– ఆర్టీఐకి సమాధానమివ్వని పీఎంఓ ఆర్టికల్‌ 370 రద్దు.. 
– జమ్ముకాశ్మీర్‌ విభజనపై అధికారిక పత్రాల విడుదలకు నిరాకరణ 

జమ్మూకాశ్మీర్‌ విషయంలో మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న ధోరణి అనేక అనుమానాలకు, ఆందోళనలకు తావిస్తోంది. ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజన నిర్ణ యాల్ని ఏకపక్షంగా తీసుకొవటంతో అక్కడి ప్రజల రోజువారీ జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వేలాదిమంది సాధా రణ పౌరుల్ని నిర్బంధించటమేగాక, రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకొని వారి ప్రాథమిక హక్కుల్ని అణిచివేస్తోందని మేథావులు, పౌరహక్కుల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అధికారిక పత్రాల సమాచారాన్ని బహిర్గతం చేయడానికి ప్రధాని కార్యాలయం(పీఎంఓ) నిరాకరిస్తోంది. ఈ అంశంపై పీఎంఓలో దాఖలైన ఆర్టీఐ దరఖాస్తుకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా తిరస్కరించింది.
ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజనపై అధికారిక పత్రాల సమాచారాన్ని వెల్లడించండంటూ లక్నోకు చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్‌ నూతన్‌ ఠాకూర్‌ పీఎంఓను కోరారు. అయితే ఈ దరఖాస్తును తిరస్కరిస్తున్నామని తెలుపుతూ ఆగస్టు 21న పీఎంఓలోని కేంద్ర ప్రభుత్వ సమాచార అధికారి వెల్లడించారు. ఆర్టీఐ చట్టంలోని ఏ నిబంధన ప్రకారం దరఖాస్తును తిరస్కరించారో తెలుపులేదు. ‘తగిన పరిశీలన’ చేసిన మీదట దరఖాస్తును తిరస్కరించామని పీఎంఓ సమాచార అధికారి వెల్లడించారు. ఆర్టీఐ చట్టంలోని ఏ నిబంధన ప్రకారం దరఖాస్తును తిరస్కరించారో తెలుపకుండా ఇలా సమాధానమివ్వటాన్ని డాక్టర్‌ నూతన్‌ ఠాకూర్‌ తప్పుబడుతున్నారు. దీనిపై నూతన్‌ ఠాకూర్‌ ‘అప్పిలెట్‌ అథారిటీ’కి లేఖ రాశారు.
ఏ నిబంధన ప్రకారం తిరస్కరించారు :

ఆర్టీఐ దరఖాస్తుదారు నూతన్‌ ఠాకూర్‌ 
ఆర్టికల్‌ 370 నిర్వీర్యం, రాష్ట్ర విభజనపై అధికారిక సమాచారాన్ని కోరుతూ పీఎంఓలోని సీపీఐఓకు దరఖాస్తు చేశాను. వివిధ ప్రభుత్వ కార్యాలయాల మధ్య జరిగిన సమాచార మార్పిడిని(నోట్‌ కాపీలు) కూడా కోరాను. దరఖా స్తును ‘తగిన పరిశీలన’ చేసిన మీదట సమాచారం ఇవ్వటానికి తిరస్కరిసుతన్నామని పీఎంఓ వెల్లడించింది. చట్ట ప్రకారం ఇది సరైంది కాదు. చట్టంలోని నిబంధనల ప్రకారం దరఖాస్తును తిరస్కరించాలి తప్ప, ఇలా సాధారణరీ తిలో చేయకూడదు. ‘తగిన పరిశీలన చేసిన మీదట’ అనేది అర్థంపర్థం లేని కారణం. పీఎంఓ నిర్ణయానికి చట్టపరంగా ఏవిధంగానూ ఆమోదం లేదు.

 

(Courtacy Nava Telangana)