హైదరాబాద్‌ : గాంధీలో మెరుగైన చికిత్స అందిస్తున్నామనీ ప్రభుత్వం చెబుతుండగా, అవసరమైన సదుపాయాలు లేవని రోగులు, ప్రతిపక్షాలు అంటూనే ఉన్నాయి. కాగా, ఆదివారం మరణించిన జర్నలిస్ట్‌ మనోజ్‌ చివరి మాటలుగా స్నేహి తులతో మరణానికి ముందుచేసిన చాటింగ్‌ సంభాషణగా వైరల్‌ అవుతున్న విషయాలు గాంధీలో వైద్యసౌకర్యాల లేమిని ఎత్తిచూపుతున్నాయి. ఆ ఆస్ప త్రిలో ఆక్సిజన్‌ పెట్టడం లేదనీ, తనను ప్రయివేటు ఆస్పత్రికి తరలించాలని మనోజ్‌ తన స్నేహితులను కోరినట్టు అందులో ఉన్నది. ఇటీవల గర్భిణీ వర్షాసింగ్‌ మరణంతో పాటు గతంలో భోజనం, వైద్యసదుపాయా లేమీ సరిగా కల్పించడం లేదని ఆరోపణలు చేసినసంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం అలాం టిదేమి లేదని కొట్టిపారే సింది. మరోవైపు వెయ్యి వెంటిలేటర్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినప్ప టికీ కేంద్రం ఇప్పటి వరకూ అందుబాటులోకి తేలేదు.

Courtesy Nava Telangana