– 7గంటల 40నిమిషాల్లోనే..వివాదాస్పదంగా.. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర విభజన
– ఎన్నడూ లేనివిధంగా ఒకే సెషన్‌లో 35 బిల్లులకు ఆమోదం
– ఏకపక్షంగా చట్టాల్ని సవరిస్తోన్న మోడీ సర్కార్‌

ఏ ఒక్క బిల్లూ పార్లమెంట్‌ కమిటీ పరిశీలనకు ఇవ్వలేదు : రాజకీయ విశ్లేషకులుజమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర విభజన బిల్లుతో సహా అనేక వివాదాస్పద బిల్లులను ముందస్తుగా సభలో తెలుపకుండా, మోడీ సర్కార్‌ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని మేథావులు, పౌరహక్కుల నేతలు హెచ్చరిస్తున్నారు. 7 గంటలా 40 నిమిషాల వ్యవధిలో జమ్మూకాశ్మీర్‌ను రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభలో ప్రవేశపెట్టిన రోజే రెండు బిల్లులు, లోక్‌సభలో ఒక బిల్లు ఆమోదం పొందాయి. లోక్‌సభ, రాజ్యసభలో రాజకీయ బలాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాల గొంతును మోడీ సర్కార్‌ అణిచివేసిందన్న విమర్శలు వెల్లువెత్తాయి.
అత్యంత వివాదాస్పదమైన జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర విభజన బిల్లు, వేతన బిల్లులు, జాతీయ వైద్య కమిషన్‌ బిల్లు, తలాక్‌ బిల్లు…మొదలైనవి పార్లమెంట్‌లో కొన్ని గంటల వ్యవధిలో ఆమోదం పొందాయి. ఇందులో ఏ ఒక్క బిల్లు కూడా పార్లమెంట్‌ కమిటీ పరిశీలనకు ఇవ్వకుండా మోడీ సర్కార్‌ వ్యవహరించిన తీరు ఢిల్లీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పదేండ్లలో ఎన్నడూలేని విధంగా ఒక పార్లమెంట్‌ సెషన్‌లో (బడ్జెట్‌ సమావేశాల్లో) 35 బిల్లులు ఆమోదం పొందటం గమనార్హం. చట్టాల్ని సవరించటంలో మోడీ సర్కార్‌ ఏకపక్షంగా వెళ్తోందని రాజకీయ విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.
బడ్జెట్‌ సమావేశాల్లో 28 చట్ట సవరణ బిల్లుల్ని మోడీ సర్కార్‌ ప్రవేశపెట్టింది. వాటిని కనీసం అధ్యయనం చేసే సమయాన్ని ప్రతిపక్షాలకు ఇవ్వకుండా కేంద్రం వ్యవహరించిన తీరును రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. పార్లమెంట్‌ సమావేశాలు, ఆమోదం పొందిన బిల్లులకు సంబంధించి ఎన్జీఓ సంస్థ ‘పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌’ తాజా నివేదికను ఉటంకిస్తూ రాజకీయ విశ్లేషకులు పై వ్యాఖ్యలు చేశారు. ఇంతకూ ఆ నివేదికలో ఏముందంటే…
8 2009లో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో 10 బిల్లులు ఆమోదం పొందాయి. మళ్లీ 2018లో ఇలాగే ఒకే సెషన్‌లో 10 బిల్లులు ఆమోదం పొందాయి.
8 కొద్దిరోజుల క్రితం ముగిసిన 2019 బడ్జెట్‌ సెషన్‌లో ఆమోదం పొందిన మొత్తం బిల్లులు 35. వీటిపై చర్చ జరిగిన సగటు సమయం 3గంటలు.
8 యూపీఏ-1 హయాంలో 60 బిల్లులు, యూపీఏ-2 హయాంలో 71 బిల్లులు పార్లమెంట్‌ కమిటీ పరిశీలనకు ఇచ్చారు.

బిల్లు పేరు చర్చలో చర్చా పాల్గొన్నవారి సంఖ్య సమయం

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు 28 11 గంటలా 57 నిమిషాలు
జాతీయ మెడికల్‌ కమిషన్‌ బిల్లు 30 11 గంటలు
మోటార్‌  వెహికల్‌ బిల్లు 29 10 గంటలు
ఉపా బిల్లు 28 9గంటలు
ఆర్టీఐ చట్ట సవరణ 23 8గంటలు
బ్యాంకు దివాళా 18 7గంటలు
కోడ్‌ వేజెస్‌ బిల్లు 22 7గంటలా 48 నిమిషాలు
జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర విభజన బిల్లు 31 7గంటలా 40 నిమిషాలు
ఆధార్‌ సవరణ 26 8గంటలు
భారతీయ వైద్య మండలి 23 7గంటలు
ఎన్‌ఐఏ 20 6గంటలు
ఎస్‌ఈజెడ్‌ బిల్లు 13 5గంటలు
కంపెనీల బిల్లు 11 3గంటలా 31 నిమిషాలు

 

(Courtacy Nava Telangana)