మాంగే భూమిలో నించే, అందరి బళ్లూ నడిచే లాగ, 10 అడుగుల వెడల్పుతో, కొంత భూమిని వదలమని, ఓబీసీలు, గొడవలు ప్రారంభించారు. ఈ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో, ‘దుసాల’ అనే చిన్న టౌన్‌లో, సిద్దార్ధ అనే దళితుడు, పోలీస్‌ పటేల్‌గా ఉంటున్నాడు. ఆ పటేలు, మాంగేకి, ‘తగువులు వొద్దు’, వాళ్లతో ప్రమాదాలు వస్తాయి’ అని సలహాలు ఇస్తూ ఉంటాడు. ఆ సలహాతో, మాంగే తన భూమిలో నించి ఆ దారి కోసం కొంత భూమిని వదిలేశాడు. అయినా, ఓబీసీలు శాంతించలేదు. (దళితుల్ని, ‘దళిత కులాల వాళ్లు’ అనీ, దళితుల కన్నా పై వాళ్లని, ‘హిందూ కులాల వాళ్లు’ అనీ ఈ పుస్తకంలో చాలా తరుచుగా అంటూ ఉంటారు. దళితులు, బుద్ధిజం తీసుకున్నారు కాబట్టి, వారిని హిందువులుగా అనరు అనుకోవచ్చు.)
హిందూ కులాల ఓబీసీలు, తమ పశువుల్ని మాంగే పొలాల్లోకి తోలడం మానడంలేదు. మాంగే పొలాల్లో పంటలు నాశనం అయినప్పుడల్లా సురేఖ, ఆ పొలాల్లో వున్న హిందూ కులాల వాళ్లతో, ‘మీ పశువుల్ని, మా పొలాల్లోకి తోలతారేంటీ? మా పంటలు నాశనమైపోటం మీకు కనపడటం లేదా?’ అని అడుగుతూ ఉంటుంది. వాళ్లు, దాన్ని అవకాశంగా తీసుకుని, ”ఒసే, మహర్‌ కులం దానా! నువ్వు మమ్మల్ని అడుగుతావా?” అని, ఆ కులం పేరే ఎత్తి ఆమెని మళ్లీ మళ్లీ తిడతారు. ఆ తిట్లన్నీ, ఆ పొలాల్లో వున్న వాళ్లందరూ వింటూనే ఉంటారు. ”దళిత కులాల కన్నా మా కులాలు చాలా గొప్పవి” అని ఓబీసీలు నమ్ముతూ ఉంటారే గానీ, ”అసలు కుల విధానమే తప్పు! ఈ విధానం ప్రకారం అయితే, మనకన్నా గొప్ప కులాలు ఉన్నట్టు మనం ఒప్పుకోవలిసిందే” అనుకోరు. తమ కులాల వరకే చూసుకుని, ఆ గ్రామంలో తామే గొప్ప కులాల వారు కాబట్టి, దళితుల్ని తిడుతూనే ఉంటారు. సురేఖ కొన్నిసార్లు నిస్సహాయంగా ఊరుకుంటుంది. ఊరుకోలేనప్పుడు, పోలీసుస్టేషన్‌కి పరిగెత్తి, తనని కులం పేరుతో తిట్టారనీ, పొలాల్లో అందరూ ఆ తిట్లు విన్నారనీ, పోలీసులకు అంతా చెపుతుంది. పోలీసులు, ఆ ఫిర్యాదుని ఏ చట్టాల కింద తీసుకోవాలో అలా తీసుకోరు కదా? కొన్నిసార్లు సరిగానే తీసుకున్నా, తర్వాత ఆ ఫిర్యాదు మీద ఏ ఫలితమూ కనపడదు. సురేఖని తిట్టిన శివశంకర్‌ అనే ఓబీసీ ఒకసారి, తమ కులం వాళ్లని కొందర్ని వెంటేసుకుని మాంగే పాక ముందుకు వచ్చి, ”మా మీద పోలీసులకు ఫిర్యాదులు చేశారంటే, మీ అంతు చూస్తాం” అని చెప్పి వెళ్లాడు. సురేఖ, శివశంకర్‌ మీద ఒకసారి పెట్టిన కేసు, కోర్టులో విచారణకి వచ్చింది గానీ, సురేఖకి సాక్షులు లేరు! శివశంకర్‌ సురేఖని కులం పేరుతో తిట్టడం విన్న ఓబీసీలెవ్వరూ ఆ మాటని కోర్టులో చెప్పడానికి ఇష్టపడలేదు. దళితుల్లోనే ఒకరిద్దరు, సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధపడినా, వాళ్లని, పోలీసుస్టేషన్‌ వాళ్లు, ఏదేదో చెప్పి, కోర్టుకి రావొద్దన్నారు. దీనికి కారణం, పోలీసుస్టేషన్‌ వాళ్లు, సురేఖని తిట్టిన వ్యక్తి నించి, కొంత లంచం సంపాదించి ఉంటారు. ఈ అర్థంతో, ఈ పుస్తకం రాసిన రచయిత ఆనంద్‌, ఈ సందర్భంలో, ‘అందులో పోలీసుల పాత్ర గణనీయమైంది’ అన్నారు. సాక్షులు లేరు కాబట్టి, సురేఖని కులం పేరుతో ఒకరు తిట్టడం నిజం కాదని, కోర్టు తేల్చింది. తిట్టిన వాడికి ఏ శిక్షా పడలేదు. అసలు, ఆ తిట్టడమే జరగలేదని.
మాంగే మీద చుట్టుపట్ల వాళ్ల తగువులు ఆగడం లేదు. అసలు మాంగే పేరు మీద వున్న భూమి, 5 ఎకరాలే కాదు, 7 ఎకరాల, 12 గుంటలు. కానీ ఆ భూమి అంతా, మాంగే ఆధీనంలోకి ఎప్పుడూ రాలేదు. మాంగే, తన భూమి కొలతల్ని సరిగా చెప్పమని, భూమిని కొలిచే శాఖకి ఒకసారి ఫిర్యాదు చేశాడు. కానీ, దాని వల్ల ఏదీ జరగలేదు. మాంగే ఇక సరిపెట్టుకుని 5 ఎకరాలతో ఊరుకున్నాడు. ఓబీసీల మధ్య కూడా భూముల తగువులు ఉన్నప్పటికీ, అవి, దళితులతో వున్న తగువుల వంటివి కావు. దళితుడితో, గొడవలు ఆగిపోతే, అది హిందూ కులాలకు నచ్చదు. దళితుడితో ఎప్పుడూ ఏదో ఒక గొడవ ఉండాలి. ఓబీసీలు, ఒక వింత గొడవ మొదలుపెట్టారు. పోలీస్‌ పటేల్‌ అయిన సిద్దార్ధ, మాంగేకి బంధువే. మాంగే కొంచెం అమాయకుడు, భయస్తుడు. సిద్దార్ధ కూడా దళితుడే అయినా, అతనికి కొంత ఎక్కువ భూమి ఉంది. దాన్ని సాగు చెయ్యడానికి, దుసాల టౌన్‌కి, ఖైర్లాంజీ నించి ఓబీసీ కూలీలు కూడా వెళ్తారు. మాంగేకి ఏ గొడవ వచ్చినా, సిద్దార్ధ, మాంగే ఇంటికి వస్తూ ఉంటాడు. సిద్దార్ధ, సురేఖతో అక్రమ సంబంధానికి వస్తుంటాడని, ఓబీసీ కుటుంబాల వాళ్లందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు.
ప్రియాంకని, హిందూ కులాల కుర్రాళ్లు వేధించడం ఎక్కువై, ప్రియాంక తన కష్టాన్ని ఒకసారి సిద్దార్ధకి చెప్పుకుంది. ప్రియాంకని లైంగికంగా వేధించిన యోగేష్‌ అనే ఓబీసీ కుర్రవాడి ఇంటికి వెళ్లాడు సిద్దార్ధ. ఈయన పోలీసు పటేల్‌ కాబట్టీ, ఆస్తిపరుడు కాబట్టీ, ఇతని మాటకి, హిందూ కులాల్లో కూడా కొంత విలువ ఉంటుంది. ఆ నమ్మకంతో వెళ్లాడు సిద్దార్ధ. వెళ్లి, ఆ కుర్రాడినీ, అతని తండ్రినీ, కొంత హెచ్చరించాడు. అది రాత్రి అవడం వల్ల, సిద్దార్ధ, మాంగేతో మాట్లాడుతూ మాంగే దగ్గరే ఉండిపోయాడు. పోలీస్‌ పటేల్‌ వచ్చి, తమని మందలించినందుకు, యోగేష్‌ కుర్రాడికి, పౌరుషం వచ్చింది. తన కులం వాళ్లని, 25 మందిని వెంటేసుకుని, మాంగే పాక దగ్గిరికి వెళ్లాడు. ప్రియాంకని తను ఏదో అన్నందుకు పోలీసులకు ఫిర్యాదు చేయవద్దనీ, అలా చేస్తే, తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారనీ హెచ్చరించి వెళ్లాడు. సిద్దార్ధ అక్కడే వుండి అదంతా విన్నాడు. ‘ఏదో వాగితే వాగాడులే. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాత్రం, ఏం జరుగుతుంది? ఫిర్యాదుల వల్ల, మన పరిస్థితి మరింత దిగజారుతుంది’ అని సిద్దార్ధ, మాంగే కుటుంబంలో అందరికీ నచ్చ చెప్పాడు. ప్రియాంకని బాధ పడొద్దన్నాడు.
ఆనాటితో కూడా గొడవలు తగ్గలేదు. (ఇది చదవడానికి నాకు చాలా భయంగా వుంది. ఆ తగువులన్నిటినీ, మాంగే కుటుంబం ఎలా భరించిందో, అర్థం కావడం లేదు.) హిందూ కులాల వాళ్లు, ‘మాంగే కుటుంబాన్ని హత మార్చి తీరాలి, తప్పదు, హత మారుస్తాం’ అని ఎక్కడబడితే అక్కడ వాగేస్తున్నారు. ఆ వాగుళ్లన్నీ దళితుల దగ్గిరే! ఆ దళితులు, కొంత సానుభూతితో, ఆ వాగుళ్లన్నిటినీ, వీళ్లకి చెపుతున్నారు. ‘అలాగే వాగుతార్లే! అవన్నీ బెదిరింపులే. మనం జాగ్రత్తగా వుంటే సరిపోతుంది’ అని వాళ్లు ధైర్యం కూడా చెపుతున్నారు. సురేఖా వాళ్లు కొన్నాళ్లు, ధైర్యంగా సహిస్తూనే ఉన్నారు. అయినా, ‘వాళ్లని హతమారుస్తాం’ అనే మాటలు వింటున్నకొద్దీ సహించలేక సురేఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘మమ్మల్ని హత మారుస్తారంట’ అని, ఆ మాటల్ని తమకు ఎవరెవరు చెప్పారో, అవన్నీ చెప్పింది. సురేఖ పోలీసులకు ఈ ఫిర్యాదు చేసింది, 2006, సెప్టెంబరు 1న. ఎప్పటిలాగే, పోలీసులు ఆ ఫిర్యాదుని పట్టించుకోలేదు. పట్టించుకుని వుంటే, ”హతమారుస్తాం” అని అన్నవాళ్ల దగ్గిరికి వెళ్లి, వాళ్లని గట్టిగా హెచ్చరించడం జరుగుతుందేమో! (పోలీసు ఇన్‌స్పెక్టర్లు నిజంగా, తమ హెచ్చరికలు నిజాయితీ గా చేసి వుంటే, లంచాల జోలికి పోకుండా వుంటే, సమస్యల్లో వున్న వాళ్లకి తప్పకుండా రక్షణ ఇవ్వగలు గుతారు.) హిందూ కులాల వాళ్లు, దేనికి తెగించా రంటే, మొదట సిద్దార్ధనే చావగొట్టదలిచారు.
సిద్దార్ధ దళితుడైనా 50 ఎకరాలు గల ఆస్తిపరుడు. అదే గాక, కిరోసిన్‌ ఏజెన్సీ వుంది అతనికి. ‘దుసాల’లో, రాజకీయంగా పలుకుబడి ఉన్నవాడు. మాంగే కుటుంబానికి ఓబీసీలతో గొడవలు వచ్చినప్పుడల్లా, ‘హిందూ కులాలతో గొడవలు వొద్దు, వ్యవసాయం పనులూ, పిల్లల్ని చదివించుకోటం – ఇవే చూసుకోండి’ – అని సిద్దార్ధ, సురేఖా వాళ్ళకి ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. సిద్దార్ధ మాటల్ని మాంగే ఇంట్లో అందరూ చాలా శ్రద్ధగా తీసుకుని, అలాగే ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. కానీ, ఒక్కోసారి పొలాల్లో ఏదో ఒక గొడవ వస్తుంది. అవతలి వాళ్లు, వీళ్లని చెత్త తిట్లు తిడతారు. అది భరించలేక, వీళ్లు నిర్భయంగా జవాబులు చెపుతారు. ఈ దళితులలాగే ఇంకా రెండు మూడు దళిత కుటుంబాలు వున్నా, వాళ్లు, మాంగే కుటుంబం మీద వ్యతిరేకులు కాకపోయినా, వాళ్లు ఓబీసీలతో నిర్మొహమాటంగా ప్రవర్తించలేరు. ఆ దళితులకు, ఓబీసీల మీద ఆధారపడి బతికే పరిస్థితులే ఎక్కువ. మాంగే వాళ్లు, ఈ ఊరు వదిలేసి ఎక్కడికైనా పోదామా అనుకుంటే, ఈ ఊళ్లో వున్న పొలాన్ని అమ్మేసి, ఇంకో ఊరు పోయి అక్కడ పొలాన్ని కొనడమో, ఏదైనా వర్తకం చెయ్యడమో, జరగాలి. అది అనుకున్నంత తేలిక కాదు. ఈ ఊళ్లో పొలాన్ని అమ్మితే, దానికి సగం ధరతో అయినా డబ్బు ఇవ్వరు. భూమిని కౌలుకి ఇచ్చి వెళ్లి పోవాలంటే, ఓబీసీలకే కౌలుకి ఇవ్వాలి. ఊరు మారితే, పిల్లల చదువులు నాశనమవుతాయి. ఈ రకంగా, ఆ దళిత కుటుంబానికి ఇన్ని సమస్యలు! అసలు, వేరే ఊళ్లో మాత్రం, స్వతంత్రంగా బతకదల్చుకున్న దళితుల్ని, ఇతర కులాల వాళ్లు సుఖంగా బతకనిస్తారనేది ఏముంది? సమస్యల్ని వదిలించుకునే దారే లేదు, ఆ దళిత కుటుంబానికి.
మాంగే కుటుంబాన్ని ధ్వంసం చెయ్యాలంటే, మొదట సిద్దార్ధని నాశనం చెయ్యాలని, ఓబీసీ కుటుంబంలో కుర్రాళ్లు, విచ్చలవిడిగా మాట్లాడడం, మాంగే చిన్న కొడుకు వినగలిగాడు. అతను వెంటనే సిద్దార్ధకి, ఆ మాట చెప్పాడు. దానికి సిద్దార్ధ నవ్వాడు గానీ, పట్టించుకోలేదు. సిద్దార్ధ నమ్మని విషయం, సిద్దార్ధ మీద ఒక రోజు హఠాత్తుగా జరిగింది. ఒక సాయంత్రం వేళ, సిద్దార్ధ, మాంగే ఇంటికి వచ్చి, మాంగేతో మాట్లాడి, భయపడవద్దని చెప్పి, తన బండి మీద కండ్రీకి వెళ్లాలని బయల్దేరాడు. అటు దారి చాలా బురదగా ఉంటుంది. బురదలో మోటార్‌-సైకిల్‌ నడవక, సిద్దార్ధ, దాన్ని తోసుకుంటూ వెళ్లడం మొదలుపెట్టాడు. ఎంతో దూరం సాగక ముందే, ఓబీసీ కుర్రవాళ్లు కొందరు, బండిని తోసుకుంటూ నడుస్తూ వున్న సిద్దార్ధ మీద పడి కొట్టెయ్యడం మొదలు పెట్టేశారు. ఆ అల్లరిని దూరం నించి చూసిన ప్రియాంకా వాళ్లు, అటు పరిగెత్తి చూసేసరికి, దుండగులు పారిపోయారు. సిద్దార్ధ బురద దారిలో పడి ఉన్నాడు. ప్రియాంక, ఆ సమీపంలో కనపడ్డ దళితుల్ని పిలిస్తే, వాళ్లు సిద్దార్ధని వెంటనే కండ్రీ ఆస్పత్రికి చేర్చే ఏర్పాటు చేశారు. అదంతా ఊహాతీతంగా జరిగి, సిద్దార్ధ, చావు నించి బైట పడ్డాడు

రంగనాయకమ్మ
– 2 –
మాంగే కూతురు ప్రియాంక సైకిల్‌ మీద కాలేజీకి పోయేటప్పుడూ, వచ్చేటప్పుడూ, ఓబీసీ కులాల మొగ పిల్లలు, ఆమెని ఏడిపించడానికి చూస్తూ ఉంటారు. దాన్ని ప్రియాంక కొన్ని సార్లు పట్టించుకోదు. కొన్ని సార్లు సహించలేక, పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి చెబుతుంది. అక్కడ చెప్పినా, ఏమీ ప్రయోజనం ఉండదని ఆ పిల్లకి తెలీదు. మాంగే పొలాల చుట్టూ, శివశంకర్‌, అతిల్‌కర్‌, గ్యానిరామ్‌, విజయ కాడ్వతే, రాందాస్‌ కొస్రేల భూములున్నాయి. వీళ్లు ఓబీసీలు. మాంగే ఈ గ్రామంలో నివాసం పెట్టక ముందు, ఆ పొలాల గొడవలు ఎలా జరిగేవో మాంగేకి తెలీదు. ఇప్పుడు, మాంగే భూమిలో నించే, అందరి బళ్లూ నడిచే లాగ, 10 అడుగుల వెడల్పుతో, కొంత భూమిని వదలమని, ఓబీసీలు, గొడవలు ప్రారంభించారు. ఈ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో, ‘దుసాల’ అనే చిన్న టౌన్‌లో, సిద్దార్ధ అనే దళితుడు, పోలీస్‌ పటేల్‌గా ఉంటున్నాడు. ఆ పటేలు, మాంగేకి, ‘తగువులు వొద్దు’, వాళ్లతో ప్రమాదాలు వస్తాయి’ అని సలహాలు ఇస్తూ ఉంటాడు. ఆ సలహాతో, మాంగే తన భూమిలో నించి ఆ దారి కోసం కొంత భూమిని వదిలేశాడు. అయినా, ఓబీసీలు శాంతించలేదు. (దళితుల్ని, ‘దళిత కులాల వాళ్లు’ అనీ, దళితుల కన్నా పై వాళ్లని, ‘హిందూ కులాల వాళ్లు’ అనీ ఈ పుస్తకంలో చాలా తరుచుగా అంటూ ఉంటారు. దళితులు, బుద్ధిజం తీసుకున్నారు కాబట్టి, వారిని హిందువులుగా అనరు అనుకోవచ్చు.)
హిందూ కులాల ఓబీసీలు, తమ పశువుల్ని మాంగే పొలాల్లోకి తోలడం మానడంలేదు. మాంగే పొలాల్లో పంటలు నాశనం అయినప్పుడల్లా సురేఖ, ఆ పొలాల్లో వున్న హిందూ కులాల వాళ్లతో, ‘మీ పశువుల్ని, మా పొలాల్లోకి తోలతారేంటీ? మా పంటలు నాశనమైపోటం మీకు కనపడటం లేదా?’ అని అడుగుతూ ఉంటుంది. వాళ్లు, దాన్ని అవకాశంగా తీసుకుని, ”ఒసే, మహర్‌ కులం దానా! నువ్వు మమ్మల్ని అడుగుతావా?” అని, ఆ కులం పేరే ఎత్తి ఆమెని మళ్లీ మళ్లీ తిడతారు. ఆ తిట్లన్నీ, ఆ పొలాల్లో వున్న వాళ్లందరూ వింటూనే ఉంటారు. ”దళిత కులాల కన్నా మా కులాలు చాలా గొప్పవి” అని ఓబీసీలు నమ్ముతూ ఉంటారే గానీ, ”అసలు కుల విధానమే తప్పు! ఈ విధానం ప్రకారం అయితే, మనకన్నా గొప్ప కులాలు ఉన్నట్టు మనం ఒప్పుకోవలిసిందే” అనుకోరు. తమ కులాల వరకే చూసుకుని, ఆ గ్రామంలో తామే గొప్ప కులాల వారు కాబట్టి, దళితుల్ని తిడుతూనే ఉంటారు. సురేఖ కొన్నిసార్లు నిస్సహాయంగా ఊరుకుంటుంది. ఊరుకోలేనప్పుడు, పోలీసుస్టేషన్‌కి పరిగెత్తి, తనని కులం పేరుతో తిట్టారనీ, పొలాల్లో అందరూ ఆ తిట్లు విన్నారనీ, పోలీసులకు అంతా చెపుతుంది. పోలీసులు, ఆ ఫిర్యాదుని ఏ చట్టాల కింద తీసుకోవాలో అలా తీసుకోరు కదా? కొన్నిసార్లు సరిగానే తీసుకున్నా, తర్వాత ఆ ఫిర్యాదు మీద ఏ ఫలితమూ కనపడదు. సురేఖని తిట్టిన శివశంకర్‌ అనే ఓబీసీ ఒకసారి, తమ కులం వాళ్లని కొందర్ని వెంటేసుకుని మాంగే పాక ముందుకు వచ్చి, ”మా మీద పోలీసులకు ఫిర్యాదులు చేశారంటే, మీ అంతు చూస్తాం” అని చెప్పి వెళ్లాడు. సురేఖ, శివశంకర్‌ మీద ఒకసారి పెట్టిన కేసు, కోర్టులో విచారణకి వచ్చింది గానీ, సురేఖకి సాక్షులు లేరు! శివశంకర్‌ సురేఖని కులం పేరుతో తిట్టడం విన్న ఓబీసీలెవ్వరూ ఆ మాటని కోర్టులో చెప్పడానికి ఇష్టపడలేదు. దళితుల్లోనే ఒకరిద్దరు, సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధపడినా, వాళ్లని, పోలీసుస్టేషన్‌ వాళ్లు, ఏదేదో చెప్పి, కోర్టుకి రావొద్దన్నారు. దీనికి కారణం, పోలీసుస్టేషన్‌ వాళ్లు, సురేఖని తిట్టిన వ్యక్తి నించి, కొంత లంచం సంపాదించి ఉంటారు. ఈ అర్థంతో, ఈ పుస్తకం రాసిన రచయిత ఆనంద్‌, ఈ సందర్భంలో, ‘అందులో పోలీసుల పాత్ర గణనీయమైంది’ అన్నారు. సాక్షులు లేరు కాబట్టి, సురేఖని కులం పేరుతో ఒకరు తిట్టడం నిజం కాదని, కోర్టు తేల్చింది. తిట్టిన వాడికి ఏ శిక్షా పడలేదు. అసలు, ఆ తిట్టడమే జరగలేదని.
మాంగే మీద చుట్టుపట్ల వాళ్ల తగువులు ఆగడం లేదు. అసలు మాంగే పేరు మీద వున్న భూమి, 5 ఎకరాలే కాదు, 7 ఎకరాల, 12 గుంటలు. కానీ ఆ భూమి అంతా, మాంగే ఆధీనంలోకి ఎప్పుడూ రాలేదు. మాంగే, తన భూమి కొలతల్ని సరిగా చెప్పమని, భూమిని కొలిచే శాఖకి ఒకసారి ఫిర్యాదు చేశాడు. కానీ, దాని వల్ల ఏదీ జరగలేదు. మాంగే ఇక సరిపెట్టుకుని 5 ఎకరాలతో ఊరుకున్నాడు. ఓబీసీల మధ్య కూడా భూముల తగువులు ఉన్నప్పటికీ, అవి, దళితులతో వున్న తగువుల వంటివి కావు. దళితుడితో, గొడవలు ఆగిపోతే, అది హిందూ కులాలకు నచ్చదు. దళితుడితో ఎప్పుడూ ఏదో ఒక గొడవ ఉండాలి. ఓబీసీలు, ఒక వింత గొడవ మొదలుపెట్టారు. పోలీస్‌ పటేల్‌ అయిన సిద్దార్ధ, మాంగేకి బంధువే. మాంగే కొంచెం అమాయకుడు, భయస్తుడు. సిద్దార్ధ కూడా దళితుడే అయినా, అతనికి కొంత ఎక్కువ భూమి ఉంది. దాన్ని సాగు చెయ్యడానికి, దుసాల టౌన్‌కి, ఖైర్లాంజీ నించి ఓబీసీ కూలీలు కూడా వెళ్తారు. మాంగేకి ఏ గొడవ వచ్చినా, సిద్దార్ధ, మాంగే ఇంటికి వస్తూ ఉంటాడు. సిద్దార్ధ, సురేఖతో అక్రమ సంబంధానికి వస్తుంటాడని, ఓబీసీ కుటుంబాల వాళ్లందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు.
ప్రియాంకని, హిందూ కులాల కుర్రాళ్లు వేధించడం ఎక్కువై, ప్రియాంక తన కష్టాన్ని ఒకసారి సిద్దార్ధకి చెప్పుకుంది. ప్రియాంకని లైంగికంగా వేధించిన యోగేష్‌ అనే ఓబీసీ కుర్రవాడి ఇంటికి వెళ్లాడు సిద్దార్ధ. ఈయన పోలీసు పటేల్‌ కాబట్టీ, ఆస్తిపరుడు కాబట్టీ, ఇతని మాటకి, హిందూ కులాల్లో కూడా కొంత విలువ ఉంటుంది. ఆ నమ్మకంతో వెళ్లాడు సిద్దార్ధ. వెళ్లి, ఆ కుర్రాడినీ, అతని తండ్రినీ, కొంత హెచ్చరించాడు. అది రాత్రి అవడం వల్ల, సిద్దార్ధ, మాంగేతో మాట్లాడుతూ మాంగే దగ్గరే ఉండిపోయాడు. పోలీస్‌ పటేల్‌ వచ్చి, తమని మందలించినందుకు, యోగేష్‌ కుర్రాడికి, పౌరుషం వచ్చింది. తన కులం వాళ్లని, 25 మందిని వెంటేసుకుని, మాంగే పాక దగ్గిరికి వెళ్లాడు. ప్రియాంకని తను ఏదో అన్నందుకు పోలీసులకు ఫిర్యాదు చేయవద్దనీ, అలా చేస్తే, తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారనీ హెచ్చరించి వెళ్లాడు. సిద్దార్ధ అక్కడే వుండి అదంతా విన్నాడు. ‘ఏదో వాగితే వాగాడులే. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాత్రం, ఏం జరుగుతుంది? ఫిర్యాదుల వల్ల, మన పరిస్థితి మరింత దిగజారుతుంది’ అని సిద్దార్ధ, మాంగే కుటుంబంలో అందరికీ నచ్చ చెప్పాడు. ప్రియాంకని బాధ పడొద్దన్నాడు.
ఆనాటితో కూడా గొడవలు తగ్గలేదు. (ఇది చదవడానికి నాకు చాలా భయంగా వుంది. ఆ తగువులన్నిటినీ, మాంగే కుటుంబం ఎలా భరించిందో, అర్థం కావడం లేదు.) హిందూ కులాల వాళ్లు, ‘మాంగే కుటుంబాన్ని హత మార్చి తీరాలి, తప్పదు, హత మారుస్తాం’ అని ఎక్కడబడితే అక్కడ వాగేస్తున్నారు. ఆ వాగుళ్లన్నీ దళితుల దగ్గిరే! ఆ దళితులు, కొంత సానుభూతితో, ఆ వాగుళ్లన్నిటినీ, వీళ్లకి చెపుతున్నారు. ‘అలాగే వాగుతార్లే! అవన్నీ బెదిరింపులే. మనం జాగ్రత్తగా వుంటే సరిపోతుంది’ అని వాళ్లు ధైర్యం కూడా చెపుతున్నారు. సురేఖా వాళ్లు కొన్నాళ్లు, ధైర్యంగా సహిస్తూనే ఉన్నారు. అయినా, ‘వాళ్లని హతమారుస్తాం’ అనే మాటలు వింటున్నకొద్దీ సహించలేక సురేఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘మమ్మల్ని హత మారుస్తారంట’ అని, ఆ మాటల్ని తమకు ఎవరెవరు చెప్పారో, అవన్నీ చెప్పింది. సురేఖ పోలీసులకు ఈ ఫిర్యాదు చేసింది, 2006, సెప్టెంబరు 1న. ఎప్పటిలాగే, పోలీసులు ఆ ఫిర్యాదుని పట్టించుకోలేదు. పట్టించుకుని వుంటే, ”హతమారుస్తాం” అని అన్నవాళ్ల దగ్గిరికి వెళ్లి, వాళ్లని గట్టిగా హెచ్చరించడం జరుగుతుందేమో! (పోలీసు ఇన్‌స్పెక్టర్లు నిజంగా, తమ హెచ్చరికలు నిజాయితీ గా చేసి వుంటే, లంచాల జోలికి పోకుండా వుంటే, సమస్యల్లో వున్న వాళ్లకి తప్పకుండా రక్షణ ఇవ్వగలు గుతారు.) హిందూ కులాల వాళ్లు, దేనికి తెగించా రంటే, మొదట సిద్దార్ధనే చావగొట్టదలిచారు.
సిద్దార్ధ దళితుడైనా 50 ఎకరాలు గల ఆస్తిపరుడు. అదే గాక, కిరోసిన్‌ ఏజెన్సీ వుంది అతనికి. ‘దుసాల’లో, రాజకీయంగా పలుకుబడి ఉన్నవాడు. మాంగే కుటుంబానికి ఓబీసీలతో గొడవలు వచ్చినప్పుడల్లా, ‘హిందూ కులాలతో గొడవలు వొద్దు, వ్యవసాయం పనులూ, పిల్లల్ని చదివించుకోటం – ఇవే చూసుకోండి’ – అని సిద్దార్ధ, సురేఖా వాళ్ళకి ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. సిద్దార్ధ మాటల్ని మాంగే ఇంట్లో అందరూ చాలా శ్రద్ధగా తీసుకుని, అలాగే ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. కానీ, ఒక్కోసారి పొలాల్లో ఏదో ఒక గొడవ వస్తుంది. అవతలి వాళ్లు, వీళ్లని చెత్త తిట్లు తిడతారు. అది భరించలేక, వీళ్లు నిర్భయంగా జవాబులు చెపుతారు. ఈ దళితులలాగే ఇంకా రెండు మూడు దళిత కుటుంబాలు వున్నా, వాళ్లు, మాంగే కుటుంబం మీద వ్యతిరేకులు కాకపోయినా, వాళ్లు ఓబీసీలతో నిర్మొహమాటంగా ప్రవర్తించలేరు. ఆ దళితులకు, ఓబీసీల మీద ఆధారపడి బతికే పరిస్థితులే ఎక్కువ. మాంగే వాళ్లు, ఈ ఊరు వదిలేసి ఎక్కడికైనా పోదామా అనుకుంటే, ఈ ఊళ్లో వున్న పొలాన్ని అమ్మేసి, ఇంకో ఊరు పోయి అక్కడ పొలాన్ని కొనడమో, ఏదైనా వర్తకం చెయ్యడమో, జరగాలి. అది అనుకున్నంత తేలిక కాదు. ఈ ఊళ్లో పొలాన్ని అమ్మితే, దానికి సగం ధరతో అయినా డబ్బు ఇవ్వరు. భూమిని కౌలుకి ఇచ్చి వెళ్లి పోవాలంటే, ఓబీసీలకే కౌలుకి ఇవ్వాలి. ఊరు మారితే, పిల్లల చదువులు నాశనమవుతాయి. ఈ రకంగా, ఆ దళిత కుటుంబానికి ఇన్ని సమస్యలు! అసలు, వేరే ఊళ్లో మాత్రం, స్వతంత్రంగా బతకదల్చుకున్న దళితుల్ని, ఇతర కులాల వాళ్లు సుఖంగా బతకనిస్తారనేది ఏముంది? సమస్యల్ని వదిrangayaలించుకునే దారే లేదు, ఆ దళిత కుటుంబానికి.